Matthew 12

మత్తయి 12 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

కొన్ని అనువాదాలు చదవడానికి వీలుగా పద్య భాగాన్ని కొంచెం కుడి వైపుకు ముద్రిస్తాయి. ULT లో కూడా పాత నిబంధన నుండి ఎత్తి రాసిన వచనాలు ఇలానే కనిపిస్తాయి. 12:18-21లో పాత నిబంధన నుండి ఎత్తిరాసిన మాటలు అలానే ఉన్నాయి.

ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు

సబ్బాతు

ఈ అధ్యాయంలో దేవుని మనుషులు సబ్బాతును పాటించేదాని గురించి విస్తృతంగా రాసి ఉంది. యేసు పరిసయ్యులు చేసిన నియమాలు మనుషులు సబ్బాతును పాటించడం ఇంకా కష్టంగా చేస్తున్నాయి. (చూడండి: /WA-Catalog/te_tw?section=kt#sabbath)

""ఆత్మకు వ్యతిరేకంగా దైవదూషణ“

ఇది ఏమిటో ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. మనుషులు జరిగించే క్రియలా లేక మరొకటా? ఎలాటి మాటలు వారు పలికితే అది పాపం అవుతుంది? అయితే, వారు బహుశా పరిశుద్ధాత్మను, ఆయన పనిని అవమానపరిస్తే ఇలా జరుగుతుంది. పరిశుద్ధాత్మ చేసే పనిలో ఒక భాగం మనుషులు తాము పాపులమని అర్థం చేసుకునేలా చెయ్యడం. తమకు దేవుని క్షమాపణ అవసరమని వారు గ్రహించాలి. కాబట్టి, పాపం మానుకోని ఎవరైనా బహుశా ఆత్మకు వ్యతిరేకంగా దైవదూషణ చేస్తున్నారు. (చూడండి: /WA-Catalog/te_tw?section=kt#blasphemy మరియు /WA-Catalog/te_tw?section=kt#holyspirit)

ఇంకా ఇలా కూడా అనువాదం చెయ్యవచ్చు ఈ అధ్యాయంలో ఇతర అనువాద సమస్యలు

సోదరసోదరీలు

ఒకే తల్లిదండ్రులు ఉన్న మనుషులను సోదరుడు” “సోదరి అని పిలుచుకుంటారు. అలాటివారిని తమ జీవితాల్లో ప్రాముఖ్యమైన వారుగా చూస్తారు. కొందరు ఒకే తాతలు ఉన్న వారిని సోదరుడు” “సోదరి అని పిలుచుకుంటారు."" ఈ అధ్యాయంలోయేసు తనకు అలాటి ప్రాముఖ్యం మనుషులు పరలోకంలోని తన తండ్రికి లోబడే వారే అని చెప్పాడు.(చూడండి: /WA-Catalog/te_tw?section=kt#brother)

Matthew 12:1

General Information:

ఇది కథనంలో కొత్త భాగం ఆరంభం. ఇక్కడ మత్తయి యేసు పరిచర్యకు పెరుగుతున్న వ్యతిరేకత గురించి రాస్తున్నాడు. ఇక్కడ, పరిసయ్యులు యేసు శిష్యులు సబ్బాతు రోజున చేలో ధాన్యం నలుపుకుని తినడాన్ని విమర్శిస్తున్నారు.

At that time

ఇది కథనంలో కొత్త భాగం. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొంత కాలం తరువాత.

grainfields

ధాన్యం పండించే స్థలం. ఇది తెలియకపోతే ధాన్యం అనే మాట స్పష్టంగా లేకపోతే రొట్టెలు చేసుకునే గింజలు పండించే చోటు అని తర్జుమా చెయ్యవచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-unknown)

pluck heads of grain and eat them

ఇతరుల పొలాల్లో ధాన్యం తెంపుకుని తినడం దొంగతనం కిందకు రాదు. ఇక్కడ ప్రశ్న ఎవరన్నా ధర్మశాస్త్రం ప్రకారం సబ్బాతు దినాన ఇది చెయ్యవచ్చా, అన్నదే.

to pluck heads of grain and eat them

గోదుమ గింజలు తెంపుకుని వాటిని తినడం లేక “కొన్ని గింజలు తెంపి తినడం.

heads of grain

ఇది గోధుమ మొక్క పై భాగం. అందులో తయారైన కంకులు లేక గింజలు ఉంటాయి.

Matthew 12:2

do what is unlawful to do on the Sabbath

ఇతరుల పొలాల్లో ధాన్యం తెంపుకుని తినడం దొంగతనం కిందకు రాదు. ఇక్కడ ప్రశ్న ఎవరన్నా ధర్మశాస్త్రం ప్రకారం సబ్బాతు దినాన ఇది చెయ్యవచ్చా, అన్నదే.

the Pharisees

అంటే పరిసయ్యులంతా అని కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొందరు పరిసయ్యులు

See, your disciples

చూడు, నీ శిష్యులు. పరిసయ్యులు ఈ పదాన్నిశిష్యులు చేస్తున్న దాని వైపు యేసు దృష్టి మళ్ళించడానికి వాడుతున్నారు.

Matthew 12:3

Connecting Statement:

యేసు పరిసయ్యుల విమర్శకు జవాబు ఇస్తున్నాడు.

to them

పరిసయ్యులతో.

Have you never read ... with him?

యేసు ఒక ప్రశ్న పరిసయ్యులకు జవాబు ఇవ్వడం కోసం ఉపయోగిస్తున్నాడు. వారు చదివిన లేఖనాల అర్థం గురించి వారు ఏమి అర్థం చేసుకున్నారో వారిని సవాలు చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: మీరు ఏమి చదివారో నాకు తెలుసు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Matthew 12:4

the house of God

దావీదు జీవించిన కాలంలో ఇంకా ఆలయం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రత్యక్ష గుడారం” లేక “దేవుణ్ణి ఆరాధించే స్థలం.

bread of the presence

ఇది పవిత్రమైన రొట్టె. ఆ యాజకులు ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలో ఉంచుతారు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుని ఎదుట యాజకులు ఉంచే రొట్టె.” లేక “పవిత్రమైన రొట్టె (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

those who were with him

దావీదుతో ఉన్నవారు.

but lawful only for the priests

కానీ, ధర్మశాస్త్రం ప్రకారం, యాజకులు మాత్రమే దాన్ని తినాలి.

Matthew 12:5

Connecting Statement:

యేసు పరిసయ్యులకు జవాబు కొనసాగిస్తున్నాడు.

Have you not read in the law that ... but are guiltless?

యేసు పరిసయ్యుల విమర్శకు జవాబుగా ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. వారు చదివిన లేఖనాల అర్థం గురించి వారు ఏమి అర్థం చేసుకున్నారో వారిని సవాలు చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: మీరు మోషే ధర్మశాస్త్రం చదివారు...కానీ దోషం ఉండదు.” లేక “ధర్మశాస్త్రం దోషం లేదని బోధిస్తున్నది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

profane the Sabbath

సబ్బాతు దినాన ఏమి చెయ్యాలి? ఇతర దినాల్లో చేసినది చెయ్యాలి.

are guiltless

దేవుడు వారిని శిక్షించడు. లేక “దేవుడు వారిని దోషులుగా ఎంచడు.

Matthew 12:6

I say to you

ఇది యేసు తరువాత చెబుతున్న దానికి ప్రాధాన్యతనిస్తుంది.

one greater than the temple

ఆలయం కన్నా ఎక్కువ ప్రాముఖ్యం గలవాడు. యేసు తనను గురించి గొప్పవాడు అని చెప్పుకుంటున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

Matthew 12:7

General Information:

వ. 7లో యేసు పరిసయ్యులను గద్దించడానికి ప్రవక్త హోషేయ మాటలు గుర్తు చేస్తున్నాడు.

Connecting Statement:

యేసు పరిసయ్యులకు జవాబివ్వడం కొనసాగిస్తున్నాడు.

If you had known what this meant, 'I desire mercy and not sacrifice,' you would not have condemned the guiltless

ఇక్కడ యేసు లేఖనం ఎత్తి గుర్తు చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ప్రవక్త హోషేయ ఇది చాలాకాలం క్రితం రాశాడు: 'నేను కరుణ కోరుతున్నాను, బలి కాదు.' మీకు ఇది అర్థం అయితే నిర్దోషులను దోషులుగా ఎంచే వారు కాదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

I desire mercy and not sacrifice

మోషే ధర్మశాస్త్రంలో దేవుడు ఇశ్రాయేలీయులకు బలులు ఇమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. దీని అర్థం దేవుడు బలుల కంటే కరుణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు.

I desire

ఈ సర్వనామం నేను అంటే దేవుడు.

the guiltless

దీన్ని విశేషణంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దోషులు కాని వారిని. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-nominaladj)

Matthew 12:8

Son of Man

యేసు తన గురించే చెబుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

is Lord of the Sabbath

సబ్బాతును పరిపాలించే వాడు. లేక “మనుషులు సబ్బాతు దినాన ఏమి చెయ్యవచ్చు అనే ఆజ్ఞలు రూపొందించే వాడు.

Matthew 12:9

General Information:

ఇక్కడ యేసు ఒక మనిషిని సబ్బాతు దినాన స్వస్థ పరిచినప్పుడు పరిసయ్యులు విమర్శించిన సన్నివేశం మొదలౌతున్నది.

Then Jesus left from there

యేసు ఆ పొలాల్లో నుండి వెళ్ళిపోయాడు. లేక “అప్పుడు యేసు వెళ్ళిపోయాడు.

their synagogue

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) వారి అంటే ఆ ఊరి యూదులు. ప్రత్యామ్నాయ అనువాదం: సినగోగు లేక 2) వారి అంటే యేసు ఇప్పుడే మాట్లాడిన పరిసయ్యులు, ఇది ఊరి సినగోగు లేక సమాజమందిరం సభ్యులు ఇతర యూదులు హాజరైన స్థలం. వారి అంటే ఆ సినగోగు స్వంత దారులైన పరిసయ్యులు కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు హాజరైన సినగోగు.

Matthew 12:10

Behold

“ఇదిగో” అనే పదం కథనంలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడని మనలను హెచ్చరిస్తున్నది. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది..

a man who had a withered hand

చచ్చుబడిన చేతులు గల మనిషి లేక “అవిటి చెయ్యి గల మనిషి.

The Pharisees asked Jesus, saying, Is it lawful to heal on the Sabbath? so that they might accuse him of sinning

పరిసయ్యులు యేసు పాపం చేస్తున్నట్టు ఆరోపించగోరారు. కాబట్టి వారు ఆయన్ని అడిగారు. 'సబ్బాతు దినాన స్వస్థ పరచడం ధర్మశాస్త్రసమ్మతమేనా?'

Is it lawful to heal on the Sabbath

మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి సబ్బాతు దినాన స్వస్థ పరచకూడదు.

so that they might accuse him of sinning

వారు మనుషుల ఎదుట యేసుపై నేరం మోపకూడదు అనుకున్నారు. పరిసయ్యులు యేసును జవాబు కోరారు. మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెబితే ఆయన్ను వారు న్యాయ తీర్పరి ఎదుటికి తీసుకుపోయి ధర్మశాస్త్రం మీరినట్టు నేరం మోపవచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 12:11

Connecting Statement:

యేసు పరిసయ్యుల విమర్శకు జవాబు ఇస్తున్నాడు..

What man would there be among you, who, if he had just one sheep ... would not grasp hold of it and lift it out?

యేసు పరిసయ్యులకు జవాబు ఇవ్వడానికి ఒక ప్రశ్న వాడుతున్నాడు. సబ్బాతు దినాన ఏ పనులు చెయ్యవచ్చని వారు భావిస్తున్నారో చెప్పమని సవాలు చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: మీలో ఎవరికైనా ఒకే గొర్రె ఉంటే దాన్ని గుంటలో నుండి బయటకు తియ్యరా? (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Matthew 12:12

How much more valuable, then, is a man than a sheep!

మరింకెంత ఎక్కువగా"" అనే పదబంధం ఈ ప్రతిపాదనకు బలం చేకూరుస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""గొర్రె కన్నా మనిషి విలువైన వాడు కాడా!” లేక “గొర్రె కన్నా మనిషి ఎంత విలువైన వాడో ఆలోచించండి.

it is lawful to do good on the Sabbath

సబ్బాతు దినాన మంచి చేసే వారు ధర్మశాస్త్రం పాటిస్తున్నారు.

Matthew 12:13

Then Jesus said to the man, ""Stretch out your hand.

దీన్ని సూటి ప్రశ్నగా ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అప్పుడు యేసు ఆ మనిషికీ తన చెయ్యి చాపమని అజ్ఞాపించాడు. /WA-Catalog/te_tm?section=translate#figs-quotations)

to the man

చచ్చుబడిన చేతులు గల ఆ మనిషితో

Stretch out your hand

నీ చేతులు చాపు లేక “నీ చేతులు నిటారుగా చెయ్యి.

He stretched

ఆ మనిషి చేతులు చాపాడు.

it was restored to health

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: అది బాగు అయింది.” లేక “అది మళ్ళీ మామూలుగా అయింది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 12:14

plotted against him

యేసుకు హాని చేయాలని చూశారు.

were seeking how they might put him to death

యేసును ఎలా చంపాలా అని చర్చించుకున్నారు.

Matthew 12:15

General Information:

యెషయా ప్రవచనాల్లో ఒకటి ఇక్కడ యేసు చేసిన క్రియల మూలంగా ఎలా నెరవేరింది అని రాసి ఉంది.

As Jesus perceived this, he

యేసుకు పరిసయ్యులు వేస్తున్న పథకం తెలుసు.

withdrew from

వెళ్ళిపోయాడు.

Matthew 12:16

not to make him known to others

తనగురించి ఎవరితోనూ చెప్పవద్దని చెప్పాడు.

Matthew 12:17

that it might come true, what

అది నిజం అయ్యేలా"" అనే పదబంధాన్ని ఒక కొత్త వాక్యంగా ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది నెరవేరేలా.

what had been said through Isaiah the prophet, saying

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు చాలాకాలం క్రితం ప్రవక్త యెషయా ద్వారా చెప్పినది

Matthew 12:18

Connecting Statement:

ఇక్కడ మత్తయి ప్రవక్త యెషయా మాటలు చెప్పడం ద్వారా యేసు పరిచర్య మూలంగా లేఖనం నెరవేరింది అని చెబుతున్నాడు.

See

చూడండి, లేదా “వినండి” లేక “నేను మీకు చెబుతున్న దానిపై దృష్టి పెట్టండి.

my ... I

ఈ మాటలు ఎక్కడ వచ్చినా అవి దేవునికే వర్తిస్తాయి. యెషయా దేవుడు తనకు చెప్పినది రాశాడు.

my beloved one, in whom my soul is well pleased

అతడు నాకు ఇష్టమైన వాడు. ఆయనంటే నాకెంతో అనందం.

in whom my soul is well pleased

ఇక్కడ ఆత్మ అంటే మొత్తం వ్యక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: అయన విషయంలో నేకు ఆనందం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-synecdoche)

he will proclaim justice to the Gentiles

ఆ దేవుని సేవకుడు యూదేతరులతో న్యాయం జరుగుతుందని చెబుతున్నాడు. దీన్ని స్పష్టంగా ఇలా చెప్పవచ్చు, దేవుడు న్యాయం జరిగిస్తాడు. అవ్యక్త నామవాచకం""న్యాయం"" అనే దాన్ని సరైనది అని తర్జుమా చెయ్యవచ్చు. "" ప్రత్యామ్నాయ అనువాదం: జాతులకు దేవుడు ఏది న్యాయమో దాన్ని జరిగిస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-abstractnouns)

Matthew 12:19

Connecting Statement:

మత్తయి ప్రవక్త యెషయా మాటలు కొనసాగిస్తున్నాడు.

neither will anyone hear his voice

ఇక్కడ మనుషులు ఆయన స్వరం వినడం లేదు అంటే అయన బిగ్గరగా మాట్లాడడం లేదు అని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "" అయన బిగ్గరగా మాట్లాడడు"" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

He ... his

ఈ మాటలు కనిపించిన ప్రతిసారీ దేవుడు ఎన్నుకున్న సేవకుడు అని అర్థం.

in the streets

ఇది జాతీయం. అంటే బహిరంగంగా. ప్రత్యామ్నాయ అనువాదం: నగరాల్లో (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

Matthew 12:20

He

అతడు"" అని ఉన్న చోటల్లా దేవుని ఎన్నుకున్న సేవకుడు అని అర్థం.

He will not break any bruised reed; he will not quench any smoking flax

ఈ ప్రతిపాదనలు రెంటికీ ఒకటే అర్థం. ఇవి ఆ దేవుని సేవకుడు మృదువుగా దయగా ఉంటాడని చెప్పే రూపకఅలంకారాలు. నలిగిన రెల్లు” “మకమకలాడే జనపనార ఇవి రెండు గాయపడిన బలహీన మనుషులను సూచిస్తాయి. ఈ రూపకఅలంకారం గందరగోళంగా ఉంటే అక్షరార్థంగా తర్జుమా చెయ్యండి. ప్రత్యామ్నాయ అనువాదం: అయన మనుషుల పట్ల మృదువుగా దయగా ఉంటాడు. గాయపడిన వారి విషయంలో మృదువుగా దయగా ఉంటాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parallelism మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

bruised reed

దెబ్బ తిన్న మొక్క

he will not quench any smoking flax

మకమకలాడే జనపనారను ఆర్పడు లేక “మకమకలాడే జనపనార మండకుండా చెయ్యడు.

smoking flax

దీని అర్థం దీపం వత్తి మండిన తరువాత ఆరిపోయి పొగ వస్తుంది.

flax, until

దీన్ని ఒక కొత్త వాక్యంతో తర్జుమా చెయ్యవచ్చు: ""జనప నార. అయన చేసే పని

he leads justice to victory

ఎవరినన్నా విజయానికి నడిపించడం అంటే గెలిపించడం. న్యాయం గెలిచేలా చెడిపోయినవి సరి అయ్యేలా చేయడాన్ని సూచిస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: అయన ప్రతిదాన్ని సరి చేస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-abstractnouns)

Matthew 12:21

in his name

ఇక్కడ నామం అంటే మొత్తంగా వ్యక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ఆయనలో (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-synecdoche)

Matthew 12:22

General Information:

సబ్బాతు దినాన యేసు సాతాను ప్రభావం నుండి ఒక మనిషిని స్వస్థపరిచిన దాన్ని గురించి పరిసయ్యులు అన్న మాటలకు ఇక్కడ సన్నివేశం మారుతున్నది.

Then someone blind and mute, possessed by a demon, was brought to Jesus

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: అప్పుడు యేసు దగ్గరకు ఒక మనిషిని తెచ్చారు. అతడు దురాత్మ అదుపులో ఉన్న కారణాన గుడ్డి వాడుగా మూగగా ఉన్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

someone blind and mute

చూడలేని, వినలేని మనిషి.

Matthew 12:23

All the crowds were amazed

యేసు ఆ మనిషిని స్వస్థపరచడం చూసిన మనుషులంతా ఎంతగానో ఆశ్చర్యపోయారు.

the Son of David

క్రీస్తు లేక మెస్సియకు ఉన్న బిరుదు.

Son of

ఇక్కడ దీని అర్థం ""సంతతి వాడు.

Matthew 12:24

General Information:

వ. 25లో, యేసు ఆ మనిషిని దురాత్మ ప్రభావం నుండి బాగుచేసినందుకు పరిసయ్యుల అభియోగానికి జవాబు ఇస్తున్నాడు.

this miracle

అంటే దయ్యం పట్టిన గుడ్డి, మూగ మనిషిని స్వస్థపరిచిన అద్భుతం.

This man does not cast out demons except by Beelzebul

దీన్ని సకారాత్మక రీతిలోచెప్పవచ్చు. ""ఇతడు బయేల్జెబూలు సేవకుడు గనకనే దురాత్మను వెళ్ళగొట్టగలుగుతున్నాడు. "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-doublenegatives)

This man

పరిసయ్యులు యేసును తాము తిరస్కరించామని చూపడానికి పేరుతొ పిలవడం లేదు.

the prince of the demons

దురాత్మల నాయకుడు

Matthew 12:25

Every kingdom divided against itself is made desolate, and every city or house divided against itself will not stand

యేసు పరిసయ్యులకు జవాబు ఇవ్వడానికి ఒక సామెత ఉపయోగిస్తున్నాడు. ఈ రెండు ప్రతిపాదనలకు అర్థం ఒకటే. వారు బయేల్జెబూలు తన ప్రభావంతో ఇతర దురాత్మలను ఓడిస్తున్నాడు అనడం సమంజసంగా ఉంటుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-proverbs మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-parallelism)

Every kingdom divided against itself is made desolate

ఇక్కడ రాజ్యం అంటే ఆ రాజ్యంలో ఉండే వారు. దీన్ని క్రియాశీల రూపంగా తర్జుమా చెయ్యవచ్చు . ప్రత్యామ్నాయ అనువాదం: ఒక రాజ్యం అందులోని మనుషులుతమలో తాము కలహించుకుంటే అది నిలవదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

every city or house divided against itself will not stand

ఇక్కడ పట్టణం అంటే అందులో నివసించే మనుషులు. ఇల్లు అంటే కుటుంబం. తనకు వ్యతిరేకంగా తానే అంటే మనుషులు తమలో తాము కలహించుకోవడాన్నిసూచిస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ఒక పట్టణం లేక కుటుంబం అందులోని మనుషులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటే నాశనమైపోతాయి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 12:26

Connecting Statement:

యేసు అభియోగానికి జవాబు ఇస్తున్నాడు. తాను ఆ మనిషిని సాతాను ప్రభావంతో బాగు చేసానని వారు అన్నారు.

If Satan drives out Satan

ఇక్కడ సాతాను అని ఉపయోగించిన రెండవ సారి అర్థం సాతానును సేవించే దయ్యాలు. ప్రత్యామ్నాయ అనువాదం: సాతాను తన స్వంత దురాత్మలకు వ్యతిరేకంగా పని చేస్తే. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

How then will his kingdom stand?

యేసు ఈ ప్రశ్న ఉపయోగించి పరిసయ్యులు చెప్పేది తర్క బద్ధం కాదని రుజువు చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: సాతాను తనకు వ్యతిరేకంగా తానే చీలిపోతే అతని రాజ్యం నిలబడదు!” లేక “సాతాను తన స్వంత దురాత్మలకు వ్యతిరేకంగా తానే పోరాడితే అతని రాజ్యం నిలవదు! (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Matthew 12:27

Beelzebul

ఈ నామము ఒకే వ్యక్తిని సూచిస్తుంది అంటే సాతాను (వ. 26).

by whom do your sons drive them out?

యేసు పరిసయ్యులను సవాలు చెయ్యడానికి మరొక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: అప్పుడు మీ అనుచరులు కూడా దురాత్మలను బయేల్జబూలు ప్రభావంతోనే వెళ్ళగొడుతున్నారని ఒప్పుకోవాలి. కానీ, అది నిజం కాదని నీకు తెలుసు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

your sons

యేసు పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు. మీ కుమారులు అంటే వారి అనుచరులు. ఒక బోధకుడిని, నాయకుడిని అనుసరించే వారిని ఉద్దేశించి వాడే మాట ఇదే. ప్రత్యామ్నాయ అనువాదం: నీ అనుచరులు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

For this reason they will be your judges

ఎందుకంటే మీ అనుచరులు దేవుని ప్రభావంతో దురాత్మలను వెళ్ళగొడితే నా గురించి మీరు పొరపాటు పడ్డారని వారే రుజువు చేస్తున్నారు.

Matthew 12:28

Connecting Statement:

యేసు పరిసయ్యులకు జవాబివ్వడం కొనసాగిస్తున్నాడు.

But if I

ఇక్కడ “ఒకవేళ” అనేమాట యేసు తాను దురాత్మలను ఎలా వెళ్ళగొట్టాడో ప్రశ్నించడం లేదు. ఇక్కడ యేసు నిజమైన మాటను ప్రవేశ పెట్టే ప్రతిపాదన చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానీ నేను అలా చేస్తున్నాను కాబట్టి.

then the kingdom of God has come upon you

అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చింది. ఇక్కడ రాజ్యం అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. ప్రత్యామ్నాయ అనువాదం: దీని అర్థం దేవుడు మీ మధ్య తన పాలన ఆరంభించే రోజు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

come upon you

ఇక్కడ మీరు అనేది బహువచనం. అంటే ఇశ్రాయేలు ప్రజలు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Matthew 12:29

How can anyone enter the house ... belongings from his house

యేసు పరిసయ్యులకు జవాబు కొనసాగిస్తూ ఒక ఉపమానం ఉపయోగిస్తున్నాడు. యేసు తాను దురాత్మలను ఎందుకు వెళ్ళగొడుతున్నాడంటే తాను సాతాను కన్నా ఎక్కువ ప్రభావం గలవాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parables)

How can anyone enter ... without tying up the strong man first?

యేసు పరిసయ్యులకు జనసమూహానికి బోధించడానికి ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: బలవంతుడిని మొదట బంధించకుండా ఆ ఇంట్లో ఎవరూ ప్రవేశించలేరు.” లేక “ఎవరన్నా ఇంట్లో ప్రవేశించాలంటే మొదట బలవంతుడిని బంధించాలి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

without tying up the strong man first

మనిషి మొదట బలవంతుడిని బంధించ కుండా

Then he will steal

అప్పుడు దోచుకోవచ్చు. లేక “అప్పుడు దోచుకోగలుగుతారు.

Matthew 12:30

who is not with me

నన్ను సమర్థించని వాడు లేక “నాతో కలిసి పని చేయని వాడు.

is against me

నన్ను వ్యతిరేకించే లేక “నాకు వ్యతిరేకంగా పని చేసే.

the one who does not gather with me scatters

యేసు ఒక రూపకఅలంకారం ఉపయోగిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి గొర్రెల మందను పోగు చెయ్యడమో లేక వాటిని చెదరగొట్టడమో చేస్తాడు. అంటే ఆ వ్యక్తి మనుషులను యేసు శిష్యులుగా చెయ్యడానికో లేక మనుషులు యేసుని తిరస్కరించేలా చెయ్యడానికో పని చేస్తాడని యేసు అంటున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 12:31

Connecting Statement:

యేసు పరిసయ్యులకు జవాబు కొనసాగిస్తున్నాడు.

I say to you

ఇది తరువాత యేసు చెబుతున్న దానికి ప్రాధాన్యతనిస్తుంది.

say to you

ఇక్కడ నీవు బహు వచనం. యేసు నేరుగా పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు, కానీ జనసమూహానికి ఉపదేశాలు కూడా ఇస్తున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

every sin and blasphemy will be forgiven men

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు మనుషులు చేసే ప్రతి దుర్మార్గం, వారు చేసే ప్రతిపాపం క్షమిస్తాడు” లేక “దేవుడు పాపాలు చేసే, చెడుగు మాట్లాడే ప్రతి వ్యక్తినీ క్షమిస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

blasphemy against the Spirit will not be forgiven

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు పరిశుద్ధాత్మను దూషించే వారిని క్షమించడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 12:32

Whoever speaks any word against the Son of Man

ఇక్కడ పదం అంటే ఎవరన్నా చెప్పేది. ప్రత్యామ్నాయ అనువాదం: ఒక వ్యక్తి మనుష్య కుమారుని గురించి చెడు మాట్లాడితే. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

the Son of Man

యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

that will be forgiven him

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు దాన్ని బట్టి ఆ వ్యక్తిని క్షమిస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

that will not be forgiven him

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు ఆ వ్యక్తిని క్షమించడు.

neither in this world, nor in that which is to come

ఇక్కడ "" తరువాత ఈ లోకం” “రాబోతున్న"" అంటే మరణం తరువాత ఉండబోయే జీవితం. ప్రత్యామ్నాయ అనువాదం: ఈ జీవితం లేక తరువాత జీవితం.” లేక “ఇప్పుడు ఇకపై ఎప్పుడూ. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 12:33

Connecting Statement:

యేసు పరిసయ్యులకు జవాబిస్తున్నాడు.

Make a tree good and its fruit good, or make the tree bad and its fruit bad

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు. 1) ""నీవు మంచి చెట్టు నాటితే దాని కాయలు మంచివి వస్తాయి. చెడు చెట్టు నాటితే దాని కాయలు చెడ్డవి వస్తాయి "" లేక 2) ""చెట్టు కాయలు మంచివైతే నీవు దాన్ని ఒక చెట్టును మంచిదని భావిస్తావు. చెట్టు కాయలు చెడ్డవైతే నీవు చెట్టును చెడ్డది అనుకుంటావు.” ఇది ఒక సామెత. ఒక మనిషి మంచివాడో చెడ్డ వాడో గ్రహించేది ఇలానే.

good ... bad

ఆరోగ్యకరమైన... వ్యాధి గల.

a tree is recognized by its fruit

ఇక్కడ ఫలం అనేది ఒక రూపకఅలంకారం. ఒక వ్యక్తి చేసే వాటిని సూచిస్తున్నది. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఒక చెట్టు మంచిదా కాదా అనేది దాని ఫలాలను చూసి గ్రహిస్తారు.” లేక “మనుషులు ఒక వ్యక్తి మంచివాడా లేక చెడ్డవాడా అనేది ఆ వ్యక్తి కార్యకలాపాల ఫలితాలను చూసి తెలుసుకుంటారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 12:34

You offspring of vipers

ఇక్కడ సంతానం అంటే అదే లక్షణాలు కలిగియున్న. సర్పాలు విషపూరితమైన జీవులు. అంటే ప్రమాదకరమైన వాటిని ఇవి సూచిస్తాయి. [మత్తయి 3:7]దగ్గర ఇలాటి పదబంధాన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి.(../03/07.md). (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

You ... you

ఈ బహు వచనం పరిసయ్యులను ఉద్దేశించినది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

how can you say good things?

యేసు పరిసయ్యులను గద్దించడానికి ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: మీరు మంచిమాటలు పలకలేరు.” లేక “మీరు కేవలం దుర్మార్గపు మాటలే పలుకుతారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

out of the abundance of the heart his mouth speaks

ఇక్కడ హృదయం అనేది ఒక వ్యక్తి మనసు, తలంపులు అనే అర్థం ఇచ్చే అన్యాపదేశం. ఇక్కడ నోరు ఒక భాషాలంకారం. ఇది మొత్తంగా ఒక వ్యక్తికి గుర్తు. ప్రత్యామ్నాయ అనువాదం: ఒక వ్యక్తి తన నోటితో చెప్పేది అతని మనసులో ఏమున్నదో తెలియజేస్తుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-synecdoche)

Matthew 12:35

The good man from the good treasure of his heart produces what is good, and the evil man from the evil treasure of his heart produces what is evil

యేసు హృదయం గురించి అదొక పాత్ర అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి దాన్ని మంచివాటితో గాని చెడ్డ వాటితో గాని నింపుతాడు. ఇది రూపకఅలంకారం. అంటే ఒక వ్యక్తి ఏమి మాట్లాడుతాడో అతడు వాస్తవంగా ఏమిటి అనే దాన్ని అది బయటపెడుతుంది. దీన్ని ఒక పోలికగా చూపించదలచుకుంటే UST చూడండి. దీన్ని అక్షరార్థంగా కూడా తర్జుమా చెయ్యవచ్చు. . ప్రత్యామ్నాయ అనువాదం: నిజంగా మంచి మనిషి మంచి సంగతులు మాట్లాడుతాడు. నిజంగా చెడ్డవాడు చెడు విషయాలు మాట్లాడుతాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 12:36

Connecting Statement:

యేసు సాతాను ప్రభావంతో ఒక మనిషిని బాగు చేసాడన్న పరిసయ్యుల అభియోగానికి జవాబును ముగిస్తున్నాడు.

I say to you

ఇది తరువాత యేసు చెబుతున్న దానికి ప్రాధాన్యతనిస్తుంది.

people will give an account for

దేవుడు మనుషులను సంజాయిషీ అడుగుతాడు. లేక “మనుషులు దేవునికి జవాబు చెప్పుకోవలసి ఉంటుంది.

every idle word they will have said

ఇక్కడ మాట అంటే ఎవరన్నా పలికేది. ప్రత్యామ్నాయ అనువాదం: వారు పలికే ప్రతి హానికరమైన మాట. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 12:37

you will be justified ... you will be condemned

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు నిన్ను నిర్దోషిగా ప్రకటిస్తాడు. లేదా శిక్ష విధిస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 12:38

General Information:

వ. 39లో, యేసు శాస్త్రులను, పరిసయ్యులను గద్దిస్తున్నాడు.

Connecting Statement:

ఈ వచనాల్లోని సంభాషణలు యేసు సాతాను ప్రభావంతో ఒక మనిషిని బాగు చేసాడన్న పరిసయ్యుల అభియోగానికి జవాబును చెప్పిన వెనువెంటనే జరిగాయి.

we wish

మాకు చూపించు

to see a sign from you

వారు ఒక సూచన చూపమని ఎందుకు అడుగుతున్నారో స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నువ్వు చెప్పేది నిజమో కాదో రుజువు చెయ్యడానికి ఒక సూచన చూపించు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 12:39

An evil and adulterous generation seeks for a sign ... given to it

యేసు అప్పటి తరంతో మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: మీరు దుర్మార్గులైన వ్యభిచార తరం. నానుండి సూచన కోరుతున్నారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

adulterous generation

ఇక్కడ వ్యభిచార అనేది దేవునిపై నమ్మకం లేని వారిని సూచించే రూపకఅలంకారం. ప్రత్యామ్నాయ అనువాదం: అపనమ్మకం ఉన్న తరం” లేక “దేవుడు అంటే లెక్క లేని తరం (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

no sign will be given to it

యేసు వారికి సూచన ఎందుకు ఇవ్వలేదు అంటే అయన ఇప్పటికే అనేక అద్భుతాలు చేశాడు. వారు ఆయన్ను నమ్మడానికి నిరాకరించారు. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నేను సూచన ఇవ్వను” లేక “దేవుడు మీకు సూచన చూపడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

except the sign of Jonah the prophet

దేవుడు యోనా ప్రవక్తకు ఇచ్చిన సూచన తప్ప.

Matthew 12:40

three days and three nights

ఇక్కడ పగలు” “రాత్రి అంటే పూర్తి 24-గడియల సమయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మూడు పూర్తి దినాలు.” (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-merism)

the Son of Man

యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

in the heart of the earth

దీని అర్థం సమాధి గొయ్యి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

Matthew 12:41

Connecting Statement:

యేసు శాస్త్రులు పరిసయ్యులను గద్దించడం కొనసాగిస్తున్నాడు.

The men of Nineveh

నీనెవే పౌరులు.

at the judgment

తీర్పు దినాన లేక “దేవుడు మనుషులకు తీర్పు చెప్పే రోజున

this generation of people

దీని అర్థం యేసు బోధించిన రోజుల్లో ఉన్న మనుషులు.

and will condemn it

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు. 1) దోషిగా తీర్చడం ఇది నేరారోపణ. ప్రత్యామ్నాయ అనువాదం: ఈ తరం మనుషులపై నేరం మోపుతారు లేక 2) దేవుడు ఈ తరం మనుషులను దోషులుగా ఎంచుతాడు. ఎందుకంటే వారు నీనెవే వారిలాగా పశ్చాత్తాపపడ లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: "" దేవుడు ఈ తరం వారిని దోషులుగా తీరుస్తాడు."" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

and see

చూడండి. ఇది తరువాత యేసు చెప్పబోతున్న దాన్ని నొక్కి చెప్పే పధ్ధతి.

someone greater

ఎక్కువ ప్రాముఖ్యం గల వారు.

someone

యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

than Jonah is here

మీరు యేసు ప్రతిపాదనలోని అంతర్గత సమాచారం చెప్పి దీన్ని స్పష్టం చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: యోనా ఇక్కడ ఉన్నాడు. అయిన మీరు పశ్చాత్తాప పడలేదు. అందుకే దేవుడు నిన్ను దోషిగా తీరుస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 12:42

Connecting Statement:

యేసు శాస్త్రులను, పరిసయ్యులను గద్దించడం కొనసాగిస్తున్నాడు..

Queen of the South

దీని అర్థం షేబా దేశపు రాణి. “షేబా దేశం ఇశ్రాయేల్ కు దక్షిణాన ఉంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-names)

will rise up at the judgment

తీర్పుదినాన నిలబడుతుంది

at the judgment

తీర్పు దినాన లేక “దేవుడు మనుషులకు తూర్పు తీర్చేటప్పుడు."" దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండిమత్తయి 12:41.

this generation

దీని అర్థం యేసు బోధిస్తున్న కాలంలోని మనుషులు.

and condemn them

ఇలాటి దాన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండి మత్తయి 12:41. దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) "" దోషిగా తీర్చడం"" ఇది నేరారోపణ. ప్రత్యామ్నాయ అనువాదం: ఈ తరం మనుషులపై నేరం మోపుతారు లేక 2) దేవుడు ఈ తరం మనుషులను దోషులుగా తీరుస్తాడు, ఎందుకంటే వారు దక్షిణ దేశం రాణిలాగా జ్ఞాన వాక్కులు వినలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: "" దేవుడు ఈ తరం మనుషులపై నేరం మోపుతాడు."" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

She came from the ends of the earth

ఇక్కడ భూదిగంతాల “అనేది ఒక జాతీయం అంటే దూర ప్రాంతం. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆమె చాలా దూరం నుంచి వచ్చింది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

She came from the ends of the earth to hear the wisdom of Solomon

ఈ ప్రతిపాదన దక్షిణ దేశం రాణి యేసు తరం నాటి మనుషులపై నేరారోపణ ఎందుకు చేస్తుందో ఇది వివరిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ఎందుకంటే ఆమె వచ్చింది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#grammar-connect-words-phrases)

and see

చూడండి. ఇది తరువాత యేసు చెబుతున్న దానికి ప్రాధాన్యతనిస్తుంది.

someone greater

ఎక్కువ ప్రాముఖ్యం గల వాడు.

someone

యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

than Solomon is here

మీరు యేసు ప్రతిపాదనలోని అంతర్గత సమాచారం చెప్పి దీన్ని స్పష్టం చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: సోలోమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, అయినా మీరు వినలేదు. అందుకే దేవుడు మిమ్మల్ని దోషులుగా తీరుస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 12:43

Connecting Statement:

యేసు శాస్త్రులను, పరిసయ్యులను గద్దించడం కొనసాగిస్తున్నాడు.. ఒక ఉపమానం చెబుతున్నాడు.

waterless places

పొడి స్థలాలు. లేక “మనుషులు ఎవరూ నివసించని స్థలాలు.

does not find it

ఇక్కడ అది అంటే విశ్రాంతి.

Matthew 12:44

Then it says, 'I will return to my house from which I came.'

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. వేరే దాన్ని ఎత్తి రాయడం కన్నా ఒక ప్రతిపాదన అనుకోవాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""కాబట్టి మలిన పిశాచి తాను వెళ్ళిన చోటి నుండి ఇంటికి తిరిగి రావాలనుకుని.

to my house from which I came

ఇది రూపకఅలంకారం. మలిన పిశాచి ఉంటున్న మనిషి. ప్రత్యామ్నాయ అనువాదం: నేను విడిచి వచ్చిన స్థలం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

it finds that house swept out and put in order

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: మలిన పిశాచి తాను నివసించిన ఇల్లు శుభ్రంగా ఊడ్చి ఉండడం చూసి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

that house swept out and put in order

మళ్ళీ, ఇల్లు అంటే మలిన పిశాచి ఉంటున్న మనిషిని సూచించే రూపకఅలంకారం. ఇక్కడ, “ఊడ్చి చక్కగా సర్ది ఉండడం"" అంటే అందులో ఎవరూ నివసించడం లేదు. యేసు అంటే మలిన పిశాచి ఒక వ్యక్తిని వదిలి పోయిన తరువాత ఆ వ్యక్తి తనలో నివసించమని పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. లేదా ఆ దురాత్మ తిరిగి వస్తుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 12:45

Connecting Statement:

వ. 43లో “మాలిన పిశాచి” అని మొదలు పెట్టిన ఉపమానం యేసు ముగించాడు.

Then it goes ... with this evil generation

యేసు ఒక ఉపమానం ద్వారా మనుషులు తనను నమ్మకపోవడం వల్ల ఉన్న ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parables)

It will be just like that with this evil generation

దీని అర్థం యేసు తరం మనుషులు ఆయనను నమ్మలేదు. ఆయన శిష్యులుగా కాలేదు. వారు ఇంతకు ముందున్న పరిస్థితి కన్నా హీనంగా తయారు అవుతుంది.

Matthew 12:46

General Information:

యేసు తల్లి, సోదరులు రావడం వల్ల ఆయనకు తన ఆధ్యాత్మిక కుటుంబం గురించి చెప్పే అవకాశం కలిగింది.

behold

“ఇదిగో” అనే పదం కథనంలో కొత్త మనుషులను గురించి మనకు ముందుగా హెచ్చరిస్తున్నది. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది..

his mother

ఈమె మరియ, మానవపరంగా యేసు తల్లి.

his brothers

వీరు బహుశా మరియకు పుట్టిన ఇతర పిల్లలు. కానీ ఇక్కడ సోదరులు అంటే యేసు బాబాయి కొడుకులు కూడా అయి ఉండవచ్చు.

seeking to speak

మాట్లాడడం కోసం వేచి ఉన్నారు.

Matthew 12:47

Someone said to him, ""Look, your mother and your brothers stand outside, seeking to speak to you.

దీన్ని సూటి ప్రశ్నగా ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: యేసుకు ఆయన తల్లి, సోదరులు ఆయనతో మాట్లాడడం కోసం బయట వేచి ఉన్నారని ఎవరో ఆయనకి చెప్పారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-quotations)

Matthew 12:48

Connecting Statement:

ఇది [మత్తయి 12:1]దగ్గర మొదలైన కథనం ముగింపు.(../12/01.md). మత్తయి యేసు పరిచర్యకు ఎదురౌతున్న వ్యతిరేకత గురించి చెబుతున్నాడు.

who told him

ఆ వ్యక్తి యేసుకు చెప్పిన సందేశం ఇక్కడ తిరిగి చెప్పడం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: యేసుతో ఆయన తల్లి సోదరులు మాట్లాడాలని కోరిన విషయం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Who is my mother and who are my brothers?

యేసు మనుషులకు బోధించడానికి ఈ ప్రశ్న ఉపయోగిస్తున్నాడు.. ప్రత్యామ్నాయ అనువాదం: నా నిజమైన తల్లి, సోదరులు ఎవరో మీకు చెబుతాను. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Matthew 12:49

See

చూడండి, లేక “వినండి” లేక “నేను మీకు చెబుతున్న దానిపై దృష్టి పెట్టండి.

here are my mother and my brothers

ఇది రూపకఅలంకారం. అంటే యేసు ఆధ్యాత్మిక కుటుంబానికి చెందిన యేసు శిష్యులు. ఇది ఆయన భౌతిక కుటుంబానికి చెంది ఉండడం కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 12:50

whoever does

ఎవరైనా సరే.

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

that person is my brother, and sister, and mother

ఇది రూపకఅలంకారం అంటే దేవునికి విధేయత చూపిన వారంతా యేసు ఆధ్యాత్మిక కుటుంబంలోని వారే. ఇది ఆయన భౌతిక కుటుంబానికి చెంది ఉండడం కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)