Matthew 10

మత్తయి 10 సాధారణ నోట్సు

ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు

పన్నెండుమంది శిష్యులను పంపడం

ఈ అధ్యాయంలోఅనేక వచనాలు ఏ విధంగా యేసు పన్నెండుమంది శిష్యులను పంపించాడో వర్ణిస్తున్నాయి. దేవుని రాజ్యం గురించి తన సందేశం వినిపించమని వారిని పంపాడు. వారు ఇశ్రాయేల్ జాతికి మాత్రమే అయన సందేశం చెప్పాలి, యూదేతరులకు కాదు.

ఈ అధ్యాయంలో ఇతర అనువాద సమస్యలు.

పన్నెండుమంది శిష్యులు

ఇక్కడ పన్నెండుమంది శిష్యుల జాబితా ఉంది:

మత్తయి:

సీమోను (పేతురు), అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, జెబెదయి కుమారుడు యోహాను, ఫిలిప్పు, బర్తోలోమయి, తోమా, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, దేశాభిమాని సీమోను, యూదా ఇస్కరియోతు.

మార్కులో:

సీమోను (పేతురు), అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, జెబెదయి కుమారుడు యోహాను (వారికి యేసు బోయనెర్గెస్ అని పేరు పెట్టాడు. అంటే, పిడుగు కుమారులు), ఫిలిప్పు, బర్తోలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, దేశాభిమాని సీమోను, యూదా ఇస్కరియోతు.

లూకాలో:

సీమోను (పేతురు), అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తోలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, సీమోను (ఇతనికి దేశాభిమాని అని పేరు), యాకోబు కుమారుడు యూదా, యూదా ఇస్కరియోతు.

తద్దయి బహుశా యాకోబు కుమారుడు యూదాయే అయి ఉండ వచ్చు.

దేవుని రాజ్యం దగ్గర పడింది

దేవుని రాజ్యం అప్పటికే ఉందా, లేక యోహాను ఈ మాటలు చెప్పిన తరువాత వచ్చిందా అనేది స్పష్టంగా లేదు. ఇంగ్లీషు అనువాదాలు తరచుగా సమీపించింది అనే పదబంధం ఉపయోగిస్తాయి. కానీ ఈ మాటలు తర్జుమా చెయ్యడం కష్టం. ఇతర వాచకాలు “దగ్గర పడింది” మొదలైన పదబంధాలు ఉపయోగిస్తాయి.

Matthew 10:1

Connecting Statement:

ఇది యేసు తన పన్నెండుమంది శిష్యులను తన పనికోసం పంపిన కథనం ఆరంభం.

called his twelve disciples together

తన 12 మంది శిష్యులకు చెప్పాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-numbers)

gave them authority

మీ వాచకం 1) దురాత్మలను వెళ్ళగొట్టడానికి, 2) వ్యాధి రోగం స్వస్థ పరచడానికి అధికారం అని స్పష్టంగా ఉండేలా చూసుకోండి.

to drive them out

దురాత్మలను వెళ్ళగొట్టడానికి

all kinds of disease and all kinds of sickness

ప్రతి వ్యాధి ప్రతి రోగం. ఈ పదాలు""వ్యాధి” “రోగం"" అనేవి ఒక దానికొకటి సంబంధం ఉన్నాయి. కానీ సాధ్యమైతే వేరువేరు మాటలుగా తర్జుమా చెయ్యండి. వ్యాధి అనేది ఒక వ్యక్తిని రోగిగా చేస్తుంది. రోగం భౌతిక బలహీనత, లేక వ్యాధి ఫలితం..

Matthew 10:2

General Information:

ఇక్కడ రచయిత పన్నెండుమంది అపోస్తలుల పేర్లు నేపథ్య సమాచారంగా ఇస్తున్నాడు.

Now

ఇది ముఖ్య కథనంలో విరామాన్ని సూచిస్తున్నది. ఇక్కడ మత్తయి పన్నెండుమంది అపోస్తలుల నేపధ్య సమాచారం ఇస్తున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-background)

twelve apostles

[మత్తయి 10:1]లో ఉన్న అదే పన్నెండుమంది శిష్యుల గుంపు (../10/01.md).

first

ఇది క్రమంలో మొదటిది, ప్రాముఖ్యతలో కాదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-ordinal)

Matthew 10:3

Matthew the tax collector

మత్తయి, పన్ను వసూలుదారుడు

Matthew 10:4

the Zealot

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు. 1) దేశాభిమాని అనేది బిరుదు. యూదులకు రోమా పాలన నుండి విముక్తి కలిగించాలని పోరాడిన వర్గం లోని వాడు. దేశభక్తుడు” లేక “జాత్యభిమాని లేక 2) దేశాభిమాని అంటే దేవుని గురించి ఆత్మ తీవ్రత గలవాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తీవ్ర అభినివేశం గలవాడు” లేక “అవేశపరుడు.

who would betray him

యేసుకు ద్రోహం చేసిన వాడు.

Matthew 10:5

General Information:

వ. 5 అయన పన్నెండుమందినీ పంపించాడని చెబుతున్నప్పటికీ యేసు ఈ సూచనలు వారిని పంపకముందే ఇచ్చాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-events)

Connecting Statement:

ఇక్కడ యేసు తన శిష్యులకు సూచనలు ఇవ్వడం మొదలు పెట్టాడు. వారు బోధించడానికి వెళ్ళినప్పుడు వారికి ఏమి ఎదురౌతాయో చెబుతున్నాడు.

These twelve Jesus sent out

యేసు ఈ పన్నెండుమందిని పంపాడు. లేక “యేసు పంపిన పన్నెండు మంది వీరే.

sent out

యేసు ఒక ప్రయోజనం ఆశించి వారిని పంపాడు.

He instructed them

వారికి ఏవి అవసరం అవుతాయో చెప్పాడు. “అజ్ఞాపించాడు.

Matthew 10:6

lost sheep of the house of Israel

ఇది రూపకఅలంకారం. ఇశ్రాయేల్ జాతి మొత్తాన్ని “కాపరికీ దూరంగా దారి తప్పిన గొర్రెలతో పోలుస్తున్నాడు.” (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

house of Israel

దీని అర్థం ఇశ్రాయేల్ జాతి. ప్రత్యామ్నాయ అనువాదం: ఇశ్రాయేలు ప్రజలు” లేక “ఇశ్రాయేల్ సంతతి వారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 10:7

as you go

ఇక్కడ మీరు బహు వచనం అంటే పన్నెండుమంది అపోస్తలులు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

The kingdom of heaven has come near

దేవుని రాజ్యం"" అనే పదబంధం అర్థం దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. ఈ పదబంధం ఒక్క మత్తయి సువార్తలో మాత్రమే ఉంది. సాధ్యమైతే, మీ అనువాదంలో పరలోకం అని రాయండి. దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండిమత్తయి 3:2. ప్రత్యామ్నాయ అనువాదం: మన దేవుడుపరలోకంలో త్వరలో తనను రాజుగా కనపరచుకుంటాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 10:8

Connecting Statement:

యేసు తన శిష్యులకు వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఏమి బోధించాలో చెబుతున్నాడు.

Heal ... raise ... cleanse ... cast out ... you have received ... give

ఈ క్రియాపదాలన్నీ బహు వచనాలు, పన్నెండుమంది అపోస్తలుల గురించినవి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

raise the dead

ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: మృతులు మళ్ళీ సజీవులయ్యేలా (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

Freely you have received, freely give

యేసు తన శిష్యులు పొందినది, వారు ఇవ్వవలసినది ఏమిటో స్పష్టంగా చెప్పలేదు. కొన్ని భాషల్లో ఈ వాక్యంలో ఈ సమాచారం తప్పకుండా ఇవ్వవలసి రావచ్చు. ఇక్కడ ""ఉచితంగా "" అంటే ఎలాటి డబ్బు తీసుకోకుండా. ప్రత్యామ్నాయ అనువాదం: ఉచితంగా నీకు దొరికింది. ఉచితంగా వేరొకరికి ఇవ్వు.” లేక “నీవు డబ్బు చెల్లించకుండా వీటిని పొందావు కాబట్టి డబ్బు వసూలు చెయ్యకుండా ఇతరులకు ఇవ్వండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Freely you have received, freely give

ఇక్కడ పొందారు అనేది రూపకఅలంకారం. కొన్ని పనులు చేసే సామర్థ్యం. అలానే ఇవ్వండి అనేది రూపకఅలంకారం. ఇతరులకు ఇచ్చే సామర్థ్యం. ప్రత్యామ్నాయ అనువాదం: ఉచితంగా వీటిని చేసే సామర్థ్యం పొందావు. ఉచితంగానే ఇతరుల కోసం వాటిని చెయ్యండి.” లేక “ఉచితంగానే ఈ పనులు చేసే సామర్థ్యం మీకు ఇచ్చాను. ఉచితంగానే వాటిని ఇతరుల కోసం చెయ్యండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 10:9

your

దీని అర్థం పన్నెండుమంది అపోస్తలులు. ఇది బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

gold, silver, or copper

ఇవి నాణాలు తాయారు చేసే లోహాలు. ఇది అన్యాపదేశంగా డబ్బును సూచిస్తున్నది. కాబట్టి మీ ప్రాంతంలో ఇవి లభ్యంకాకపోతే “డబ్బు” అని తర్జుమా చెయ్యండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

purses

దీని అర్థం బెల్టులు” లేక “డబ్బు బెల్టులు, కానీ డబ్బు తీసుకుపోవడానికి ఉపయోగించే దేన్నైనా ఇలా పిలవవచ్చు. బెల్టు అంటే గుడ్డ లేక తోలు సంచీ. దాన్ని నడుముకు కట్టుకుంటారు. ఇది తరచుగా వెడల్పుగా ఉండి డబ్బు తీసుకుపోవడానికి పనికివస్తుంది.

Matthew 10:10

traveling bag

ప్రయాణంలో సరుకులు తీసుకుపోయే సంచీ, లేక ఆహారం డబ్బు తీసుకు పోయే సంచీ.

an extra tunic

[మత్తయి 5:40]లో మీరు వాడిన పదమే వాడండి. “అంగీ.""(../05/40.md).

laborer

పనివాడు

his food

ఇక్కడ ఆహారం అంటే ఒక వ్యక్తికి అవసరం అయిన ఏదైనా. ప్రత్యామ్నాయ అనువాదం: అతనికి అవసరమైనవి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-synecdoche)

Matthew 10:11

Connecting Statement:

యేసు తన శిష్యులతో వారు వెళ్ళినప్పుడు బోధించడానికి వారు ఏమి చెయ్యాలో సూచనలు ఇస్తున్నాడు.

Whatever city or village you enter

మీరు ఒక పట్టణం లేక గ్రామంలో ప్రవేశించినప్పుడు లేక “మీరు ఏదైనా పట్టణం లేక గ్రామం వెళ్ళినప్పుడు.

city ... village

పెద్ద గ్రామం చిన్న గ్రామం లేక “పెద్ద ఊరు చిన్న ఊరు."" దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండిమత్తయి 9:35.

you

ఇది బహు వచనం మరియు పన్నెండుమంది అపోస్తలులను సూచిస్తుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

worthy

యోగ్యుడైన"" వ్యక్తి అంటే శిష్యులను ఆహ్వానించే వాడు.

stay there until you leave

ఈ ప్రతిపాదన పూర్తి అర్థం స్పష్టం చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: మీరు ఆ ఊరు వదిలిపోయే దాకా ఆ వ్యక్తి ఇంట్లో ఉండండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 10:12

As you enter into the house, greet it

శుభాలు చెప్పండి"" అనే పదబంధం అర్థం ఆ ఇంటికి శుభం కలగాలని చెప్పండి. ఆ రోజుల్లో సాధారణ శుభాలు ఈ ఇంటికి శాంతి కలుగు గాక! ఇక్కడ ఇల్లు అంటే ఆ ఇంట్లో ఉండే మనుషులు. ప్రత్యామ్నాయ అనువాదం: మీరు ఇంట్లోకి వెళుతున్నప్పుడు అందులో ఉండే మనుషులకు శుభం చెప్పండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

you

ఇది బహు వచనం మరియు పన్నెండుమంది అపోస్తలులను సూచిస్తుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Matthew 10:13

your ... your

ఈ బహు వచనం పన్నెండుమంది అపోస్తలులను సూచిస్తున్నది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

the house is worthy ... not worthy

ఇక్కడ ఇల్లు అంటే ఆ ఇంట్లో ఉండే మనుషులు. యోగ్యుడైన వ్యక్తి అంటే శిష్యులను ఆహ్వానించే వాడు. యేసు ఇలాటి వ్యక్తిని అయోగ్యునితో, పోలుస్తున్నాడు. అంటే శిష్యులను ఆహ్వానించని వాడు. ప్రత్యామ్నాయ అనువాదం: మిమ్మల్ని ఆహ్వానించే ఆ ఇంట్లో ఉండే మనుషులు” లేక “మిమ్మల్ని బాగా చూసుకునే ఆ ఇంటి వారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

let your peace come upon it

పదం అది అంటే ఇల్లు, అంటే అందులో నివసించే మనుషులు. ప్రత్యామ్నాయ అనువాదం: వారు నీ శాంతినీ పొందనివ్వు.” లేక “నీవు అభిలషించిన శాంతిని వారు పొందుతారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

if it is not worthy

పదం అది అంటే ఇల్లు, అంటే అందులో నివసించే మనుషులు. ప్రత్యామ్నాయ అనువాదం: వారు నిన్ను చక్కగా ఆహ్వానించకపోతే” లేక “వారు నిన్ను సరిగ్గా చూసుకోకపోతే. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

let your peace come back to you

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు. 1) ఒక కుటుంబం యోగ్యమైనది కాకపోతే, దేవుడు తన శాంతినీ ఆపుతాడు లేక ఆ కుటుంబం దీవెనలు పొందదు. 2) ఒక కుటుంబం యోగ్యమైనది కాకపోతే, అపోస్తలులు చెయ్యవలసినది ఒకటి ఉంది. వారు దేవుణ్ణి తాము ఆ కుటుంబంపై పలికినా శాంతిని ఇవ్వవద్దని చెప్పాలి. మీ భాషలో శుభాకాంక్షలను వెనక్కి తీసేసుకోడానికి ఉపయోగించే పదం ఉంటే దాన్ని ఇక్కడ వాడాలి.

Matthew 10:14

Connecting Statement:

యేసు తన శిష్యులకు వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఏమి బోధించాలో చెబుతున్నాడు.

As for those who do not receive you or listen

ఆ ఇంటి లేక పట్టణం మనుషులు నిన్ను చేర్చుకోకపొతే.

you ... your

ఇది బహు వచనం అంటే పన్నెండుమంది అపోస్తలులు . (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

listen to your words

ఇక్కడ మాటలు అంటే శిష్యులు చెప్పేది. ప్రత్యామ్నాయ అనువాదం: నీ సందేశం వింటారు.” లేక “చెప్పేది వినాలి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

city

[మత్తయి 10:11]లో లాగానే దీన్ని తర్జుమా చెయ్యండి.(../10/11.md).

shake off the dust from your feet

నీవు వెళ్ళేటప్పుడు నీ పాద ధూళి అక్కడ దులిపి వెయ్యాలి. దేవుడు ఆ ఇంటి, ఊరి మనుషులను తిరస్కరిస్తాడు అనడానికి సూచన.(చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-symaction)

Matthew 10:15

Truly I say to you

నేను సత్యం చెబుతున్నాను. ఈ పదబంధం యేసు చెప్పబోతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది.

it shall be more tolerable

బాధ తక్కువ ఉంటుంది.

the land of Sodom and Gomorrah

దీని అర్థం సొదొమ, గొమొర్రా నివాసులు. ప్రత్యామ్నాయ అనువాదం: "" సొదొమ, గొమొర్రా నగరాల్లో ఉన్న మనుషులు."" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

that city

దీని అర్థం మనుషులు అపోస్తలులను చేర్చుకోక, వారి సందేశం వినక ఉండే ప్రజలు. ప్రత్యామ్నాయ అనువాదం: నిన్ను ఆహ్వానించని పట్టణం మనుషులు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 10:16

Connecting Statement:

యేసు తన శిష్యులకు సూచనలు ఇస్తున్నాడు. వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఎదుర్కోబోయే హింస ను గురించి చెప్పడం మొదలు పెడుతున్నాడు.

See, I send

చూడండి"" అనే పదం ఇక్కడ చెప్పబోతున్న దాన్ని నొక్కి చెప్పడానికి తోడ్పడుతున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""చూడండి నేను పంపుతున్నాను.” లేక “వినండి, పంపుతున్నాను.” లేక “మీకు చెప్పబోతున్న దానిపై దృష్టి ఉంచండి.

I send you out

యేసు వారిని ఒక ఉద్దేశంతో పంపుతున్నాడు.

as sheep in the midst of wolves

“గొర్రెలు నిస్సహాయ జీవులు. తరుచుగా తోడేళ్ళు వాటిపై దాడి చేస్తాయి. శిష్యులకు మనుషులు హాని చేస్తారని యేసు హెచ్చరిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రమాదకరమైన తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు” లేక “ “ప్రమాదకరమైన జంతువులు చేసినట్టుగా చేసే మనుషుల మధ్యకు పంపుతున్నాను."" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-simile)

be as wise as serpents and harmless as doves

యేసు తన శిష్యులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు. శిష్యులను పాములతో పావురాలతో పోల్చడం గందరగోళం సృష్టిస్తుందనుకుంటే ఆ ఉపమాలంకారాలు చెప్పక పోవడం మంచిది. ప్రత్యామ్నాయ అనువాదం: ఆవగాహనతో జాగ్రత్తగా ప్రవర్తించండి, అదే సమయంలో నిర్దోషంగా ఉండండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-simile)

Matthew 10:17

Watch out for people! They will

ఈ రెండు ప్రతిపాదనలకు సంబంధం ఉందని చూపడానికి దీన్ని ""ఎందుకంటే""తో తర్జుమా చెయ్యవచ్చు.. ప్రత్యామ్నాయ అనువాదం: మనుషుల విషయం జాగ్రత్త. ఎందుకంటే వారు హాని చేస్తారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#grammar-connect-words-phrases)

will deliver you up to

మిమ్మల్ని బంధిస్తారు.

councils

సమాజంలో శాంతి భద్రతలు కాపాడే స్థానిక మత నాయకులు లేక పెద్దలు.

whip you

మిమ్మల్ని కొరడాలతో కొడతారు.

Matthew 10:18

you will be brought

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు మిమ్మల్ని నిలబెడతారు.” లేక “వారు మిమ్మల్ని ఈడ్చుకుపోతారు.” (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

for my sake

ఎందుకంటే మీరు నాకు సంబంధించిన వారు. లేక “ఎందుకంటే మీరు నన్ను వెంబడిస్తున్నారు.

to them and to the Gentiles

వారు"" అనే సర్వనామం గవర్నర్లు, రాజులు లేక యూదు నేరారోపకులు.

Matthew 10:19

Connecting Statement:

యేసు తన శిష్యులు బోధించడానికి వెళ్ళేటప్పుడు వారు పొందబోయే హింస ను గురించి హెచ్చరిస్తున్నాడు.

When they deliver you up

మనుషులు మిమ్మల్ని న్యాయస్థానాల ఎదుటికి తీసుకుపోతారు. ఇక్కడ మనుషులు ఇక్కడ [మత్తయి 10:17]లో ఉన్న మనుషులే.మత్తయి 10:17.

you ... you

ఇవి పన్నెండుమంది అపోస్తలులను సూచించే బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

do not be anxious

ఆందోళన చెందకండి.

how or what you will speak

మీరు ఏమి మాట్లాడాలో ఏమి చెప్పాలో. ఈ రెండు భావాలను కలపవచ్చు: మీరు చెప్పవలసింది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-hendiadys)

for what to say will be given to you

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: మీరు చెప్పవలసింది పరిశుద్ధాత్మమీకు చెబుతాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

in that hour

ఇక్కడ గడియ అంటే సరిగ్గా అప్పుడే. ప్రత్యామ్నాయ అనువాదం: ఆ సమయంలో” లేక “అప్పుడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 10:20

you ... your

ఇవి బహు వచనం. పన్నెండుమంది అపోస్తలులను సూచిస్తున్నది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

the Spirit of your Father

అవసరమైతే , దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు.దేవుని ఆత్మ మీ పరలోకపు తండ్రి లేక పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి చెబుతున్నారని, ఇహలోక తండ్రిని గురించి కాదని స్పష్టంగా చెప్పడానికి ఫుట్ నోట్ పెట్టవచ్చు.

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

in you

నీ ద్వారా

Matthew 10:21

Connecting Statement:

యేసు తన శిష్యులకు సూచనలు ఇస్తున్నాడు. వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఎదుర్కోబోయే హింస ను గురించి చెప్పడం కొనసాగిస్తున్నాడు.

Brother will deliver up brother to death

సోదరుడు తన సోదరుణ్ణీ మరణం పాలు చేస్తాడు. లేక “సోదరులు తమ సోదరులను మరణానికి అప్పగిస్తారు."" పదే పదే జరగనున్న దాన్ని యేసు ఇక్కడ చెబుతున్నాడు.

deliver up brother to death

అవ్యక్త నామవాచకం మరణం క్రియాపదంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: చేతులు సోదరుడు తన సోదరుడిని మరణ శిక్ష వేసే అధికారులకు అప్పగిస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-abstractnouns)

a father his child

ఈ పదాలను పూర్తి వాక్యంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: తండ్రులు వారి పిల్లలను మరణం పాలు చేస్తారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

rise up against

వ్యతిరేకంగా తిరుగుబాటు లేక “వ్యతిరేకంగా లేస్తారు.

cause them to be put to death

దీన్ని క్రియాశీల రూపం గా తర్జుమా చెయ్యవచ్చు . ప్రత్యామ్నాయ అనువాదం: ""మరణ దండన పడేలా” లేక “అధికారులు వారికి మరణ శిక్ష వేసేలా.” (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 10:22

You will be hated by everyone

దీన్ని క్రియాశీల రూపం గా తర్జుమా చెయ్యవచ్చు . ప్రత్యామ్నాయ అనువాదం: అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు.” లేక “మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

You

ఇది బహు వచనం, పన్నెండుమంది శిష్యులు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

because of my name

ఇక్కడ నామం అంటే మొత్తంగా ఆ వ్యక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: నా గురించి” లేక “మీరు నాపై నమ్మకం ఉంచారు గనక. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

whoever endures

నమ్మకంగా ఉన్నవారు

to the end

అంతం"" అంటే ఒక వ్యక్తి మరణమో లేక దేవుడు రాజుగా వచ్చే సమయంలో హింస ఆగిపోయే సమయమో స్పష్టంగా లేదు. ముఖ్య విషయం ఏమిటంటే అవసరం అయినంత వరకూ వారు సహించాలి.

that person will be saved

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు ఆ వ్యక్తిని విడిపిస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 10:23

in this city

ఇక్కడ ఇది ఒక పట్టణం గురించి కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక పట్టణం

flee to the next

మరొక పట్టణానికి పారిపోండి.

truly I say to you

“నేను సత్యం చెబుతున్నాను.” ఈ పదబంధం యేసు చెప్పబోతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది

Son of Man

యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

has come

వస్తున్నాడు

Matthew 10:24

Connecting Statement:

యేసు తన శిష్యులకు సూచనలు ఇస్తున్నాడు. వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఎదుర్కోబోయే హింస ను గురించి చెప్పడం కొనసాగిస్తున్నాడు.

A disciple is not greater than his teacher, nor a servant above his master

తన శిష్యులకు ఒక సాధారణ సత్యం నేర్పించడానికి ఒక సామెత యేసు ఉపయోగిస్తున్నాడు. యేసుపట్ల మనుషులు ప్రవర్తించిన దానికన్నా మెరుగుగా తమ విషయంలో ప్రవర్తిస్తారని శిష్యులు భావించకూడదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-proverbs)

A disciple is not greater than his teacher

శిష్యుడు ఎప్పుడూ తన గురువు కంటే తక్కువ ప్రాముఖ్యత గలవాడే. “బోధకుడు ఎప్పుడూ తన శిష్యులకన్నా అధికుడే.

nor a servant above his master

సేవకుడు ఎప్పుడూ తన యజమాని కంటే తక్కువ ప్రాముఖ్యత గలవాడే. లేక “యజమాని ఎప్పుడూ తన సేవకులకన్నా అధికుడే.

Matthew 10:25

It is enough for the disciple that he should be like his teacher

శిష్యుడు తన బోధకునిలాగా అయితే సంతృప్తి పడాలి.

be like his teacher

అవసరమైతే, శిష్యుడు ఎలా తన బోధకునిగా కాగలడో మరింత స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" తన బోధకునికి తెలిసినంత తెలిస్తే."" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

the servant like his master

అవసరమైతే, సేవకుడు ఎలా తన యజమానిగా కాగలడో మరింత స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సేవకుడు తన యజమాని అంత ప్రాముఖ్యం పొందితే. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

If they have called the master ... how much worse ... they call ... the members of his household

మళ్ళీ యేసు నొక్కి చెబుతున్నాడు. మనుషులు తనను హింసించారు గనక తన శిష్యులతో కూడా అలానే ప్రవర్తిస్తారు. లేదా ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తారు.

how much worse would be the names they call the members of his household

ఆయన కుటుంబం వారిని సూచించడానికి వారు వాడే పేర్లు మరింత ఘోరంగా ఉంటాయి. “వారు ఆయన కుటుంబ సభ్యులను మరింత చెడు పేర్లతో పిలుస్తారు.

If they have called

మనుషులు పిలిచాడు గనక.

the master of the house

యేసు దీన్ని తనకే ఉద్దేశించి ఈ రూపకఅలంకారం ఉపయోగిస్తున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Beelzebul

ఈ పేరుకు అర్థం 1) బయేల్జెబూలు అని నేరుగా లేక 2) దాని అసలు అర్థం “సాతాను” గా తర్జుమా చెయ్యండి.

his household

ఇది యేసు శిష్యులను సూచించే రూపకఅలంకారం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 10:26

Connecting Statement:

యేసు తన శిష్యులకు సూచనలు ఇస్తున్నాడు. వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఎదుర్కోబోయే హింసను గురించి చెప్పడం కొనసాగిస్తున్నాడు.

do not fear them

ఇక్కడ వారు అంటే యేసు శిష్యులను హింసలపాలు చేసేవారు.

there is nothing concealed that will not be revealed, and nothing hidden that will not be known

ఈ ప్రతిపాదనలు రెంటికీ అర్థం ఒకటే. దాగి ఉన్న అంటే రహస్యంగా ఉన్న అని అర్థం. వెల్లడి అయిన అంటే తెలిసిపోయిన. దేవుడు అన్నిటినీ బయటపెడతాడని యేసు నొక్కి చెబుతున్నాడు. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు దాచిపెట్టిన వాటన్నిటిని దేవుడు బయట పెడతాడు.” (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 10:27

What I tell you in the darkness, say in the daylight, and what you hear softly in your ear, proclaim upon the housetops

ఈ ప్రతిపాదనలు రెంటికీ అర్థం ఒకటే. యేసు శిష్యులకు నొక్కి చెబుతున్నాడు, తాను వారితో రహస్యంగా చెప్పినవన్నీ వారు బాహాటంగా చెప్పాలి. ప్రత్యామ్నాయ అనువాదం: మీకు చీకటిలో చెప్పిన వాటిని మీరు పగటి వెలుగులో చెప్పాలి. గుసగుసలుగా మీరు విన్నది ఇంటి కప్పులపైనుండి ప్రకటించాలి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parallelism)

What I tell you in the darkness, say in the daylight

ఇక్కడ చీకటి అనేది అన్యాపదేశం. రాత్రి అనేది “రహస్యం” అనడానికి అన్యాపదేశం. ఇక్కడ పగటివెలుగు అనేది “బహిరంగంగా” అనడానికి అన్యాపదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: రాత్రివేళ రహస్యంగా నేను మీకు చెబుతున్నది పగటి వెలుగులో మీరు బహిరంగంగా చెప్పాలి."" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

what you hear softly in your ear

ఇది గుసగుసలు అని సూచించే పధ్ధతి. ప్రత్యామ్నాయ అనువాదం: నేను మీకు గుసగుసలతో చెప్పేది (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

proclaim upon the housetops

యేసు నివసించిన ప్రాంతంలో ఇంటి కప్పులు బల్లపరుపుగా ఉండేవి.. మనుషులు పెద్ద స్వరంతో మాట్లాడినది చాలా దూరం వినబడేది. ఇక్కడ "" ఇంటి కప్పులు "" అంటే మనుషులు వినగలిగిన ప్రదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: అందరూ వినేలా బహిరంగ ప్రదేశంలో బిగ్గరగా మాట్లాడండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 10:28

General Information:

ఇక్కడ తన శిష్యులు ఎదుర్కోబోతున్న హింసకు వారు భయపడకూడదని కొన్ని కారణాలు యేసు ఇస్తున్నాడు.

Connecting Statement:

యేసు తన శిష్యులకు సూచనలు ఇస్తున్నాడు. వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఎదుర్కోబోయే హింసను గురించి చెప్పడం కొనసాగిస్తున్నాడు.

Do not be afraid of those who kill the body but are unable to kill the soul

ఇక్కడ ఆత్మను చంపగల మనుషులకు చంపలేని మనుషులకు తేడా చెప్పడం లేదు. మనిషి ఆత్మను చంపగల వారెవరూ లేరు. ప్రత్యామ్నాయ అనువాదం: మనుషులకు భయపడకండి. వారు శరీరాన్ని చంపగలరు. కానీ ఆత్మను చంపలేరు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-distinguish)

kill the body

దీని అర్థం భౌతికమరణం కలిగించడం. ఈ మాటలు ఇబ్బందిగా ఉంటే ఇలా తర్జుమా చెయ్యవచ్చు ""నిన్ను చంపే” లేక “మనుషులను చంపే.

body

ఒక వ్యక్తిలో ఇతరులు తాకగల భాగం. ప్రాణం, లేక ఆత్మకు భిన్నంగా.

kill the soul

దీని అర్థం మనుషులు భౌతికంగా చనిపోయిన తరువాత.

soul

మనుషులు భౌతికంగా చనిపోయిన తరువాత జీవించి ఉండేదాన్ని ఎవరూ తాకలేరు.

fear him who is able

మనుషులు దేవునికి భయపడాలి అని స్పష్టం చెయ్యడానికి ఎందుకంటే అనే మాట వాడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవునికి భయపడండి ఎందుకంటే అయన సమర్థుడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#grammar-connect-words-phrases)

Matthew 10:29

Are not two sparrows sold for a small coin?

యేసు తన శిష్యులకు బోధించడం కోసం ఈ సామెతను ఒక ప్రశ్నగా ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: పిచ్చుకల సంగతి ఆలోచించండి. రెండు పిచ్చుకలను ఒక చిన్న నాణెంతో కొనవచ్చు. వాటి విలువ అంత తక్కువ. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-proverbs మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

sparrows

ఇవి చాలా చిన్నవి. గింజలు తింటాయి. ప్రత్యామ్నాయ అనువాదం: చిన్న పక్షులు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-unknown)

a small coin

మీ దేశంలో అందుబాటులో ఉన్న అతి తక్కువ విలువ గల నాణెం పేరుతొ తర్జుమా చెయ్యండి. ఇక్కడ చెప్పినది కూలీలకు ఒక రోజు కష్టానికి ఇచ్చే రాగి నాణెంలో పదహారవ భాగం వంటి విలువ. ప్రత్యామ్నాయ అనువాదం: ""చాలా తక్కువ డబ్బు.

not one of them falls to the ground without your Father's knowledge

దీన్ని సకారాత్మకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఒక్క పిచ్చుక చచ్చిపోయి నేలరాలినా మీ తండ్రికి తెలుసు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-doublenegatives)

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 10:30

even the hairs of your head are all numbered

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీ తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో దేవునికి తెలుసు. "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

numbered

లెక్క

Matthew 10:31

You are more valuable than many sparrows

దేవుడు అనేకమైన పిచ్చుకల కంటే నిన్ను ఎక్కువ విలువగా ఎంచుతాడు.

Matthew 10:32

Connecting Statement:

యేసు తన శిష్యులకు సూచనలు ఇస్తున్నాడు. వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఎదుర్కోబోయే హింసను గురించి చెప్పడం కొనసాగిస్తున్నాడు

everyone who confesses me ... I will also confess before my Father

నన్ను ఎవరు ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుట వారిని ఒప్పుకుంటాను. లేక “ఎవరైనా నన్ను ఒప్పుకుంటే నా తండ్రి ఎదుట నేను కూడా ఒప్పుకుంటాను.

confesses me before men

తాను నా శిష్యుడు అని ఇతరులకు చెబితే, లేక “మనుషుల ఎదుట తాను నాకు కట్టుబడి ఉన్నానని ఒప్పుకుంటే.

I will also confess before my Father who is in heaven

అర్థం అవుతున్న సమాచారాన్ని స్పష్టం చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ఎదుట ఆ మనిషి నాకు చెందిన వాడని ఒప్పుకుంటాను. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

my Father who is in heaven

నా పరలోకపు తండ్రి

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 10:33

he who denies me ... I will also deny before my Father

నన్ను నిరాకరించేవారిని నా తండ్రి ఎదుట నేనూ నిరాకరిస్తాను. లేక “ఎవరన్నా నన్ను నిరాకరిస్తే నా తండ్రి ఎదుట నేను కూడా వారిని నిరాకరిస్తాను.

denies me before men

మనుషుల ఎదుట నాకు కట్టుబడిన వాడు కాదని చెబితే లేక “తాను నా శిష్యుడు అని ఇతరుల ఎదుట ఒప్పుకోకపొతే.

I will also deny before my Father who is in heaven

అర్థం అవుతున్న సమాచారాన్ని స్పష్టం చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: పరలోకంలో ఉన్న నాతండ్రి ఎదుట ఆ వ్యక్తి నాకు చెందిన వాడు కాదని చెబుతాను. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Matthew 10:34

Connecting Statement:

ఇక్కడ తన శిష్యులు ఎదుర్కోబోతున్న హింసకు వారు భయపడకూడదని కొన్ని కారణాలు యేసు ఇవ్వడం కొనసాగిస్తున్నాడు.

Do not think

అనుకోవద్దు, లేక “అలా ఆలోచించవద్దు.

upon the earth

దీని అర్థం భూమిపై నివసించే మనుషులు. ప్రత్యామ్నాయ అనువాదం: భూప్రజలు” లేక “మనుషులు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

a sword

దీని అర్థం చీలిక, కొట్లాటలు, హత్యలు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 10:35

to set ... against

వ్యతిరేకంగా పోరాటాలు.

a man against his father

కుమారుడు తన తండ్రికి వ్యతిరేకంగా.

Matthew 10:36

A man's enemies

ఒక వ్యక్తి శత్రువులు లేక “ఒక వ్యక్తికి ఉన్న భీకర శత్రువులు.

those of his own household

ఆయన స్వంత కుటుంబం సభ్యులు.

Matthew 10:37

Connecting Statement:

ఇక్కడ యేసు తన శిష్యులు ఎదుర్కోబోతున్న హింసకు వారు భయపడకూడదని కొన్ని కారణాలు ఇవ్వడం కొనసాగిస్తున్నాడు.

He who loves ... is not worthy

ఇక్కడ అతడు అంటే మామూలుగా ఎవరైనా. ప్రత్యామ్నాయ అనువాదం: ప్రేమించేవారు తగిన వారు కాదు.” లేక “నీవు ప్రేమిస్తే నీవు తగిన వాడివి కాదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-gendernotations)

loves

ఇక్కడ “ప్రేమ"" అనే పదం “సోదర ప్రేమ” లేక “మిత్రుని ప్రేమ."" ప్రత్యామ్నాయ అనువాదం: ""శ్రద్ధ తీసుకునే” లేక “కట్టుబడి” లేక “ఇష్టంగా.

worthy of me

నాకు చెంది ఉండడానికి యోగ్యుడు కాదు. లేక “నా శిష్యుడుగా ఉండే అర్హత లేదు.

Matthew 10:38

pick up his cross and follow after me

తన సిలువ మోస్తూ నాతో రావాలి. సిలువ హింసను చావును సూచిస్తున్నది. సిలువను భుజానికి ఎత్తుకోవడం అంటే బాధలు పడి చనిపోవడానికి సిద్ధపడడం. ప్రత్యామ్నాయ అనువాదం: బాధ, మరణం వచ్చినా నాకు విధేయంగా ఉండాలి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

pick up

ఎత్తుకుని లేక “మోసుకుంటూ

Matthew 10:39

He who finds his life will lose it. But he who loses ... will find it

యేసు తన శిష్యులకు బోధించడానికి ఒక సామెత ఉపయోగిస్తున్నాడు. దీన్ని సాధ్యమైనంత తక్కువ మాటల్లో తర్జుమా చెయ్యండి. ప్రత్యామ్నాయ అనువాదం: తమ ప్రాణం అంటిపెట్టుకుని ఉండేవారు దాన్ని పోగొట్టుకుంటారు. కానీ తమ ప్రాణాలు పోగొట్టుకునే వారు దాన్ని దక్కించుకుంటారు.” లేక “నీవు నీ ప్రాణం కోసం చూస్తే దాన్ని పొగొట్టుకుంటావు. కానీ దాన్ని పోగొట్టుకుంటే దాన్ని కనుగొంటావు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-proverbs)

finds

ఇది రూపకఅలంకారం. “అంటిపెట్టుకోవడం” లేక “రక్షించుకోవడం"" అనే అర్థంతో వాడారు. ప్రత్యామ్నాయ అనువాదం: ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే” లేక “రక్షించుకోడానికి ప్రయత్నిస్తే (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

will lose it

అంటే ఆ వ్యక్తి చనిపోవాలని కాదు. ఇది ఒక రూపకఅలంకారం. అంటే అతడు దేవుని ఆధ్యాత్మిక జీవం అనుభవించలేడు. ప్రత్యామ్నాయ అనువాదం: నిజ జీవం ఉండదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

who loses his life

ఇది చనిపోవడం అని కాదు. ఇది ఒక రూపకఅలంకారం. అంటే ఒక వ్యక్తి తన జీవం కన్నా యేసుకు విధేయత చూపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రత్యామ్నాయ అనువాదం: తనను నిరాకరించుకునే వాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

for my sake

నాపై నమ్మకం ఉంచినందుకు లేక “నా మూలంగా” లేక “నా కారణంగా."" [మత్తయి 10:18]లో ఉన్న నా కోసం అనేదే ఇదికూడా.(../10/18.md).

will find it

ఈ రూపకఅలంకారం అర్థం ఒక వ్యక్తి దేవునితో ఆధ్యాత్మిక జీవం అనుభవిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: నిజ జీవం కనుగొంటాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 10:40

Connecting Statement:

ఇక్కడ తన శిష్యులు ఎదుర్కోబోతున్న హింసకు వారు భయపడకూడదని కొన్ని కారణాలు యేసు ఇస్తున్నాడు.

He who

ఇక్కడ అతడు అంటే మామూలుగా ఎవరైనా.. ప్రత్యామ్నాయ అనువాదం: ఎవరైనా” లేక “అలా చేసే వారెవరైనా” లేక “ఎవరైతే (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-gendernotations)

welcomes

దీని అర్థం ఎవరినన్నా అతిథిగా ఆహ్వానించడం.

you

ఇది బహు వచనం అంటే పన్నెండుమంది అపోస్తలులు.యేసు వారితో మాట్లాడుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

He who welcomes you welcomes me

ఎవరన్నా నిన్ను ఆహ్వానిస్తే తనను ఆహ్వానించినట్టే అని యేసు ఉద్దేశం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మిమ్మల్ని ఎవరన్నా ఆహ్వానిస్తే అది నన్ను ఆహ్వానించినట్టే.” లేక “మిమ్మల్ని ఎవరన్నా ఆహ్వానిస్తే అతడు నన్నే ఆహ్వానిస్తున్నాడు.

he who welcomes me also welcomes him who sent me

దీని అర్థం ఎవరన్నా యేసుకు స్వాగతం పలికితే, దేవునికి స్వాగతం పలికినట్టే. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరన్నా నన్ను చేర్చుకుంటే అతడు నన్ను పంపిన తండ్రి అయిన దేవుణ్ణి చేర్చుకున్నట్టే.” లేక “నన్నెవరన్నా ఆహ్వానిస్తే నన్ను పంపిన తండ్రి అయిన దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాడన్న మాట.

Matthew 10:41

because he is a prophet

ఇక్కడ అతడు అంటే ఆహ్వానిస్తున్న వ్యక్తి కాదు. ఆహ్వానం అందుకుంటున్న వ్యక్తి.

a prophet's reward

దీని అర్థం దేవుడు ప్రవక్తకు ఇచ్చే ప్రతిఫలం. ప్రవక్త వేరొక వ్యక్తికి ఇచ్చే ప్రతిఫలం కాదు.

he is a righteous man

ఇక్కడ అతడు అంటే ఆహ్వానిస్తున్న వ్యక్తి కాదు. ఆహ్వానం అందుకుంటున్న వ్యక్తి.

a righteous man's reward

దీని అర్థం దేవుడు నీతిమంతులకు ఇచ్చే ప్రతిఫలం. నీతిమంతులు మరొక వ్యక్తికీ ఇచ్చే ప్రతిఫలం కాదు.

Matthew 10:42

Connecting Statement:

యేసు తన శిష్యులు బోధించడానికి వెళ్ళినప్పుడు వారికి ఎదురయ్యే వాటిని గురించి చెప్పడం ముగించాడు.

Whoever gives

వెళ్ళేవారు ఎవరైనా

one of these little ones

ఈ చిన్న వారిలో ఒకడు. లేక “ఈ అతి తక్కువ ప్రాముఖ్యం గల."" ఈ పదబంధం వారిలో ఒకడు అంటే యేసు శిష్యులు.

because he is a disciple

అతడు నా శిష్యుడు కాబట్టి. ఇక్కడ అతడు అనేది ప్రాముఖ్యత ఇచ్చే వాని గురించి కాదు. అతి తక్కువ ప్రాముఖ్యత గల వాణ్ణి గురించి.

truly I say to you

నేను సత్యం చెబుతున్నాను. ఈ పదబంధం యేసు చెప్పబోతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది

he will ... his reward

ఇక్కడ ""అతడు” అంటే ఇచ్చేవాడు.

he will in no way lose

దేవుడు అతణ్ణి నిరాకరించడు. అంటే ఉన్నది తీసివేయడం కాదు. దీన్ని సకారాత్మకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు అతనికి తప్పక ఇస్తాడు.