Matthew 11

మత్తయి 11 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

కొన్ని అనువాదాల్లో కూడా పాత నిబంధన నుండి ఎత్తి రాసిన వచనాలు మిగిలిన పాఠం కంటే పేజీపై కుడికి దూరంగా ఇలానే కనిపిస్తాయి. దీనిలో ఉల్లేఖించబడిన సామగ్రి తో ULT ఎత్తి రాసిన వచనాలు 11:10లో ఉన్నాయి.

మత్తయి 11:20 క్రీస్తు పరిచర్యలో ఒక కొత్త దశ ఇక్కడ మొదలు అవుతుందని కొందరు పండితులు భావించారు. ఎందుకంటే ఇశ్రాయేల్ జాతి ఆయన్ని తిరస్కరించింది.

ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు

దాగియున్న వెల్లడింపు.

తరువాత మత్తయి 11:20,యేసు తన గురించి తండ్రి అయిన దేవుడు తలపెట్టిన వాటిని గురించిన సమాచారం ఇవ్వడం మొదలు పెట్టాడు. అయితే తనను తిరస్కరించిన వారికి ఈ సమాచారం దాచిపెట్టాడు.(మత్తయి 11:25).

ఈ అధ్యాయంలో ఇతర అనువాద సమస్యలు

దేవుని రాజ్యం దగ్గరపడింది.

దేవుని రాజ్యం అప్పటికే ఉన్నదో, లేక యోహాను ఈ మాటలు పలికిన తరువాత వచ్చిందో స్పష్టంగా లేదు. ఇంగ్లీషు అనువాదాలు తరచుగా “సమీపించింది” అనే పదబంధం వాడుతుంది. కానీ ఈ మాటలు తర్జుమా చెయ్యడం కష్టం. వేరే వాచకాలు దగ్గర పడింది” “దగ్గరికి వచ్చింది వంటి మాటలు వాడాయి.

Matthew 11:1

General Information:

ఇది కథనంలో కొత్త భాగం ఆరంభం. మత్తయి ఇక్కడ యేసు బాప్తిసమిచ్చే యోహాను శిష్యులకు ఎలా జవాబిచ్చాడో రాస్తున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-newevent)

It came about that when

ఈ పదబంధం యేసు ఉపదేశాల నుండి మన దృష్టిని ఆ తరువాత జరిగిన దానికి మళ్లిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అప్పుడు” లేక “తరువాత.

had finished instructing

తన ఉపదేశాలు ముగించాక, లేక “చాలించిన తరువాత.”

his twelve disciples

దీని అర్థం యేసు ఎన్నుకున్న పన్నెండుమంది అపోస్తలులు.. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-numbers)

in their cities

ఇక్కడ వారి అంటే మొత్తంగా యూదులు అందరూ.

Matthew 11:2

Now

ఇది ముఖ్య కథనంలో విరామాన్ని సూచిస్తున్నది. ఇక్కడ మత్తయి కథనంలో కొత్త భాగం మొదలు పెడుతున్నాడు.

when John heard in the prison about

చెరసాలలో ఉన్న యోహాను వినినప్పుడు లేక “ఎవరో చెరలో ఉన్న యోహానుకు చెప్పినప్పుడు."" మత్తయి తన పాఠకులకు హేరోదు రాజు బాప్తిస్మమిచ్చే యోహానును చెరలో వేయించాడని చెప్పక ముందే మొదటి పాఠకులకు ఈ సంగతులు తెలిసే ఉంటాయి. ఇక్కడ కథనం అంతర్గత సమాచారం. మత్తయి తరువాత బాప్తిస్మమిచ్చే యోహాను గురించి మరింత సమాచారం ఇవ్వబోతున్నాడు. కాబట్టి బహుశా దీన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పకపోవడమే మంచిది.

he sent a message by his disciples

బాప్తిస్మమిచ్చే యోహాను తన శిష్యులను ఒక సందేశంతో యేసు దగ్గరకు పంపించాడు.

Matthew 11:3

said to him

ఈ సర్వనామం అయన అంటే యేసు.

Are you the one who is coming

మేము ఎదురు చూస్తున్నవాడివి నువ్వేనా? ఇది మెస్సియ లేక క్రీస్తును గురించి చెప్పే మరొక విధానం.

should we look for another

వేరొకరి కోసం ఎదురు చూడాలా? ఈ సర్వనామం మేము అంటే యూదులు అందరూ. కేవలం యోహాను శిష్యులు మాత్రమే కాదు.

Matthew 11:4

report to John

యోహాను చెబుతున్నాడు.

Matthew 11:5

lepers are being cleansed

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను స్వస్థ పరిచిన కుష్ట రోగులు "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

the dead are being raised back to life

ఇక్కడ లేపడం “అనేది చనిపోయి మళ్ళీ బ్రతకడానికి ఉపయోగించిన జాతీయం. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: చనిపోయిన మనుషులు మళ్ళీ బ్రతుకుతున్నారు” లేక “నేను చనిపోయిన వారు తిరిగి బ్రతికేలా చేస్తున్నాను. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive) మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

the gospel is being preached to the poor

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నేను పేదలకు సువార్త ప్రకటిస్తున్నాను. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

the poor

ఈ నామకార్థ విశేషణం నామవాచక పదబంధంగా ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: పేదలు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-nominaladj)

Matthew 11:7

Connecting Statement:

యేసు బాప్తిస్మమిచ్చే యోహాను గురించి జనసమూహాలతో మాట్లాడుతున్నాడు.

What did you go out in the desert to see—a reed ... wind?

బాప్తిస్మమిచ్చే యోహాను ఎలాటివాడో మనుషులు ఆలోచించాలని యేసు ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: మీరు గాలికి ఊగులాడే గడ్డిని చూడడానికి అరణ్యంలోకి వెళ్ళరు గదా! (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

a reed being shaken by the wind

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు. 1) యేసు యోర్దాను నది ఒడ్డున పెరిగే మొక్కల గురించి మాట్లాడుతున్నాడు. లేక 2) యేసు ఒక విధమైన మనిషిని గురించి ఒక రూపకఅలంకారం ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: తన మనసు తేలికగా ఎలాబడితే అలా మార్చుకునే మనిషి గాలికి కదలాడే గడ్డి వంటివాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

being shaken by the wind

దీన్ని క్రియాశీల రూపం గా తర్జుమా చెయ్యవచ్చు . ప్రత్యామ్నాయ అనువాదం: గాలికీ కదలాడే” లేక “గాలికి కొట్టుకుపోయే (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 11:8

But what did you go out to see—a man ... clothing?

బాప్తిస్మమిచ్చే యోహాను ఎలాటివాడో మనుషులు ఆలోచించాలని యేసు ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ మీరు ఒక మనిషి వేసుకున్న బట్టలు చూడడానికి ఎడారిలోకి వెళ్తారా?"" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

dressed in soft clothing

అంటే ఖరీదైన బట్టలు. ధనికులు ఇలాటి బట్టలు వేసుకుంటారు.

Really

ఇది పదం తరువాత వస్తున్నదన డానికి బలం చేకూరుస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నిజంగా

kings' houses

రాజుల భవనాలు

Matthew 11:9

General Information:

వ. 10లో బాప్తిస్మమిచ్చే యోహాను పరిచర్య గురించి మలాకి ప్రవక్త మాటలు నెరవేరాయని యేసు చెబుతున్నాడు.

Connecting Statement:

యేసు జనసమూహాలకు బాప్తిస్మమిచ్చే యోహాను గురించి చెప్పడం కొనసాగిస్తున్నాడు.

But what did you go out to see—a prophet?

బాప్తిస్మమిచ్చే యోహాను ఎలాటివాడో మనుషులు ఆలోచించాలని యేసు ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: కానీ ప్రవక్తను చూడాలంటే మీరు తప్పక అరణ్యంలోకి వెళ్ళాలి! (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Yes, I say to you,

మీకు చెబుతున్నాను అవును,

much more than a prophet

పూర్తి వాక్యంగా దీన్ని తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: అతడు మామూలు ప్రవక్త కాదు.” లేక “మామూలు ప్రవక్త కన్నా గొప్పవాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Matthew 11:10

This is he of whom it was written

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: చాలా కాలం క్రితం మలాకి ప్రవక్త బాప్తిస్మమిచ్చే యోహాను గురించి రాసింది ఇదే. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

I am sending my messenger

నేను” “నా""అనే సర్వనామాలు దేవుని కోసం వాడినవి. మలాకి దేవుడు చెప్పిన దాన్నే రాశాడు.

before your face

ఇక్కడ నీ అనేది ఏక వచనం, ఎందుకంటే దేవుడు మెస్సియతో మాట్లాడుతున్నాడు. అంతేగాక ముఖం అంటే మొత్తం వ్యక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: నీ ఎదుట” లేక “నీకు ముందుగా (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-synecdoche)

prepare your way before you

ఇది రూపకఅలంకారం. దీని అర్థం వార్తాహరుడు మనుషులు మెస్సియ సందేశం స్వికరించేలా వారిని సిద్ధపరుస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 11:11

Connecting Statement:

బాప్తిస్మమిచ్చే యోహాను గురించి యేసు జనసమూహాలతో మాట్లాడుతున్నాడు.

I say to you truly

నేను సత్యం చెబుతున్నాను. ఈ పదబంధం యేసు చెప్పబోతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది

among those born of women

ఆదాము ఒక స్త్రీకీ పుట్టకపోయినప్పటికీ, ఇది మనుషులు అందరినీ సూచిస్తూ చెప్పిన మాట. ప్రత్యామ్నాయ అనువాదం: జీవించిన మనుషులు అందరిలోకీ (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

no one is greater than John the Baptist

దీన్ని సకారాత్మక రీతిలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""బాప్తిస్మమిచ్చే యోహాను అందరికన్నా గొప్పవాడు” లేక “బాప్తిస్మమిచ్చే యోహాను అత్యంత ప్రాముఖ్యత గలవాడు.

the least important person in the kingdom of heaven

ఇక్కడ దేవుని రాజ్యం అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. దేవుని రాజ్యం అనే పదబంధం కేవలం మత్తయిలో మాత్రమే ఉంది. సాధ్యమైతే, మీ అనువాదంలో పరలోకం అని రాయండి. ప్రత్యామ్నాయ అనువాదం: పరలోకంలో మన దేవుని పరిపాలనలో అతి తక్కువ ప్రాముఖ్యం గల వ్యక్తి (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

is greater than he is

యోహానుకన్నా ఎక్కువ ప్రాముఖ్యం గలవాడు.

Matthew 11:12

From the days of John the Baptist

యోహాను ఆయన సందేశం బోధించడం మొదలుపెట్టిన రోజుల నుంచి. రోజులు అనే పదం బహుశా ఇక్కడ నెలలు లేక సంవత్సరాలు అయి ఉండవచ్చు.

the kingdom of heaven suffers violence, and men of violence take it by force

ఈ వచనానికి వేరు వేరు అర్థాలు చెప్పుకోవచ్చు. UST లో దీని అర్థం కొందరు మనుషులు దేవుని రాజ్యాన్ని తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాడుకుంటారు, వారు దాన్ని నెరవేర్చుకోవడం కోసం వ్యతిరేకంగా ఇతర మనుషులను బలవంతపెడతారు. కొన్ని వాచకాల్లో సానుకూల అర్థం ఇచ్చారు, దేవుని రాజ్యంలో ప్రవేశించమన్న పిలుపు ఎంత అత్యవసరం గా వినిపిస్తూ ఉన్నదంటే ఆ పిలుపుకు స్పందనగా మనుషులు తీవ్రమైన రీతిలో ముందుకు వస్తున్నారు. పాపం చెయ్యాలనే శోధన ఎదిరిస్తున్నారు. మూడవ వివరణ ఏమిటంటే బలత్కారులైన మనుషులు దేవుని మనుషులకు హాని కలిగిస్తూ దేవుడు పరిపాలించకుండా అడ్డుకుంటున్నారు.

Matthew 11:13

Connecting Statement:

యేసు బాప్తిస్మమిచ్చే యోహాను గురించి జనసమూహాలతో మాట్లాడడం కొనసాగిస్తున్నాడు.

all the prophets and the law have been prophesying until John

ఇక్కడ ప్రవక్తలు, ధర్మశాస్త్రం అంటే ప్రవక్తలు, మోషే లేఖనంలో రాసిన సంగతులు. ప్రత్యామ్నాయ అనువాదం: "" బాప్తిస్మమిచ్చే యోహాను కాలం వరకూ ప్రవక్తలు, మోషే లేఖనాల్లో ప్రవచించినది వీటిగురించే. "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 11:14

if you

ఇక్కడ మీరు అనేది బహు వచనం. అంటే జనసమూహం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

he is Elijah who was to come

అతడు"" అంటే బాప్తిస్మమిచ్చే యోహాను. బాప్తిస్మమిచ్చే యోహాను అక్షరార్థంగా ఏలియా అని కాదు. యేసు ఉద్దేశం బాప్తి స్మిచ్చే యోహాను రానున్న ఏలియా గురించిన ప్రవచనాలను నెరవేర్చాడు. లేక మరుసటి ఏలియా అతడే. ప్రత్యామ్నాయ అనువాదం: "" ప్రవక్త మలాకి ఏలియ తిరిగి వస్తాడు అన్నప్పుడు బాప్తిస్మమిచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నాడు.

Matthew 11:15

He who has ears to hear, let him hear

యేసు తాను చెప్పినది చాలా ముఖ్యమైన విషయమని అర్థం చేసుకునేందుకు, పాటించేందుకు చాలా ప్రయత్నం అవసరమని చెబుతున్నాడు. వినే చెవులు అనే పదబంధం ఇక్కడ అన్యాపదేశం. దీని అర్థం విధేయత చూపే ఉద్దేశంతో అర్థం చేసుకునే ధోరణి. ప్రత్యామ్నాయ అనువాదం: వినడానికి ఇష్టమున్నవారు వింటారు గాక.” లేక “అర్థం చేసుకునే ఇష్టం ఉన్నవారు అర్థం చేసుకుని లోబడతారు గాక. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

He who ... let him

యేసు ఇక్కడ నేరుగా తన శ్రోతలతో మాట్లాడుతున్నాడు గనక, మీరు ఇక్కడ రెండవ పురుష వాడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: మీకు వినడానికి ఇష్టం ఉంటే, వినండి.” లేక “మీరు అర్థం చేసుకోడానికి ఇష్టపడితే అర్థం చేసుకుని లోబడండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

Matthew 11:16

Connecting Statement:

యేసు జనసమూహాలతో బాప్తిస్మమిచ్చే యోహాను గురించి మాట్లాడడం కొనసాగిస్తున్నాడు.

To what should I compare this generation?

యేసు ఈ ప్రశ్నను ఉపయోగించి ఆ నాటి మనుషులకు వీధుల్లో చిన్నపిల్లలు చెప్పుకునే దానికి పోలిక చెబుతున్నాడు. ఆనాటి మనుషులు వీధుల్లో ఆటలాడుకునే పిల్లలు చేపుఉకునే మాటలతో పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ఈ తరం తీరు ఇది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

this generation

ప్రస్తుతం ఉన్న మనుషులు లేక “ఈ మనుషులు” లేక “ఈ తరం మనుషులు.

marketplace

మనుషులు క్రయవిక్రయాలు చేసే ఒక పెద్ద, బహిరంగ ప్రాంతం.

Matthew 11:17

Connecting Statement:

యేసు వ. 16లో ఆరంభించిన అది ఇలా ఉంటుంది అనే మాటలతో ఉన్న ఉపమానం కొనసాగిస్తున్నాడు.

and say ... and you did not weep

ఆ కాలంలో జీవిస్తున్న మనుషులను వర్ణిస్తూ యేసు ఒక ఉపమానం ఉపయోగిస్తున్నాడు. తమతో ఆటకు రమ్మని ఇతరపిల్లలను పిలిచే పిల్లల గుంపుతో వారిని పోలుస్తున్నాడు. అయితే, వారు ఏమి చేసినా ఆ ఇతర పిల్లలు వచ్చి కలవడం లేదు. అంటే దేవుడు ఎడారిలో ఉంటూ ఉపవాసాలు చేస్తూ ఉండే బాప్తిస్మమిచ్చే యోహాను వంటి వారిని పంపినా , లేక పాపులతో కలిసి విందులు చేసుకుంటూ ఉపవాసం జోలికి వెళ్ళని యేసు వంటివాడు వచ్చినా మనుషులు మాత్రం వినడం లేదు. మనుషులు, ప్రత్యేకించి పరిసయ్యులు, మత నాయకులు, ఇంకా మొండిగా దేవుని సత్యం అంగీకరించకుండానే ఉన్నారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parables మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-simile)

We played a flute for you

మేము అంటే వీధుల్లో కూర్చుని ఉండే పిల్లలు. ఇక్కడ మీరు బహు వచనం అంటే ఇతర గుంపు పిల్లలు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

and you did not dance

కాని మీరు ఆనందకరమైన సంగీతానికి నాట్యం చెయ్యలేదు.

We mourned

దీని అర్థం వారు మనిషి చచ్చిపోయినప్పుడు స్త్రీలు పాడే శోక గీతాలు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

and you did not weep

కానీ మీరు మాతో కలిసి శోకించలేదు.

Matthew 11:18

Connecting Statement:

యేసు జనసమూహాలతో బాప్తిస్మ మిచ్చే యోహాను గురించి మాట్లాడడం ముగిస్తున్నాడు.

not eating bread or drinking wine

ఇక్కడ రొట్టె అంటే ఆహారం. అంటే యోహాను ఎప్పుడూ ఆహారం తీసుకోలేదని కాదు. అంటే అతడు తరచుగా ఉపవాసం ఉండేవాడు. అతడు ఖరీదైన మంచి భోజనం తినే వాడు కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: తరుచుగా ఉపవాసం ఉంటూ మద్యం తాగకుండా. లేక “రచికరమైన ఆహారం తీసుకోకుండా ద్రాక్షరసం తాగకుండా. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-synecdoche మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

they say, 'He has a demon.'

దీన్ని నేరుగా చెప్పే మాటగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: అతనిలో దురాత్మ ఉన్నదని వారు అంటున్నారు.” లేక “వారు అతణ్ణి దయ్యం పట్టిన వాడు అంటున్నారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-quotations)

they say

వారు"" అని ఉన్నప్పుడల్లా ఆ తరం మనుషులు అని అర్థం. ముఖ్యంగా పరిసయ్యులు, మత నాయకులు.

Matthew 11:19

The Son of Man came

యేసు తనను గురించే మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: మనుష్య కుమారుడినైన నేను. వచ్చాను. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

came eating and drinking

ఇది యోహాను ప్రవర్తనకు వ్యతిరేకం. దీని అర్థం కేవలం మామూలు ఆహారం పుచ్చుకోవడం, ద్రాక్ష రసం తాగడం మాత్రమే కాదు. యేసు అందరి లాగానే మంచి ఆహారం తినడం, ద్రాక్షరసం తాగడం ఇష్టంగా చేసే వాడు.

they say, 'Look, he is a gluttonous man and a drunkard ... sinners!'

దీన్ని ఇలా నేరుగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయన తిండిబోతు, తాగుబోతు అంటున్నారు.” లేక “వారు అయన విపరీతంగా తిని తాగుతాడు అని నేరం మోపుతున్నారు.""మీరు మనుష్య కుమారుడు అనే దాన్ని మనుష్య కుమారుడు అయిన నేను అని తర్జుమా చేసినట్టయితే దీన్ని పరోక్ష ప్రతిపాదనగా ఉత్తమ పురుష లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నేను తిండిబోతునని, తాగుబోతునని అంటున్నారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-quotations మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

he is a gluttonous man

అతడు తిండిబోతు లేక “అస్తమానం విపరీతంగా తింటూ ఉంటాడు.

a drunkard

తాగుబోతు లేక “అస్తమానం మద్యం తాగుతూ ఉంటాడు.

But wisdom is justified by her deeds

ఈ పరిస్థితిని బట్టి యేసు ఈ సామెతను తనకు అన్వయించుకుంటున్నాడు. ఎందుకంటే మనుషులు తనను, యోహానును కూడా తిరస్కరించారు గనక అది జ్ఞానం అనిపించుకోదు. యేసు, బాప్తిస్మమిచ్చే యోహాను జ్ఞానులు. వారి చర్యల ఫలితాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-proverbs)

wisdom is justified by her deeds

ఇక్కడ జ్ఞానం అనే దాన్ని ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. ఆమె చేసిన దాన్ని బట్టి ఆమె సరి అయినది అని రుజువు అయింది. అంటే ఒక జ్ఞానవంతుని క్రియల ఫలితాలే అతడు నిజంగా జ్ఞాని అని రుజువు చేస్తాయి. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఒక జ్ఞాని చర్యల ఫలితాలు అతణ్ణి జ్ఞాని అని నిరూపిస్తాయి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-personification మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 11:20

General Information:

యేసు తాను ఇంతకుముందు అద్భుతాలు చేసిన నగరాల్లో మనుషులను మందలించడం మొదలు పెడుతున్నాడు.

rebuke the cities

ఇక్కడ నగరాలు అంటే అక్కడ నివసించే మనుషులు. ప్రత్యామ్నాయ అనువాదం: ఆ నగరాల మనుషులను మందలిస్తున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

cities

ఊళ్లు

in which most of his mighty deeds were done

క్రియాశీల రూపం వాక్యంగా తర్జుమా చెయ్యవచ్చు . ప్రత్యామ్నాయ అనువాదం: ఎక్కడైతే తన అద్భుతాలు ఎక్కువగా చేసాడో (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

mighty deeds

ఆశ్చర్య కార్యాలు లేక “ప్రభావ క్రియలు” లేక “అద్భుతాలు

Matthew 11:21

Woe to you, Chorazin! Woe to you, Bethsaida!

యేసు కొరాజీనా బేత్సయిదా నగరాల ప్రజలు అక్కడ తన మాటలు వింటున్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ వారు అక్కడ లేరు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-apostrophe)

Woe to you

మీకు ఎంత భయానకంగా ఉంటుంది! ఇక్కడ నీవు ఏక వచనం. అంటే ఆ పట్టణం. పట్టణాన్ని గాక మనుషులను ఉద్దేశించి మాట్లాడడం మరింత సహజం అనిపిస్తే దీన్ని “మీరు” అని బహువచనంలో తర్జుమా చెయ్యండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Chorazin ... Bethsaida ... Tyre ... Sidon

ఈ నగరాల పేర్లను అన్యాపదేశంగా వాటిలో ఉన్న మనుషులను ఉద్దేశించి వాడారు.(చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy మరియు /WA-Catalog/te_tm?section=translate#translate-names)

If the mighty deeds ... in sackcloth and ashes

యేసు గతంలో జరిగి ఉండడానికి అవకాశం ఉన్న ఊహాత్మక పరిస్థితినీ వర్ణిస్తున్నాడు. కానీ అలా జరగలేదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-hypo)

If the mighty deeds had been done in Tyre and Sidon which were done in you

దీన్ని క్రియాశీల రూపం లో తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నేను గనక మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు, సీదోను మనుషుల మధ్య చేసినట్టయితే (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

which were done in you

ఇక్కడ మీరు అనేది బహువచనం. అంటే కొరాజీనా బేత్సయిదా. మీ భాషలో ఎక్కువ సహజంగా ఉంటుంది అనుకుంటే ద్వంద్వ నీవు ను రెండు నగరాలకోసం ఉపయోగించవచ్చు. లేదా ఒక బహు వచనం మీరు అనే దాన్ని ఆ నగరాల మనుషుల కోసం వాడవచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

they would have repented long ago

ఈ సర్వనామం వారు అంటే తూరు, సీదోను మనుషులు.

would have repented

తాము తమ పాపాల నిమిత్తం బాధ పడుతున్నట్టు కనపరిచే వారు.

Matthew 11:22

it will be more tolerable for Tyre and Sidon at the day of judgment than for you

ఇక్కడ తూరు, సీదోను అంటే అక్కడి మనుషులు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు తీర్పు దినాన మీ మీద కంటే తూరు, సీదోను మనుషులపై ఎక్కువ కరుణ చూపుతాడు.” లేక “దేవుడు తీర్పు దినాన తూరు, సీదోను మనుషుల కంటే మిమ్మల్ని ఎక్కువగా శిక్షిస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

than for you

ఇక్కడ “నీవు” అనేది బహువచనం. అంటే కొరాజీన బేత్సయిదా. మీ భాషలో ఎక్కువ సహజంగా ఉంటుంది అనుకుంటే ద్వంద్వ నీవు ను రెండు నగరాల కోసం ఉపయోగించవచ్చు. లేదా ఒక బహు వచనం మీరు అనే దాన్ని ఆ నగరాల మనుషుల కోసం వాడవచ్చు. ఇక్కడ అంతర్గత సమాచారాన్ని స్పష్టం చెయ్యాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ఎందుకంటే నీవు నేను చేసిన అద్భుతాలు చూసి కూడా నాపై నమ్మకం ఉంచడానికి నిరాకరించావు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 11:23

Connecting Statement:

యేసు తాను ఇంతకుముందు అద్భుతాలు చేసిన నగరాల్లో మనుషులను మందలించడం కొనసాగిస్తున్నాడు.

You, Capernaum

యేసు కపెర్నహూము పట్టణం ప్రజలు తన మాటలు వింటునట్టే వారితో మాట్లాడుతున్నాడు. కానీ వారలా వినడం లేదు. ఈ సర్వనామం నీవు అనేది ఏకవచనం. అంటే ఈ రెండు వచనాల్లో కపెర్నహూము. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-apostrophe)

You

నీవు"" అని కనిపించిన చోటల్లా ఏక వచనం మీ భాషలో ఎక్కువ సహజంగా ఉంటుంది అనుకుంటే ఒక బహు వచనం మీరు అనే దాన్ని ఆ నగరాల మనుషుల కోసం వాడవచ్చు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Capernaum ... Sodom

ఈ నగరాల పేర్లు కపెర్నహూము సొదొమల్లో నివసించే మనుషులను సూచిస్తున్నాయి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

do you think you will be exalted to heaven?

నీవు పరలోకానికి ఎక్కిపోతావనుకుంటున్నావా? యేసు ఒక అలంకారిక ప్రశ్న ఉపయోగించి కపెర్నహూము మనుషులను వారి గర్వం నిమిత్తం వారిని గద్దిస్తున్నాడు. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు: ప్రత్యామ్నాయ అనువాదం: నిన్ను నీవు పరలోకానికి ఎక్కిపోయేలా చేసుకోలేవు!” లేక “ఇతర మనుషుల పొగడ్తలు నీవు పరలోకానికి ఎక్కిపోయేలా చెయ్యలేవు.” లేక “దేవుడు నువ్వు ఊహిస్తున్నట్టుగా నిన్ను పరలోకానికి ఎక్కించడు! (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

you will be brought down to Hades

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు నిన్ను పాతాళానికి పంపుతాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

For if in Sodom ... it would still have remained until today

యేసు ఇక్కడ ఒక ఊహాత్మక పరిస్థితినీ చెబుతున్నాడు:అది గతంలో జరిగి ఉండవచ్చు, కానీ అలా జరగలేదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-hypo)

if in Sodom there had been done the mighty deeds that were done in you

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నేను సొదొమ మనుషుల మధ్య చేసిన అద్భుతాలు మీ మధ్య చేసి ఉంటే (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

mighty deeds

అద్భుతాలు లేక “ప్రభావయుతమైన కార్యాలు” లేక “అద్భుతాలు

it would still have remained

ఈ సర్వనామం అది అంటే సొదొమ పట్టణం.

Matthew 11:24

I say to you

ఈ పదబంధం యేసు చెప్పబోతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది

it shall be easier for the land of Sodom in the day of judgment than for you

ఇక్కడ సొదొమ ప్రాంతం అంటే అక్కడ నివసించే మనుషులు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు తీర్పు దినాన నీ మీద కంటే సొదొమ మనుషులపై ఎక్కువ కరుణ చూపుతాడు.” లేక “దేవుడు తీర్పు దినాన సొదొమ మనుషుల కంటే మిమ్మల్ని ఎక్కువగా శిక్షిస్తాడు "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

than for you

అంతర్గత సమాచారాన్ని స్పష్టం చెయ్యాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ఎందుకంటే నేను ఎన్నో అద్భుతాలు చేయడం నీవు చూసి కూడా నీవు పశ్చాత్తాపం చూపలేదు, నాపై నమ్మకం ఉంచలేదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 11:25

General Information:

వ.25 26లో, యేసు జనసమూహం మధ్యనే తన పరలోకపు తండ్రికి ప్రార్థిస్తున్నాడు. వ. 27లో మరలా మనుషులతో మాట్లాడుతున్నాడు.

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Lord of heaven and earth

పరలోకం, భూమినీ ఏలే ప్రభువు. పరలోకం, భూమి అనే పదబంధం విభాగోక్తి. అంటే విశ్వంలోని మనుషులు అందరూ. ప్రత్యామ్నాయ అనువాదం: విశ్వం అంతటినీ ఏలే ప్రభువు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-merism)

you concealed these things ... and revealed them

ఈ సంగతులు అంటే ఏమిటి అనేది స్పష్టంగా లేదు.""మీ భాషలో దీని అర్థం స్పష్టం చేయాలంటే ప్రత్యామ్నాయ అనువాదం చేస్తే బావుంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు ఈ సత్యాలను వెల్లడి చెయ్యలేదు...చేసావు.

you concealed these things from

నీవు వీటిని దాచిపెట్టావు. లేక “నీవు వీటిని వెల్లడి చెయ్యలేదు."" వెల్లడి అయిన అనే దానికి వ్యతిరేకం అయిన క్రియాపదం.

from the wise and understanding

ఈ నామకార్థ విశేషణాన్ని ఇలా విశేషణంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: అర్థం చేసుకునే జ్ఞానం ఉన్న మనుషుల నుండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-nominaladj)

the wise and understanding

యేసు ఇక్కడ వ్యంగ్యం ఉపయోగిస్తున్నాడు. ఈ మనుషులు నిజంగా జ్ఞానం ఉన్నవారని ఆయన ఉద్దేశం కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: తాము జ్ఞానులమనుకునే మనుషులు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-irony)

revealed them

తెలుస్తారు. ఈ సర్వనామం వారు అంటే ఈ వచనంలో ముందు చెప్పిన ""ఈ విషయాలు.

to little children

యేసు ఏమీ తెలియని మనుషులను చిన్న పిల్లలతో పోలుస్తున్నాడు. యేసు తనను నమ్మిన వారు అనేక మందిని బాగా చదువుకున్నవారు అనీ తమను జ్ఞానులుగా ఉహించుకునే వారు అని చెప్పడం లేదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 11:26

for so it was well-pleasing in your sight

అనే పదబంధం నీ దృష్టిలో అనేది అన్యాపదేశం. అంటే ఒకడు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు అనేది. ప్రత్యామ్నాయ అనువాదం: దీన్ని చేయడం నీకు మంచిది అనిపిస్తే. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 11:27

All things have been entrusted to me from my Father

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నా తండ్రి అన్నిటినీ నాకు అప్పగించాడు.” లేక “నా తండ్రి మొత్తం నా చేతుల్లో పెట్టాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

All things

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) తండ్రి అయిన దేవుడు తన గురించి తన రాజ్యం గురించి అంతా యేసుకు వెల్లడి చేశాడు. లేక 2) దేవుడు సమస్త అధికారం యేసుకు ఇచ్చాడు.

my Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. అది దేవునికి, యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని వర్ణిస్తున్నది.(చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

no one knows the Son except the Father

కేవలం తండ్రికీ మాత్రమే కుమారుడు తెలుసు.

no one knows

తెలుసు"" అంటే కేవలం పరిచయం ఉండడం కాదు. అంటే ఒక ప్రత్యేక సంబంధం ఉన్నందువల్ల సన్నిహితంగా ఎరిగియుండడం.

the Son

యేసు తనను ఉత్తమ పురుషలో చెబుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

Son

దేవుని కుమారుడు యేసుకు ఇది ఒక ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

no one knows the Father except the Son

కేవలం కుమారుడు మాత్రమే తండ్రిని ఎరుగును.

Matthew 11:28

Connecting Statement:

యేసు జనసమూహంతో మాట్లాడడం ముగించాడు.

all you

మీరు” అని ఉన్నవన్నీ బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

who labor and are heavy burdened

యేసు ధర్మశాస్త్రం పాటించే ప్రయత్నంలో నిరుత్సాహం చెందిన మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు బరువైన భారాలుగా ఉన్నట్టు, వాటిని వారు మోయలేకపోతున్నట్టు చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: శక్తికి మించిన ప్రయత్నాలు చేసి నిరుత్సాహ పడిపోయిన వారు ఎవరు?” లేక “ధర్మశాస్త్రం ఆజ్ఞలను లోప రహితంగా అనుసరించాలని చూసి అలసిపోయిన వారెవరు? (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

I will give you rest

మీ భారాల నుండి మీకు విశ్రాంతి ఇస్తాను.

Matthew 11:29

Take my yoke on you

యేసు రూపకఅలంకారం కొనసాగిస్తున్నాడు. యేసు తన శిష్యులు కమ్మని మనుషులను ఆహ్వానిస్తున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

I am meek and lowly in heart

ఇక్కడ సాత్వికం” “దీనమనస్సు అంటే ప్రాథమికంగా ఒకటే అర్థం. యేసు తాను మత నాయకుల కన్నా ఎంతో దయగల వాడని వారికి చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: నేను మృదు స్వభావం గల వాడిని. లేక దీన మనస్కుడిని. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-doublet)

lowly in heart

ఇక్కడ హృదయం అనేది అన్యాపదేశం ఒక వ్యక్తి అంతరంగ స్వభావం. దీన మనస్సు అనేది జాతీయం. అంటే వినయగుణం. ప్రత్యామ్నాయ అనువాదం: వినయమనస్కుడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

you will find rest for your souls

ఇక్కడ ఆత్మ అంటే మొత్తంగా ఒక వ్యక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: నీలో నీవే విశ్రాంతి కనుగొంటావు.” లేక “నీవు విశ్రాంతి తీసుకోగలుగుతావు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-synecdoche)

Matthew 11:30

For my yoke is easy and my burden is light

ఈ పదబంధాలు రెండూ ఒకటే అర్థం ఇస్తున్నాయి. యేసు ఎవరైనా తనకు లోబడడం యూదు ధర్మశాస్త్రానికి లోబడడం కన్నా తేలిక అని నొక్కి చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: నేను నీ మీద మోపే బరువును తేలికగా మోయగలుగుతావు. ఎందుకంటే అది తేలిక. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parallelism)

my burden is light

తేలిక"" అనే పదం ఇక్కడ బరువు అనే దానికి వ్యతిరేకం, చీకటికి వ్యతిరేకం కాదు.