Matthew 2

మత్తయి 02 సామాన్య వ్యాఖ్య

నిర్మాణము, పరిమాణము

కొన్ని అనువాదాల్లో పద్య భాగంలో లైన్లు మిగతా లైన్లకన్నా కాస్త కుడివైపుకు చూపుతాయి. ULT లో కూడా వ.6 మరియు 18 లో పాత నిబంధన వచనాలను సూచించడానికి ఈ పద్ధతే ఉంది.

ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు

అయన నక్షత్రం

ఈ పదాలు బహుశా జ్ఞానులు దేన్నీ అయితే ఈ ఇశ్రాయేల్ జాతి కొత్త రాజుకు సూచన అని భావించారో అది అయి ఉండవచ్చు. (చూడండి: /WA-Catalog/te_tw?section=kt#sign)

ఈ అధ్యాయంలో ఇతర అనువాద సమస్యలు

జ్ఞానులు

ఇంగ్లీషు అనువాదాలు ఈ పదబంధాన్ని తర్జుమా చెయ్యడానికి వేరువేరు పదాలు వాడతాయి. మాజై జ్ఞానులు. వీళ్ళు శాస్త్రజ్ఞులు లేక జ్యోతిష్యులు అయి ఉండవచ్చు. వీలైతే దీన్ని సాధారణ పదం “జ్ఞానులు” తో తర్జుమా చెయ్య వచ్చు.

Matthew 2:1

General Information:

ఇక్కడ కథనంలో కొత్త అంశం ఆరంభం అవుతున్నది. అధ్యాయం చివరి వరకూ కొనసాగుతుంది. మత్తయి ఇక్కడ యూదుల రాజును హతమార్చడానికి చేసే ప్రయత్నం గురించి రాస్తున్నాడు.

Bethlehem of Judea

బేత్లేహేము యూదయ రాష్ట్రంలో ఉంది.

in the days of Herod the king

అక్కడ రాజు హేరోదు.

Herod

ఇతడు మహా హేరోదు.

learned men from the east

నక్షత్రాలను పరిశీలించే తూర్పు వారు.

from the east

యూదయకు తూర్పున వీరు ఉంటారు.

Matthew 2:2

Where is he who was born King of the Jews?

నక్షత్రాలను పరిశీలించడం ద్వారా వీరికి అర్థం అయింది ఏమిటంటే రాజు కానున్న ఒకడు పుట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడు అని తెలుసుకోవాలని వీరి అన్వేషణ. ప్రత్యామ్నాయ అనువాదం: "" యూదుల రాజు కానున్న బిడ్డ పుట్టాడు. అయన ఎక్కడ?

his star

ఆ బిడ్డ ఆ నక్షత్రానికి హక్కుదారుడైన యజమాని అని వారు అనడం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన్ని గురించి చెబుతున్న నక్షత్రం” లేక “ఆయన పుట్టుకతో సంబంధం ఉన్న నక్షత్రం

in the east

తూర్పున అది ఉదయించింది లేక ""మేము మా దేశంలో ఉండగా

worship

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) ఆ బిడ్డను దైవంగా భావించి పూజించాలని వారి ఉద్దేశం లేక 2) మానవపరమైన రాజుగా గౌరవించాలని. మీ భాషలో ఈ రెండు అర్థాలూ ఇచ్చే పదం ఉన్నట్టయితే దాన్ని ఇక్కడ ఉపయోగించాలి.

Matthew 2:3

he was troubled

హేరోదు ఈ బిడ్డ తన స్థానంలో రాజు అవుతాడని ఆందోళన చెందాడు.

all Jerusalem

ఇక్కడ యెరూషలేము అంటే అక్కడి ప్రజానీకం. అంతేకాక అంతా అంటే చాలామంది. ఎంతమంది ఆందోళన పడ్డారో నొక్కి చెప్పడం కోసం మత్తయి ఈ సంగతిని అతిశయోక్తిగా చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: యెరూషలేములోని చాలామంది (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-hyperbole)

Matthew 2:4

General Information:

వ. 6లో ప్రజల ప్రధాన యాజకులు, శాస్త్రులు మీకా ప్రవక్త రాసిన ప్రవచనాలు ఉదహరిస్తూ క్రీస్తు బేత్లేహేములో పుడతాడని చెప్పారు.

Matthew 2:5

In Bethlehem of Judea

బేత్లేహేము యూదయ రాష్ట్రంలో ఉంది.

this is what was written by the prophet

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: పూర్వకాలం ప్రవక్త రాసింది ఇదే (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 2:6

you, Bethlehem, ... are not the least among the leaders of Judah

మీకా బేత్లేహేము ప్రజలు అక్కడ లేకున్నావారితో ముఖాముఖిగా ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అంతేగాక, అల్పమైన అనే మాటను పాజిటివ్ పదబంధం ఉపయోగించి ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఓ బేత్లేహేము ప్రజలారా, మీ ఊరు యూదా ఉళ్ళలో అత్యంత ప్రాముఖ్యమైనది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-apostrophe మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-litotes)

who will shepherd my people Israel

మీకా ఈ పరిపాలకుడిని ఒక కాపరిగా చెబుతున్నాడు. అంటే ఆయన తన ప్రజలను ముందుండి నడిపిస్తూ శ్రద్ధ తీసుకుంటాడు అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: ఆయన నా ఇశ్రాయేల్ ప్రజలను ఒక కాపరి తన గొర్రెలను ఎలా సంరక్షిస్తాడో అలా చూసుకుంటాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 2:7

Herod secretly called the learned men

ఇతరులకు తెలియకుండా జ్ఞానులతో హేరోదు మాట్లాడాడన్న మాట.

men to ask them exactly what time the star had appeared

దీన్ని ఒక సూటి ప్రశ్నగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: అతడు వారిని అడిగాడు. 'ఈ చుక్క సరిగ్గా ఎప్పుడు కనిపించింది? (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-quotations)

what time the star had appeared

జ్ఞానులు అతనికి ఆ సంగతి చెప్పారన్న మాట. ప్రత్యామ్నాయ అనువాదం: నక్షత్రం కనిపించిన రోజు ఏది? జ్ఞానులు హేరోదుకు ఆ నక్షత్రం మొదటగా ఎప్పుడు కనిపించిందో చెప్పారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 2:8

young child

ఇది యేసును సూచిస్తుంది.

bring me word

నాకు తెలపండి, లేక చెప్పండి, తిరిగి వచ్చి సమాచారం ఇవ్వండి.

worship him

దీన్ని చూడండి మత్తయి 2: 2 లో ఎలా తర్జుమా చేసారో చూడండి. [మత్తయి 2:2] (./02.md).

Matthew 2:9

After they

తర్వాత జ్ఞానులు

they had seen in the east

తూర్పున ఉదయించిన తారను చూసి, లేక ""తమ దేశంలో చూసిన తార.

went before them

వారిని నడిపించిన, లేక “దారి చూపిన.

stood still over

ఆగిపోయింది

where the young child was

ఆ పసివాడు ఉన్న చోటికి పైగా.

Matthew 2:11

Connecting Statement:

ఇక్కడ సన్నివేశం మరియ, యోసేపులు బాల యేసు నివసిస్తున్న చోటుకు మారింది.

They went

జ్ఞానులు వెళ్లారు.

They fell down and worshiped him

యేసును పూజించడానికి వారు మోకరించి తమ ముఖాలు నేలకు అనించారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-symaction)

their treasures

ఇక్కడ కానుకలు అంటే వాటిని వారు మోసుకుని వచ్చిన పెట్టెలు లేదా సంచులు. ప్రత్యామ్నాయ అనువాదం: కానుకలు తెచ్చిన పేటికలు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 2:12

God warned them

అటు తరువాత, దేవుడు ఆ జ్ఞానులను హెచ్చరించాడు. దేవునికి హేరోదు ఆ బిడ్డకు హాని తలపెట్టిన సంగతి తెలుసు.

dream not to return to Herod, so

దీన్ని ఒక సూటి ప్రశ్నగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కలలో చెప్పాడు, ‘హేరోదు రాజు దగ్గరకు తిరిగి వెళ్ళకండి,' "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-quotations)

Matthew 2:13

General Information:

వ. 15లో, మత్తయి హోషేయ ప్రవక్త మాటలు ఎత్తి రాస్తున్నాడు. క్రీస్తు కొంతకాలం ఐగుప్తులో గడుపుతాడు.

they had departed

జ్ఞానులు వెళ్ళిపోయారు.

appeared to Joseph in a dream

యోసేపు కలలో అతని దగ్గరకు వచ్చాడు.

Get up, take ... flee ... Remain ... you

దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఏక వచన రూపాలు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

until I tell you

ఈ మాటల సంపూర్ణ అర్థాన్ని స్పష్టం చెయ్యాలి. ప్రత్యామ్నాయ అనువాదం: తిరిగి రావడానికి ప్రమాదమేమీ లేదని నేను చెప్పినప్పుడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

I tell you

ఇక్కడ నేను అంటే దేవుడు. దేవదూత దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు.

Matthew 2:15

He remained

అంటే యోసేపు, మరియ, యేసు ఈజిప్టులో ఉండిపోయారు. ప్రత్యామ్నాయ అనువాదం: వారు నివసించారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

until the death of Herod

హేరోదు వెంటనే చనిపోలేదు మత్తయి 2:19. ఈ మాటలు వాళ్ళు ఈజిప్టులో ఎంతకాలం ఉన్నారో తెలుపుతున్నాయి. అంటే హేరోదు అప్పుడే చనిపోయాడని కాదు గానీ.

Out of Egypt I have called my son

నా కుమారుణ్ణి నేను ఐగుప్టు నుండి పిలిచాను.

my son

హోషేయ గ్రంథంలో ఇది ఇశ్రాయేలు ప్రజలకు వర్తిస్తుంది. దేవుని కుమారుడు, యేసు విషయంలో ఇది నెరవేరింది అని చెప్పడానికి మత్తయి దీన్ని ప్రస్తావించాడు. ఇక్కడ కుమారుడు అనే పదం స్థానంలో ఒక్కడే కుమారుడు లేక మొదటి కుమారుడు అనే అర్థం వచ్చేలా తర్జుమా చెయ్యండి.

Matthew 2:16

General Information:

ఈ విషయాలు హేరోదు మరణం తరువాత జరిగాయి. వీటిని మత్తయి [మత్తయి 2:15]లో చెప్పాడు. (../02/15.md). (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-events)

Connecting Statement:

ఇక్కడ సన్నివేశం మళ్ళీ హేరోదు దగ్గరకు వచ్చింది. జ్ఞానులు తనను మోసం చేసారని తెలుసుకుని అతడు ఏమి చేసాడో చెబుతున్నది.

he had been mocked by the learned men

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: జ్ఞానులు తనను బోల్తా కొట్టించి అవమానించారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

He sent and killed all the male children

హేరోదు పిల్లలను తానే చంపలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: అతడు తన సైనికులకు మగ పిల్లలు అందరినీ చంపమని ఆజ్ఞ ఇచ్చాడు.” లేక “అక్కడి మగ పిల్లలను చంపమని సైనికులను పంపాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

two years old and under

2 సంవత్సరాలు లేక అంతకన్నా తక్కువ వయసు గల (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-numbers)

according to the time

కాలాన్ని బట్టి

Matthew 2:17

General Information:

మత్తయి యిర్మియా ప్రవక్త మాటలను ఎత్తి చెబుతూ బెత్లెహేము ప్రాంతం మగ పిల్లల మరణం లేఖనాల ప్రకారం జరిగింది అని చూపుతున్నాడు.

Then was fulfilled

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నెరవేరింది” లేక “హేరోదు క్రియలు దీనిని నెరవేర్చాయి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

what had been spoken through Jeremiah the prophet

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: చాలా కాలం క్రితం ప్రభువు ప్రవక్త యిర్మీయా మూలంగా పలికినది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 2:18

A voice was heard ... they were no more

మత్తయి ప్రవక్త యిర్మీయా గ్రంథంలో ఉన్న మాటలు ఎత్తి రాస్తున్నాడు.

A voice was heard

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: మనుషులు ఆ స్వరం విన్నారు” లేక “అక్కడ గొప్ప శబ్దం వచ్చింది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Rachel weeping for her children

రాహేలు దీనికి అనేక సంవత్సరాలకు ముందు జీవించింది. మరణించిన రాహేలు, తన సంతతి కోసం విలపిస్తున్నది.

she refused to be comforted

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఎవరూ ఆమెను ఓడర్చ లేక పోయారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

because they were no more

తన పిల్లలు వెళ్ళి పోయి మరిక ఎన్నడూ తిరిగి రారు గనక. ఇక్కడ లేక పోవడం అనే మాట చనిపోయారని చెప్ప డానికి సున్నితమైన పదం. ప్రత్యామ్నాయ అనువాదం: వారంతా చనిపోయారు గనక (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-euphemism)

Matthew 2:19

Connecting Statement:

ఇక్కడ సన్నివేశం ఐగుప్టుకు మళ్ళుతున్నది. అక్కడ యోసేపు, మరియ, బాల యేసు నివసిస్తున్నారు.

behold

స్థూల కథనంలో మరొక ఉపాఖ్యానం ఇక్కడ మొదలవుతున్నది. ఇంతకు ముందు సంఘటనల్లోని వారు కాకుండా వేరే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మీ భాషలో దీన్ని సూచించే విధానం ఉండి ఉంటుంది.

Matthew 2:20

those who sought the child's life

ఇక్కడ బాలుణ్ణి చంప వెదికే వారు అంటే బాబును చంపడానికి చూసిన వారు. ""ప్రత్యామ్నాయ అనువాదం: అతణ్ణి చంపడానికి చూసిన వారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-euphemism)

those who sought

ఇది హేరోదు రాజు అతని సలహాదారులను సూచిస్తున్నది.

Matthew 2:22

Connecting Statement:

[మత్తయి 2:1] లో మొదలైన కథనం భాగం ముగింపు (../02/01.md) యూదుల కొత్త రాజును చంపడానికి హేరోదు ప్రయత్నాలు.

But when he heard

కానీ యోసేపు విన్నప్పుడు

Archelaus

ఇది హేరోదు కుమారుని పేరు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-names)

he was afraid

యోసేపు భయపడ్డాడు.

Matthew 2:23

what had been spoken through the prophets

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" ప్రభువు చాలా కాలం క్రితం ప్రవక్తల ద్వారా మాట్లాడినది."" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

he would be called a Nazarene

ఇక్కడ అయన అంటే యేసు. గతకాలపు ప్రవక్తలు యేసును మెస్సియ లేక క్రీస్తు అని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: క్రీస్తు నజరేయుడు అని మనుషులు అంటారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-names)