Matthew 9

మత్తయి 09 సాధారణ నోట్సు

ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు

పాపులు

యేసు కాలంలో మనుషులు యేసు పాపులు, అనే మాట వాడినప్పుడు వారు దొంగతనం, లైంగిక పాపాలు కాకుండా మోషే ధర్మశాస్త్రం పాటించని వారి గురించి మాట్లాడుతున్నారూ. యేసు పాపులను పిలవడానికి వచ్చాను అన్నప్పుడు తాము పాపులం అనుకున్న మనుషులు ఆయన అనుచరులుగా మారగలరని నమ్మిన వారిని ఉద్దేశించి అన్నాడు. ఎవరైనా మనుషులు మనుషుల దృష్టిలో పాపులు కాకపోయినా ఇది నేటికీ కూడా వర్తిస్తుంది. (చూడండి: /WA-Catalog/te_tw?section=kt#sin)

ఈ అధ్యాయంలో ఇతర అనువాద సమస్యలు

కర్మణి వాక్యం

అనేక వాక్యాలు ఈ అధ్యాయంలో ఒక మనిషికి జరిగినవి చెబుతూ, అది ఎవరూ జరిగించారో చెప్పని సందర్భాలు ఉంటాయి. అది ఎవరూ జరిగించారో పాఠకునికి తెలిసేలా మీరు తర్జుమా చెయ్యాలి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

అలంకారిక ప్రశ్నs

మాట్లాడే వారు ఈ అధ్యాయంలో తమకు అంతకు ముందే జవాబు తెలిసిన ప్రశ్నలు అడుగుతున్నారు. శ్రోతల విషయంలో తమకు సంతోషం లేదని సూచించడానికి గానీ లేక వారిని ఆలోచింపజేయడానికి గానీ వారు ప్రశ్నలు అడుగుతున్నారు. మీ భాషలో ఇది చెప్పడానికి వేరే పధ్ధతి ఉండవచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

సామెతలు

సామెతలు అనేవి సాధారణ సత్యాలను తేలికగా గుర్తు ఉంచుకునే మాటల్లో చెప్పే చిన్న వాక్యాలు. సామెతలను అర్థం చేసుకునే మనుషులు సాధారణంగా మాట్లాడే వాడుక భాష, సంస్కృతి ఎరిగి ఉండాలి. మీరు ఈ అధ్యాయంలో సామెతలను తర్జుమా చేసేటప్పుడు మాట్లాడే వారు వాడిన మాటల కంటే మరిన్ని మాటలు ఉపయోగించి శ్రోతలకు తెలిసిన, మీ పాఠకులకు తెలియని అదనపు సమాచారం ఇవ్వ వలసి ఉంటుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-proverbs)

Matthew 9:1

Connecting Statement:

[మత్తయి 8:1]లో మొదలైన అంశానికి మత్తయి తిరిగి వస్తున్నాడు.(../08/01.md), అదేమంటే యేసు మనుషులను స్వస్థ పరచడం. చచ్చుబడిన దేహం గలవాణ్ణి యేసు స్వస్థ పరచిన ఉదంతం ఆరంభం.

Jesus entered a boat

శిష్యులు యేసుతో ఉన్నారని అర్థం చేసుకోవాలి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

a boat

ఇది బహుశా [మత్తయి 8:23]లో ఉన్న పడవే అయిఉండ వచ్చు./08/23.md). అయోమయం లేకుండా ఉండేలా దీన్ని మీరు స్పష్టంగా చెప్పాలి.

into his own city

అయన నివసించిన ఊరు. అంటే కపెర్నహూము.

Matthew 9:2

Behold

స్థూల కథనంలో ఇది మరొక సంఘటన ఆరంభం. ఇందులో ఇంతకుముందు సంఘటనల్లో ఉన్న వారు గాక వేరే మనుషులు ఉన్నారు. వీరు వేరొక పట్టణం మనుషులు అని చూపడానికి మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది.

they brought

ఆ పట్టణం నుండి కొందరు మనుషులు.

their faith

దీని అర్థం కొందరు మనుషుల విశ్వాసం కూడా చచ్చుబడిన దేహం గలవాని విశ్వాసంతో కలిసింది.

Son

ఆ మనిషి యేసు స్వంత కుమారుడు కాదు. యేసు ఇక్కడ మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఇది గందరగోళంగా అనిపిస్తే దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు""మిత్రమా” లేక “అబ్బాయి” లేదా దీన్ని పూర్తిగా వదిలెయ్యవచ్చు.

Your sins have been forgiven

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నీ పాపాలు క్షమించాను. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 9:3

Behold

స్థూల కథనంలో ఇది మరొక సంఘటన ఆరంభం. ఇందులో ఇంతకుముందు సంఘటనల్లో ఉన్న వారు గాక వేరే మనుషులు ఉన్నారు. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది.

among themselves

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) ప్రతి ఒక్కరూ తమలో ఆలోచించుకుంటున్నారు. లేక 2) వారు తమలో మాట్లాడుకుంటున్నారు.

blaspheming

దేవుడొక్కడే చేయగలడని శాస్త్రులు అనుకున్నవి తాను చేస్తానని యేసు అంటున్నాడు.

Matthew 9:4

knew their thoughts

యేసుకు వారు అతిసహజంగా ఆలోచిస్తున్నది తెలుసు లేదా వారు తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు గనక ఆయనకి అర్థం అయింది.

Why are you thinking evil in your hearts?

యేసు శాస్త్రులను గద్దించడానికి ఈ ప్రశ్న వాడుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

evil

ఇది నైతిక పాపం లేదా దుష్టత్వం, కేవలం పొరపాటు కాదు.

in your hearts

ఇక్కడ హృదయాలు అంటే వారి మనసులు లేక వారి తలంపులు . (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 9:5

For which is easier, to say, 'Your sins are forgiven,' or to say, 'Get up and walk'?

యేసు ఈ ప్రశ్న ఉపయోగించి శాస్త్రులు అయన నిజంగా పాపాలు క్షమించలేడని రుజువు చెయ్యడానికి ఏమి చెయ్యవచ్చో ఆలోచించేలా చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: నేను చెప్పాను, 'నీ పాపాలకు క్షమాపణ దొరికింది.' ‘లేచి నడువు,' అని చెప్పడం కష్టమని మీరు అనుకుంటారు. ఎందుకంటే నేను ఆ మనిషిని స్వస్థ పరచానా లేదా అనేది అతడు లేచి నడిస్తే తెలిసి పోతుంది. ” లేక 'నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అని చెప్పడం లేచి నడువు' అని చెప్పడం కన్నా తేలికా (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

which is easier, to say, 'Your sins are forgiven,' or to say, 'Get up and walk'?

దీన్ని నేరుగా ఎత్తి రాయడంతో తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఏది సులభం, ఒకరి పాపాలకు క్షమాపణ దొరికింది అని చెప్పడమా, లేక లేచి నడువు అని చెప్పడమా?” లేక “లేచి నడువు అని చెప్పడం కంటే ఒకరి పాపాలకు క్షమాపణ దొరికింది అని చెప్పడం తేలిక అని మీరు అనుకుంటారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-quotations)

Your sins are forgiven

ఇక్కడ నీ అనేది ఏక వచనం. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" నీ పాపాలు క్షమించాను "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 9:6

that you may know

మీకు రుజువు చేస్తాను. ""మీరు” అనేది బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

your mat ... your house

ఇక్కడ నీవు ఏక వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

go to your house

యేసు ఆ మనిషిని ఫలానా చోటికి వెళ్ళమని చెప్పడం లేదు. ఇంటికి పోవడానికి ఆ మనిషికి అవకాశం ఇస్తున్నాడు.

Matthew 9:7

Connecting Statement:

చచ్చుబడిన దేహం గలవాణ్ణి యేసు స్వస్థ పరిచిన వైనం ఇంతటితో ముగిసింది. యేసు ఒకపన్ను వసూలుదారుడిని తన శిష్యుడుగా పిలుస్తున్నాడు.

Matthew 9:8

who had given

ఇచ్చాడు గనక.

such authority

దీని అర్థం పాపాలు క్షమించబడినాయని ప్రకటించే అధికారం.

Matthew 9:9

As Jesus passed by from there

ఈ పదబంధం కథనంలో కొత్త భాగానికి నాంది. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది., దాన్ని ఇక్కడ ఉపయోగించ వచ్చు.

passed by

వెళ్ళిపోతున్నాడు.

Matthew ... him ... He

ఇతడు ఈ సువార్త రచయిత మత్తయి అని సంఘ సాంప్రదాయిక గాథ తెలియజేస్తున్నది. , కానీ వాచకంలో మాత్రం ""అతడు” “అతని""అనే ఈ సర్వనామాలను లను నేను” “నా గా మార్చే అవకాశం లేదు.

He said to him

యేసు మత్తయితో చెప్పాడు.

He got up and followed him

మత్తయి లేచి యేసును వెంబడించాడు. దీని అర్థం మత్తయి యేసు శిష్యుడు అయ్యాడు.

Matthew 9:10

General Information:

ఈ సంఘటనలు పన్ను వసూలుదారుడు మత్తయి ఇంట్లో సంభవించినవి.

the house

ఇది బహుశా మత్తయి ఇల్లు, కానీ అది యేసు ఇల్లు కూడా కావచ్చు. గందరగోళం వద్దనుకుంటే దీన్ని స్పష్టం చెయ్యండి.

behold

స్థూల కథనంలో ఇది మరొక సంఘటన ఆరంభం. ఇంతకుముందు సంఘటనల్లో ఉన్న వారు కాక వేరే మనుషులు. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది..

sinners

మనుషులు మోషే ధర్మశాస్త్రం పాటించరు గానీ ఇతరులు తీవ్రమైనపాపం గా ఎంచే పనులు చేస్తారు.

Matthew 9:11

When the Pharisees saw it

పరిసయ్యులు యేసు పన్ను వసూలుదారులతో పాపులైన మనుషులతో కలిసి భోజనం చేస్తున్నాడని చూశారు.

Why does your teacher eat with tax collectors and sinners?

పరిసయ్యులు ఈ ప్రశ్న ఉపయోగించి యేసు చేస్తున్నదాన్ని విమర్శించారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Matthew 9:12

General Information:

ఈ సంఘటనలు పన్ను వసూలుదారుడు మత్తయి ఇంట్లో జరిగాయి.

When Jesus heard this

ఇక్కడ ఇది అంటే పరిసయ్యులు యేసు వసూలుదారులతో పాపులైన మనుషులతో కలిసి భోజనం చేస్తున్నాడని అడిగిన ప్రశ్న.

People who are strong in body do not need a physician, only those who are sick

యేసు దీనికి ఒక సామెతతో జవాబిచ్చాడు. తాను ఇలాటి మనుషులతో భోజనం చేయడం ఎందుకంటే అయన పాపులకు సహాయం చేయడానికి వచ్చాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-proverbs)

People who are strong in body

ఆరోగ్యవంతులైన మనుషులు.

physician

వైద్యుడు

those who are sick

వైద్యుడు అవసరం"" అనే పదబంధం. ప్రత్యామ్నాయ అనువాదం: రొగులైన మనుషులకు వైద్యుడు అవసరం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Matthew 9:13

You should go and learn what this means

యేసు లేఖనాల్లో మాటలు చెప్పబోతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు దేవుడు లేఖనాల్లో చెప్పినది అర్థం చేసుకోవాలి.

You should go

ఇక్కడ మీరు బహు వచనం. అంటే పరిసయ్యులు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

I desire mercy and not sacrifice

యేసు ప్రవక్త హోషేయ రాసిన లేఖనాల ఉదహరిస్తున్నాడు. ఇక్కడ, నేను అంటే దేవుడు.

For I came

ఇక్కడ నేను అంటే యేసు.

the righteous

యేసు ఇక్కడ వ్యంగ్యం ఉపయోగిస్తున్నాడు. అక్కడ పశ్చాత్తాపం అవసరం లేని మనుషులు నీతి మంతులు ఎవరైనా ఉన్నారని కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: తాము నీతిమంతులు అనుకునేవారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-irony)

Matthew 9:14

Connecting Statement:

బాప్తిస్మమిచ్చే యోహాను శిష్యులు యేసు శిష్యులు ఉపవాసం చెయ్యరేమిటని ప్రశ్న వేస్తున్నారు.

do not fast

క్రమం తప్పక భోంచేస్తారు.

Matthew 9:15

Can wedding attendants be sorrowful while the bridegroom is still with them?

యోహాను శిష్యులకు జవాబు చెప్పడానికి యేసు ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. మనుషులు వివాహ ఉత్సవాల సమయంలో విలాపం ఉపవాసం చెయ్యరని అందరికీ తెలుసు. యేసు ఈ సామెత ఉపయోగించి తన శిష్యులు విలపించక పోవడం ఎందుకంటే తాను వారితో ఉన్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion మరియు /WA-Catalog/te_tm?section=translate#writing-proverbs)

the days will come when

ఇది భవిషత్తులో జరగనున్న విషయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక సమయం వస్తుంది” లేక “ఒకనాడు

the bridegroom will be taken away from them

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: పెళ్ళికొడుకు ఇకపై వారితో ఉండడు.” లేక “పెళ్ళికొడుకును వారినుండి తీసివేస్తారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

will be taken away

యేసు బహుశా ఆయన మరణం గురించి చెప్తూ ఉండవచ్చు. కానీ దీన్ని స్పష్టంగా చెప్పకూడదు. ఇక్కడ అనువాదంలో పెళ్లి పోలికను ఉంచడానికి పెళ్ళికొడుకు అక్కడ నుంచి వెళ్ళిపోవడం గురించి చెబితే సరిపోతుంది.

Matthew 9:16

Connecting Statement:

యేసు యోహాను శిష్యులు అడిగిన ప్రశ్న కు జవాబు కొనసాగిస్తున్నాడు. మనుషులు ఒక దానితో ఒకటి కలపని పాత విషయాలు, కొత్త విషయాలు అనే రెండు ఉదాహరణలు ఇస్తున్నాడు.

No man puts a piece of new cloth on an old garment

కొత్త గుడ్డ ముక్కను పాత బట్టకు అతుకు వేయరు. లేక “మనుషులు కొత్త గుడ్డ ముక్కను పాత బట్టకు మాసిక వేయరు

an old garment ... the garment

పాత బట్ట.. బట్టలు

the patch will tear away from the garment

మాసిక ఆ బట్టను చింపేస్తుంది. ఆ బట్టను ఎవరైన ఉతికితే, కొత్త గుడ్డ ముక్క కుదించుకు పోతుంది. కానీ మాసిక ఆ పాత బట్టను చినిగిపోయేలా చేస్తుంది. ఇది వస్త్రం యొక్క గుడ్డ ముక్కను చీల్చుకుని, పెద్ద రంధ్రం వదిలి మాసిక వేసేందుకు వాడిన కొత్త గుడ్డ పాత వస్త్రాన్ని చింపుతుంది. ఇది పాత వస్త్రంలో ఒక రంధ్రం కప్పి వేయడానికి ఉపయోగించిన గుడ్డ ముక్క

the patch

మాసిక ఆ బట్టను చింపేస్తుంది. ఆ బట్టను ఎవరైన ఉతికితే, కొత్త గుడ్డ ముక్క కుదించుకు పోతుంది. కానీ మాసిక ఆ పాత బట్టను చినిగిపోయేలా చేస్తుంది. ఇది వస్త్రం యొక్క గుడ్డ ముక్కను చీల్చుకుని, పెద్ద రంధ్రం వదిలి మాసిక వేసేందుకు వాడిన కొత్త గుడ్డ పాత వస్త్రాన్ని చింపుతుంది. ఇది పాత వస్త్రంలో ఒక రంధ్రం కప్పి వేయడానికి ఉపయోగించిన గుడ్డ ముక్క

a worse tear will be made

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఇది చినుగును మరింత పెద్దది చేస్తుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 9:17

Connecting Statement:

యేసు యోహాను శిష్యులు ప్రశ్నకు జవాబు కొనసాగిస్తున్నాడు.

Neither do people put new wine into old wineskins

యేసు మరొక సామెత ఉపయోగించి యోహాను శిష్యులకు జవాబు ఇస్తున్నాడు. [మత్తయి 9:16]లో ఉన్న సామెత అర్థమే దీనికి కూడా వర్తిస్తుంది.(../09/16.md).

Neither do people put

ఎవరూ నింపరు, లేక “మనుషులు పొయ్యరు.

new wine

దీని అర్థం ఇంకా పులవని ద్రాక్షరసం. ద్రాక్షలు మీ ప్రాంతంలో తెలియక పొతే పండ్ల కోసం వాడే సాధారణ పదం వాడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ద్రాక్ష రసం (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-unknown)

old wineskins

దీని అర్థం ద్రాక్షరసం తిత్తులు బాగా సాగి ఎండిపోయాయి. ఎందుకంటే వారు ఇప్పటికే ద్రాక్షరసం పులియబెట్టడానికి వాటిని ఉపయోగించారు.

wineskins

ద్రాక్షరసం సంచులు. లేక “చర్మం తిత్తులు. ""వీటిని జంతు చర్మంతో తయారు చేస్తారు.

the wine will be spilled, and the wineskins will be destroyed

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అది ద్రాక్షరసం తిత్తులను పిగిలిపోజేసి ద్రాక్షరసం ఒలికిపోయేలా చేస్తుంది. "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

the skins will burst

కొత్త ద్రాక్షరసం పులిసినప్పుడు అది పొంగుతుంది. తిత్తులు చినిగిపోతాయి ఎందుకంటే అవి సాగవు.

fresh wineskins

కొత్త ద్రాక్షరసం తిత్తులు లేక “కొత్త ద్రాక్షరసం సంచులు."" దీని అర్థం ఎప్పుడూ వాడని ద్రాక్షరసం తిత్తులు.

both will be preserved

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఇది ద్రాక్షరసం, ద్రాక్షరసం తిత్తులు రెంటినీ క్షేమంగా ఉంచుతుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 9:18

Connecting Statement:

ఇది యేసు ఒక యూదు అధికారి కూతురును బ్రతికించిన సంఘటన.

these things

దీని అర్థం యోహాను శిష్యులకు ఉపవాసం గురించి యేసు ఇచ్చిన జవాబు.

behold

“ఇదిగో” అనే పదం కథనంలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడని మనలను హెచ్చరిస్తున్నది. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది..

bowed down to him

యూదు సంస్కృతిలో ఒక మనిషి పట్ల గౌరవం చూపే పధ్ధతి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-symaction)

come and lay your hand on her, and she will live

యూదు అధికారికి తన కూతుర్ని బ్రతికించే శక్తి యేసుకు ఉన్నదని నమ్మకం ఉన్నట్టు చూపిస్తున్నది.

Matthew 9:19

his disciples

యేసు శిష్యులు

Matthew 9:20

Connecting Statement:

ఇది యేసు బాగు చేసిన సంఘటన. యూదు అధికారి ఇంటికి యేసు వెళుతుండగా మరొక స్త్రీ తారసపడింది.

Behold

“ఇదిగో” అనే పదం కథనంలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడని మనలను హెచ్చరిస్తున్నది. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది..

who suffered from a discharge of blood

ఆమెకు రక్తస్రావం ఉంది. లేక “తరుచుగా రక్తం కారుతుంది."" ఆమెకు బహుశా గర్భసంచిలోనుండి సమయం కాకపోయినా రక్తస్రావం అవుతూ ఉండవచ్చు. కొన్ని సంస్కృతుల్లో ఈ స్థితిని మంచిమాటల్లో చెప్పే వీలు ఉండవచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-euphemism)

twelve years

12 సంవత్సరాలు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-numbers)

his garment

ఆయన వస్త్రం. లేక “అయన ధరించినది.

Matthew 9:21

For she had said to herself, ""If only I touch his clothes, I will be made well.

“ఆమె తనలో అనుకుంది.“ ఆమె యేసు వస్త్రం తాకింది. ఇది “ఆమె ఎందుకు యేసు వస్త్రం తాకిందో తెలియజేస్తున్నది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-events మరియు /WA-Catalog/te_tm?section=translate#translate-versebridge)

If only I touch his clothes

యూదు ధర్మశాస్త్రం ప్రకారం, ఎందుకంటే “ఆమెకు స్రావం ఉంది గనక “ ఆమె ఎవరినీ ముట్టుకోకూడదు. “ఆమె ఆయన బట్టలు ముట్టుకుంటే యేసులోని ప్రభావం తనను స్వస్థ పరుస్తుందని ఆమె అనుకుంది. అయతే తాను ఆయన్ను తాకినట్టు ఆయనకు తెలియదులే అనుకుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 9:22

But Jesus

ఆ స్త్రీ “తాను రహస్యంగా ఆయన్ను తాకాలనుకుంది, కానీ యేసు

Daughter

ఆ స్త్రీ యేసు అసలు కూతురు కాదు. యేసు ఆమెతో ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. ఇది గందరగోళంగా అనిపిస్తే దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు""యువతి"" లేదా అసలు మొత్తం మానెయ్యవచ్చు.

your faith has made you well

ఎందుకంటే నేను నిన్ను స్వస్థ పరచగలనని నమ్మావు.

the woman was healed from that hour

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు ఆ క్షణంలో ఆమెను బాగు చేశాడు.(చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 9:23

Connecting Statement:

యూదు అధికారి కూతురును తిరిగి బ్రతికించే సన్నివేశానికి మళ్ళీ వస్తున్నాము.

the flute players and the crowds making much noise

ఇది చనిపోయిన వారికోసం విలపించే సాధారణ పధ్ధతి.

flute players

వేణువు వాయించే మనుషులు.

Matthew 9:24

Go away

యేసు అనేక మంది మనుషులతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీ భాషలో బహు వచనం ఆజ్ఞ పదం వాడండి.

the girl is not dead, but she is asleep

యేసు అలంకారిక భాష ఉపయోగిస్తున్నాడు. ఆ దినాల్లో చనిపోయిన వాణ్ణి “నిద్ర పోతున్నాడు” అనడం వాడుక. కానీ ఇక్కడ చనిపోయిన బాలిక మళ్ళీ”ఆమె నిద్రనుంచి మేల్కొన్నట్టు” లేస్తుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-euphemism)

Matthew 9:25

General Information:

వ. 26 చనిపోయిన అమ్మాయిని బ్రతికించడాన్ని వర్ణించే సంక్షిప్త ప్రతిపాదన.

Connecting Statement:

ఇది యూదు అధికారి కూతురును తిరిగి బ్రతికించే సన్నివేశానికి ముగింపు.

When the crowd had been put outside

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: తరువాత యేసు జనసమూహాన్ని బయటికి పంపించి వేశాడు.” లేక “తరువాత కుటుంబంలోని మనుషులను బయటికి పంపాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

got up

మంచం మీద నుండి లే. ఇది [మత్తయి 8:15]లో ఉన్న అర్థం ఇచ్చే మాటే.(../08/15.md).

Matthew 9:26

The news about this spread into all that region

ఆ ప్రాంతం అంతటినుంది మనుషులు ఇది విన్నారు. లేక “ఆ బాలికను సజీవంగా చూసిన మనుషులు మొత్తం ప్రాంతానికి ఈ మాట చెప్పారు.

Matthew 9:27

Connecting Statement:

యేసు స్వస్తపరిచిన ఇద్దరు గుడ్డి వాళ్ళ కథనం మొదలవుతున్నది.

As Jesus passed by from there

యేసు ఆ ప్రాంతం విడిచి వెళ్ళి పోతున్నప్పుడు.

passed by

బయల్దేరాడు లేదా విడిచి వెళ్ళి పోతున్నప్పుడు .

followed him

దీని అర్థం వారు యేసు వెనక నడుస్తున్నారు. వారు ఆయన శిష్యులు కావచ్చు, కాక పోవచ్చు.

Have mercy on us

వారు యేసు తమను స్వస్థ పరచమని కోరారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Son of David

యేసు వాస్తవంగా దావీదు కుమారుడు కాదు. కాబట్టి దీన్ని ఇలా అనువదించవచ్చు"" దావీదు సంతతి వాడు."" అయితే, ""దావీదు కుమారుడు "" అనేది కూడా మెస్సియకు ఒక బిరుదు ఈ మనుషులు బహుశా యేసును ఈ బిరుదుతో పిలుస్తున్నారు.

Matthew 9:28

When Jesus had come into the house

ఇది యేసు సొంత ఇల్లు లేక [మత్తయి 9:10]లో చెప్పిన ఇల్లు (../09/10.md).

Yes, Lord

వారి జవాబు మొత్తం ఇక్కడ లేదు. కానీ ఉన్నట్టు గ్రహించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: అవును, ప్రభూ, నీవు మమ్మల్ని స్వస్థ పరచగలవని నమ్ముతున్నాము. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Matthew 9:29

touched their eyes and said

ఆయన ఆ ఇద్దరు మనుషుల కళ్ళు ఒకే సారి తాకాడో లేక కేవలం తన కుడి చేతులు ఒకరి వెంట ఒకరిపై ఉంచాడో స్పష్టంగా లేదు. స్వస్థత కోసం సాధారణంగా ఎడమ చెయ్యి మామూలు విషయాలకు వాడతారు కాబట్టి బహుశా అయన తన కుడి చెయ్యి ఉపయోగించి ఉండాలి.వారిని తాకుతున్నప్పుడు మాట్లాడాడో, లేక మొదట తాకి తరువాత మాట్లాడాడో స్పష్టంగా లేదు.

Let it be done to you according to your faith

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" నీవు నమ్మినట్టే నేను చేస్తాను.” లేక “ఎందుకంటే నీవు నమ్మావు గనక నిన్ను స్వస్థపరుస్తాను."" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 9:30

their eyes were opened

దీని అర్థం వారు చూడగలిగారు. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు వారి కళ్ళు బాగు చేశాడు.” లేక “ఇద్దరు గుడ్డి వాళ్ళు చూడగలిగారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

See that no one knows about this

ఇక్కడ చూడండి అంటే కచ్చితంగా. ప్రత్యామ్నాయ అనువాదం: ఇది ఎవరికీ తెలియకుండా చూడండి” లేక “నేను నిన్ను బాగుచేశానని ఎవరితో చెప్పకండి (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

Matthew 9:31

But the two men

ఆ ఇద్దరు మనుషులు యేసు వారితో చెప్పినట్టు చెయ్యలేదు.

spread the news

వారు అనేక మందికీ తమకు జరిగినది చెప్పారు.

Matthew 9:32

Connecting Statement:

ఇది యేసు ఒక దయ్యం పట్టిన మూగ వాణ్ణి స్వస్థ పరిచిన సన్నివేశం.

behold

“ఇదిగో” అనే పదం కథనంలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడని మనలను హెచ్చరిస్తున్నది. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది..

a mute man ... was brought to Jesus

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఎవరో ఒక మూగ మనిషిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

mute

మాట్లాడలేని

possessed by a demon

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దయ్యం పట్టిన వాడు” లేక “దయ్యం అదుపులో ఉన్నవాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 9:33

When the demon had been driven out

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: తరువాత యేసు దయ్యాన్ని వెళ్ళగొట్టాడు.” లేక “తరువాత యేసు దయ్యాన్ని వెళ్ళిపొమ్మని అజ్ఞాపించాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

the mute man spoke

ఈ మూగ మనిషి మాట్లాడసాగాడు. లేక “ఆ మనిషి మాట్లాడాడు” లేక “ఆ మనిషికి మూగతనం పోయి మాట్లాడాడు.

The crowds were astonished

మనుషులు ఆశ్చర్యపోయారు

This has never been seen

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఇది ఇంతకు ముందెన్నడూ జరగలేదు.” లేక “ఇంతకు ముందు ఎవరూ ఇలాటిది చెయ్యలేదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 9:34

he drives out demons

అయన దురాత్మలను వెళ్ళగొట్టాడు.

he drives

“అయన” అనే సర్వనామం యేసును సూచిస్తున్నది.

Matthew 9:35

General Information:

వ. 36 లో ఒక కొత్త భాగం మొదలవుతున్నది. యేసు తన శిష్యులను తాను చేసినట్టుగానే బోధించడానికి, స్వస్థ పరచడానికి పంపించాడు.

(no title)

వ. 35 లో [మత్తయి 8:1]దగ్గర మొదలైన కథనం అంతం అయింది.(../08/01.md) అంటే యేసు గలిలయలో జరిగించిన స్వస్థ పరిచే పరిచర్య. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-endofstory)

all the cities

అన్నీ"" అనే పదం అతిశయోక్తి. యేసు అనేక నగరాలకు వెళ్ళాడని ఇది చెబుతున్నది. అయన తప్పనిసరిగా వాటన్నిటికీ వెళ్ళాడని చెప్పడం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: అనేక నగరాలు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-hyperbole)

cities ... villages

పెద్ద గ్రామాలు చిన్న గ్రామాలు లేక “పెద్ద ఊళ్లు చిన్న ఊళ్లు

the gospel of the kingdom

ఇక్కడ రాజ్యం అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండిమత్తయి 4:23. ప్రత్యామ్నాయ అనువాదం: "" దేవుడు రాజుగా పరిపాలించే స్థితిని చెప్పే సువార్త."" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-abstractnouns)

all kinds of disease and all kinds of sickness

ప్రతి వ్యాధి ప్రతి రోగం. ఈ పదాలు""వ్యాధి” “రోగం"" అనేవి ఒక దానికొకటి సంబంధం ఉన్నాయి. కానీ సాధ్యమైతే వేరువేరు మాటలుగా తర్జుమా చెయ్యండి. వ్యాధి అనేది ఒక వ్యక్తిని రోగిగా చేస్తుంది. రోగం భౌతిక బలహీనత, లేక వ్యాధి ఫలితం.

Matthew 9:36

They were like sheep without a shepherd

ఇది ఉపమాలంకారం. అంటే వారిని చూసుకునే నాయకుడు లేడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులకు నాయకుడు లేడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-simile)

Matthew 9:37

General Information:

యేసు ఒక పంటకోత గురించి సామెత ఉపయోగించి తన శిష్యులతో చెబుతున్నాడు. వారు ఇంతకుముందు భాగంలో చెప్పిన జనసమూహాల అవసరతలు పట్టించుకోవాలి.

The harvest is plentiful, but the laborers are few

యేసు తనకు కనబడినదానికి స్పందించడానికి ఒక సామెత వాడుతున్నాడు. యేసు ఉద్దేశం అక్కడ దేవునిపై నమ్మకం ఉంచగోరుతున్న అనేక మంది మనుషులు ఉన్నారు గానీ దేవుని సత్యం వారికి బోధించడానికి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-proverbs)

The harvest is plentiful

పండిన ఆహారం పుష్కలంగా ఉంది గానీ దాన్ని సేకరించేవారు కొద్ది మందే ఉన్నారు.

laborers

పనివారు

Matthew 9:38

pray to the Lord of the harvest

దేవుణ్ణి ప్రార్థించండి. ఎందుకంటే పంటకోత బాధ్యత ఆయనదే.