Matthew 3

మత్తయి 03 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

కొన్ని అనువాదాలు పాత నిబంధన వచనాలను మిగతా భాగం కన్నా కాస్త కుడి వైపున ముద్రించాయి. ULT లో కూడా పాత నిబంధన నుండి ఎత్తి రాసిన వచనాలు ఇలానే కనిపిస్తాయి. వ. 3.

ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు

పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి.

ఫలం అనేది లేఖనాల్లో వాడిన సాధారణ పదం. రచయితలు మంచి లేక చెడు ప్రవర్తన ఫలితాలను వర్ణించడానికి ఈ పదం వాడారు. ఈ అధ్యాయంలో మంచి ఫలం అంటే దేవుని అజ్ఞల ప్రకారం నడుచుకున్న దాని ఫలితం. (చూడండి: /WA-Catalog/te_tw?section=other#fruit)

ఇంకా ఈ అధ్యాయంలో ఇతర అనువాద సమస్యలు

దేవుని రాజ్యం దగ్గరగా ఉంది.

యోహాను ఈ మాట పలికినప్పుడు దేవుని రాజ్యం నెలకొని ఉన్నదో లేక రాబోతున్నదో తెలియదు. ఇంగ్లీషు అనువాదాలు తరచుగా “సమీపించింది” అనే పదబంధం ఉపయోగిస్తుంది. కానీ ఈ మాటలు తర్జుమా చెయ్యడం కష్టం. ఇతర వాచకాలు “దగ్గర పడింది” “వస్తూ ఉంది” వంటి పదబంధాలు వాడుతున్నాయి.

Matthew 3:1

General Information:

మత్తయి బాప్తిస్మమిచ్చే యోహాను పరిచర్యను వర్ణించే కథనం ఇక్కడ మొదలౌతున్నది. వ. 3 లో మత్తయి ప్రవక్త యెషయా మాటలు ఎత్తి రాస్తూ బాప్తిస్మమిచ్చే యోహాను యేసు పరిచర్య సిద్దం చెయ్యడానికి దేవుడు నియమించిన వార్తాహరుడని తెలియజేస్తున్నాడు.

In those days

ఇది యోసేపు అతని కుటుంబం ఈజిప్టు వదిలి నజరేతుకు వెళ్ళిన చాలా సంవత్సరాల తరువాత జరిగిన విషయం. బహుశా యేసు తన పరిచర్య ప్రారంభించబోతున్న సమయంలో జరిగింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొంత కాలం తరువాత” లేక “కొన్ని సంవత్సరాల తరువాత.

Matthew 3:2

Repent

ఇది బహు వచనం. యోహాను ఇక్కడ జనసమూహంతో మాట్లాడుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

the kingdom of heaven is near

ఈ పదబంధం దేవుని రాజ్యం దేవుడు రాజుగా పాలించే స్థితిని సూచిస్తున్నది. ఈ పదబంధం మత్తయి సువార్త ఒక్క దానిలోనే కనిపిస్తున్నది. సాధ్యమైతే మీ అనువాదంలో పరలోకం అనే పదం వాడండి. ప్రత్యామ్నాయ అనువాదం: పరలోకం లో ఉన్న మన దేవుడు త్వరలో తనను రాజుగా కనపరచుకుంటాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 3:3

For this is he who was spoken of by Isaiah the prophet, saying

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: యెషయా ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నది బాప్తిస్మమిచ్చే యోహాను గురించి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

The voice of one calling out in the wilderness

దీన్ని ఒక్క వాక్యంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" అరణ్యంలో కేక పెడుతున్న శబ్దం వినబడింది.” లేక “అరణ్యంలో ఎవరో అరుస్తూ ఉండడం వారు విన్నారు.

Make ready the way of the Lord ... make his paths straight

ఈ పదబంధాలకు అర్థం ఒకటే. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parallelism)

Make ready the way of the Lord

ప్రభువు కోసం దారి సిద్దం చెయ్యండి. అంటే ప్రభువు వచ్చినప్పుడు అయన సందేశం వినడానికి సిద్దం కండి. మనుషులు తమ పాపాలు ఒప్పుకోవడం ద్వారా ఇది చేస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: అయన వచ్చినప్పుడు ప్రభువు సందేశం వినడానికి సిద్ధంగా ఉండండి.” లేక “పశ్చాత్తాపపడి ప్రభువు రాకకు సిద్ధ పడండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 3:4

Now ... wild honey

ఇప్పుడు"" అనే పదాన్ని ఇక్కడ కథనంలో విరామం కోసం వాడారు. ఇక్కడ మత్తయి బాప్తిస్మమిచ్చే యోహాను నేపథ్యం చెబుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-background)

wore clothing of camel's hair and a leather belt around his waist

పూర్వకాలం ప్రవక్తల్లాగా యోహాను కూడా ఒక ప్రవక్త అని చెప్పడానికి అతని వస్త్రాల గురించి రాస్తున్నాడు, ముఖ్యంగా ఏలియా ప్రవక్త. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-symaction మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 3:5

Then Jerusalem, all Judea, and all the region

యెరూషలేము,"" యూదయ, ఆ ప్రాంతం అనే పదాలు ఆ ప్రదేశాల్లో నివసించే వారిని సూచించే అన్యాపదేశాలు. అందరూ అనే మాట అతిశయోక్తి. అంటే చాలా మంది ప్రజలు వెళ్లారు అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: యెరూషలేము, యూదయ, ఆ ప్రాంతం ప్రజలు"" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-hyperbole)

Matthew 3:6

They were baptized by him

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: యోహాను వారికి బాప్తిస్మమిచ్చాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

They

యెరూషలేము, యూదయ, యోర్దాను నది చుట్టుపక్కల ప్రాంతం.

Matthew 3:7

General Information:

బాప్తిస్మమిచ్చే యోహాను పరిసయ్యులను సద్దూకయ్యులను గద్దిస్తున్నాడు.

You offspring of vipers, who

ఇది రూపకఅలంకారం. ఇక్కడ సంతానం అదే లక్షణాలు గల."" ""సర్పం అంటే ప్రమాదకరమైన జంతువు. ఇది దుష్టత్వానికి సూచన. దీన్ని వేరే వాక్యంతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఓ విషపూరిత సర్పాల్లారా! లేక “మీరు విష సర్పాల్లాగా దుష్టులు! (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

who warned you to flee from the wrath that is coming?

పరిసయ్యులను, సద్దూకయ్యులను గద్దించడానికి యోహాను వారిని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వారిని శిక్షించకుండేలా తమకు బాప్తిస్మ ఇమ్మని అడుగుతున్నారు. కానీ పాపం మాత్రం మానుకోవడం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ఈ పద్ధతిలో మీరు దేవుని ఉగ్రతను తప్పించుకోలేరు. ” లేక “కేవలం నేను బాప్తిస్మ ఇచ్చినంత మాత్రాన మీరు దేవుని ఉగ్రతను తప్పించుకోలేరు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

flee from the wrath that is coming

ఉగ్రత"" అనే పదాన్ని దేవుని శిక్షతో సమానంగా చెబుతున్నాడు ఎందుకంటే శిక్షకు ముందు ఉగ్రత వస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: రానున్న శిక్షనుండి పారిపోండి.” లేక “పారిపోండి దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 3:8

Bear fruit worthy of repentance

పదబంధం ఫలించడం అనేది రూపకఅలంకారం. ఒక వ్యక్తి క్రియలను సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు నిజంగా పశ్చాత్తాప పడ్డారని మీ క్రియలు చూపించాలి.” (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 3:9

We have Abraham for our father

అబ్రాహాము మా పూర్వీకుడు. లేదా ""మేము అబ్రాహాము సంతతి వారం. ""యూదు నాయకులు తాము అబ్రాహాము సంతతి వారు గనక దేవుడు తమను శిక్షించడు అనుకున్నారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

For I say to you

యోహాను చెప్పబోతున్నాడనడానికి ఇది బలం చేకూరుస్తున్నది.

God is able to raise up children for Abraham even out of these stones

దేవుడు అబ్రాహాముకు శారీరిక సంతతిని రాళ్ల మూలంగా పుట్టించగలడు.

Matthew 3:10

Connecting Statement:

బాప్తిస్మ మిచ్చే యోహాను పరిసయ్యులు, సద్దూకయ్యులను తెగనాడుతున్నాడు.

Already the ax has been placed against the root of the trees. So every tree that does not produce good fruit is chopped down and thrown into the fire

ఈ రూపకఅలంకారం అర్థం దేవుడు పాపులను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలిపేది. దీన్నిక్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు చెడు కాయలు కాసే ప్రతి చెట్టును నరకడానికి గొడ్డలి మరియు తగలబెట్టడం కోసం అగ్ని సిద్దం చేసుకున్నాడు.” లేక “ఒక వ్యక్తి చెడు పండ్లు కాసే చెట్టు నరికి తగలబెట్టడం కోసం గొడ్డలి సిద్దం చేసుకున్నట్టు మీ పాపాల కోసం మిమ్మల్ని శిక్షిస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 3:11

for repentance

మీరు పశ్చాత్తాప పడిన దానికి గుర్తుగా

But he who comes after me

యోహాను తరువాత రానున్న వాడు యేసు.

is mightier than I

నాకన్నా ప్రాముఖ్యమైన వాడు.

He will baptize you with the Holy Spirit and with fire

ఈ రూపకఅలంకారం యోహాను బాప్తిస్మని రాబోయే రోజుల్లో ఉండబోయే అగ్ని బాప్తిస్మ తో పోలుస్తున్నది. అంటే యోహాను బాప్తిస్మ వారి పాపాలను సంకేతార్ధంగా మాత్రమే పరిహరిస్తుంది. సాధ్యమైతే మీ అనువాదంలో ఈ పోలిక యోహాను బాప్తిస్మ కోసం ఉపయోగించండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 3:12

His winnowing fork is in his hand to thoroughly clear off his threshing floor

ఈ రూపకఅలంకారం క్రీస్తు న్యాయవంతులను పాపుల నుండి వేరు చేసే విధానాన్ని ఒకడు గోదుమ గింజలను పొట్టు నుండి వేరు చేయడంతో పోలుస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: క్రీస్తు పంటికోల చేతబట్టుకున్న మనిషి లాగా ఉన్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

His winnowing fork is in his hand

ఇక్కడ తన చేతిలో అంటే ఆ వ్యక్తి చర్య తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: క్రీస్తు సిద్ధంగా ఉన్నాడు గనక పంటి కోల చేతబట్టుకున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

winnowing fork

పంటి కోల అంటే గోదుమలను గాలిలోకి ఎగరేసి మంచి విత్తనాలను తాలు ధాన్యం నుండి వేరు చేసే పరికరం. బరువైన గింజలు నేలపై పడతాయి. అనవసరమైన తప్ప గింజలు గాలికి ఎగిరిపోతాయి. ఇది ఒక ముచ్చ ఆకారంలో ఉంటుంది కానీ చెక్కతో చేసిన గడపకు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-unknown)

to thoroughly clear off his threshing floor

క్రీస్తు పంటి కోల చేబూని కళ్ళం శుభ్రం చెయ్యడానికి సిద్ధపడిన వాడి వలె ఉన్నాడు.

his threshing floor

గట్టి గింజలను పొట్టు నుండి అయన వేరు చేసే నేల

gather his wheat into the storehouse ... burn up the chaff with fire that can never be put

ఇది దేవుడు న్యాయవంతులను దుర్మార్గుల నుండి వేరు చేస్తాడని సూచించే రూపకఅలంకారం. న్యాయవంతులు గోదుమ గింజలు రైతు ధాన్యం కొట్టులోకి వెళ్లినట్టు పరలోకానికి వెళతారు. దేవుడు ఆరిపోని మంటల్లో తక్కిన వారిని దహిస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

can never be put out

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నేను కాల్చి వేస్తాను (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 3:13

Connecting Statement:

ఇక్కడ సన్నివేశం బాప్తిస్మమిచ్చే యోహాను యేసుకు బాప్తిస్మ ఇచ్చే చోటుకు మళ్ళుతున్నది.

to be baptized by John

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: యోహాను ఆయనకు బాప్తిస్మ ఇచ్చేలా (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 3:14

I need to be baptized by you, and do you come to me?

యోహాను యేసు అడిగిన దానికి ఆశ్చర్యాన్ని వ్యక్తపరచడానికి ఒక ప్రశ్నఅడుగుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం నాకన్నా నువ్వు ఎక్కువ ప్రాముఖ్యం గల వాడివి. నేను నీకు బాప్తిస్మ ఇవ్వకూడదు. నువ్వే నాకు ఇవ్వాలి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Matthew 3:15

for us

ఇక్కడ మనం అంటే యేసు, యోహాను. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-inclusive)

Matthew 3:16

Connecting Statement:

బాప్తిస్మమిచ్చే యోహాను గురించిన కథనం ఇక్కడితో అయిపోయింది. అతడు యేసుకు బాప్తిస్మ ఇచ్చాక ఏమి జరిగిందో ఇది వర్ణిస్తున్నది.

After he was baptized

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చిన తరువాత.” (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

behold

ఇదుగో"" అనే మాట ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించమని చెబుతున్నది.

the heavens were opened to him

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: యేసు ఆకాశం తెరుచుకోవడం చూశాడు” లేక “దేవుడు యేసుకు పరలోకాలను తెరిచాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

coming down like a dove

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) ఆత్మ ఒక పావురం ఆకారంలో ఉంది అని చెప్పే సామాన్య అర్థం అయి ఉండవచ్చు. లేక 2) ఇది ఆత్మ యేసు పైకి మెల్లగా యేసు పైకి దిగి వచ్చిందని చెప్పే ఉపమాలంకారం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-simile)

Matthew 3:17

a voice came out of the heavens saying

యేసు పరలోకం నుండి వచ్చిన స్వరం విన్నాడు. ఇక్కడ స్వరం అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు పరలోకం నుండి మాట్లాడాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Son

ఇది యేసుకు ఒక ప్రాముఖ్యం అయిన బిరుదు. ఆయనకు దేవునితో ఉన్న సంబంధాన్ని తెలుపుతున్నది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)