Matthew 7

మత్తయి 07 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

యేసు ఈ ప్రసంగంలో అనేక విషయాలు ప్రస్తావిస్తున్నాడు. యేసు అంశం మార్చిన ప్రతిసారీ ఖాళి లైను ఉంచడం ద్వారా పాఠకునికి సౌలభ్యం కల్పించ వచ్చు.

ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు

మత్తయి 5-7

ఈ భాగాన్ని కొందరు 5-7 కొండమీద ప్రసంగం అంటారు. ఇది యేసు బోధించిన సుదీర్ఘ ప్రసంగ పాఠం. బైబిల్ దీన్ని మూడు అధ్యాయాలుగా విడగొట్టింది. అయితే ఇది పాఠకుని అయోమయానికి గురి చెయ్యవచ్చు. నీ అనువాదం వాచకాన్ని భాగాలుగా చూపిస్తే ఇదంతా ఒకే పెద్ద ప్రసంగం అని పాఠకునికి అర్థం అయ్యేలా జాగ్రత్త పడండి.

వారి ఫలాల వల్ల నీవు వారిని గుర్తిస్తావు

ఫలం అనేది లేఖనాల్లో తరచుగా కనిపించే అలంకారిక భాష. వారి మంచి, లేక చెడ్డ క్రియలను సూచించడానికి ఇది వాడతారు. ఈ అధ్యాయంలో మంచి ఫలం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడం. (చూడండి: /WA-Catalog/te_tw?section=other#fruit)

Matthew 7:1

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. నీవు మరియు ఆజ్ఞలు అనేవి బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Connecting Statement:

యేసు తన శిష్యులకు కొండమీద ప్రసంగంలో బోధిస్తున్న దాన్ని కొనసాగిస్తున్నాడు. అది 5:3 లో మొదలైంది. మత్తయి 5:3.

Do not judge

ఇక్కడ తీర్పు అనేదానికి "" కఠినంగా నేరం మోపడం” లేక “దోషి అని తీర్చడం"" అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: మనుషులపై కఠినంగా నేరం మోపవద్దు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

you will not be judged

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు నీకు కఠినంగా తీర్పు తీర్చడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 7:2

For

7:2 లోని ప్రతిపాదన యేసు 7:1లో చెప్పిండనడానికి అనుగుణంగా ఉంది అని పాఠకుడు అర్థం చేసుకునేలా చూడండి.

with the judgment you judge, you will be judged

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నీవు ఇతరులకు తీర్పు తీర్చినట్టే దేవుడు కూడా నీకు అదేవిధంగా తీర్పు తీరుస్తాడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

measure

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) ఇది వారికి ఇచ్చిన శిక్ష లేక 2) ఇది శిక్ష వేయడానికి ఉపయోగించిన ప్రమాణం.

it will be measured out to you

దీన్ని క్రియాశీల రూపం వాక్యంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు నీకు కొలిచి ఇస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 7:3

General Information:

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ “నీవు” “నీ” అని రాసినవన్నీ ఏక వచనం, కానీ కొన్ని భాషల్లోవాటిని బహు వచనంగా తర్జుమా చెయ్యవలసి రావచ్చు.

Why do you look ... brother's eye, but you do not notice the log that is in your own eye?

యేసు ఈ ప్రశ్నను తమ పాపాలను విస్మరించి ఇతరుల పాపాలను చూస్తూ కూర్చునే వారిని గద్దించడానికి వాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: నీవు నీ సోదరుని కంటి నలుసును చూస్తూ నీ కంటిలో ఉన్న దూలాన్ని చూడడం లేదు.” లేక “నీ కంట్లోని దూలాన్ని పట్టించుకోకుండా నీ సోదరుని కంట్లో నలుసును చూస్తున్నావు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

the tiny piece of straw that is in your brother's eye

ఇది రూపకఅలంకారం. అంటే సాటి విశ్వాసి ప్రాముఖ్యమైన తప్పులు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

tiny piece of straw

నలక లేక నలుసు” లేక “ధూళి కణం. మనిషి కంట్లో సాధారణంగా పడగలిగిన అన్నిటికన్నా చిన్న కణం వంటి పదాన్ని ఉపయోగించండి.

brother

7:3-5లో సోదరుడు అనే మాటలన్నీ సాటి విశ్వాసినీ సూచిస్తున్నాయి. అంతే గానీ రక్త సంబంధి అయిన సోదరుడుగానీ పొరుగు వాడుగానీ కాదు.

the log that is in your own eye

ఇది రూపకఅలంకారం. ఒక వ్యక్తి చేసే ప్రాముఖ్యమైన తప్పులు. ఒక వ్యక్తి కంట్లో దూలం పట్టదు. యేసు ఇక్కడ ప్రతి మనిషి జాగ్రత్తగా ధ్యాస పెట్టాలని నొక్కి చెప్పడం కోసం అతిశయోక్తిగా మాట్లాడుతున్నాడు. మనిషి వేరొకడిలోని చిన్న తప్పులు పట్టించుకుంటూ తన పెద్ద తప్పులు పట్టించుకోడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-hyperbole)

log

నరికిన చెట్టు లోని అతి పెద్ద భాగం.

Matthew 7:4

How can you say ... your own eye?

మరొక వ్యక్తి పాపాలు పట్టించుకోక ముందు మనుషులు తమ పాపాల సంగతి చూసుకోవాలని సవాలు చెయ్యడానికి యేసు ఈప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: నీవు అనకూడదు.. నీ స్వంత కన్ను. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Matthew 7:6

General Information:

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సమూహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ “మీరు” “మీ” అనేవన్నీ బహు వచనాలు.

dogs ... hogs

యూదులు ఈ జంతువులను అశుద్ధంగా ఎంచారు. దేవుడు వాటిని తినకూడదని యూదులకు చెప్పాడు. పవిత్రమైన వాటిని లెక్కచెయ్యని దుష్టులను సూచించడానికి ఈ రూపకఅలంకారాలను ఉపయోగించారు. వీటిని అక్షరార్థంగా తర్జుమా చెయ్యడం మంచిది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

pearls

ఇవి గుండ్రని విలువైన పూసల వంటివి. అవి దేవుని ప్రశస్తమైన సంగతులను ఎరిగి ఉండడం అనే దాన్ని సూచించే రూపకఅలంకారం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

they may trample

పందులు తొక్కేస్తాయి.

then turn and tear

అప్పుడు కుక్కలు తిరిగి చీల్చి వేస్తాయి.

Matthew 7:7

General Information:

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ “మీరు” “మీ” అనేవి బహు వచనాలు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Ask ... Seek ... Knock

దేవునికి ప్రార్థన చెయ్యడాన్ని సూచించే రూపకఅలంకారాలు. మనం దేవుడు జవాబిచ్చేదాకా ప్రార్తిస్తూనే ఉండాలని ఈ క్రియాపదం సూచిస్తున్నది. మీ భాషలో ఒకే దాన్ని పదే పదే చేస్తూ ఉండే దాన్ని సూచించే పదం ఉంటే, ఇక్కడ వాడండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Ask

ఎవరినన్నా అభ్యర్థించడం, ఇక్కడ దేవుణ్ణి.

it will be given to you

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు నీకు అవసరమైన వాటిని ఇస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Seek

ఎవరికోసమన్నా చూడాలి, అంటే ఇక్కడ దేవుని కోసం.

Knock

తలుపు తట్టడం అంటే ఇంట్లోకి లేక గదిలోకి రానిమ్మని ఎవరినైనా మర్యాదపూర్వకంగా అడగడం. మీ సంస్కృతిలో తలుపు కొట్టడం మర్యాద కాకపోతే తలుపు తెరవమని మర్యాదగా అడిగేదెలానో, ఆ పదం వాడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""తలుపు తెరవమని దేవుణ్ణి అడుగు.

it will be opened to you

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు నీకు తలుపు తెరుస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 7:9

Or which one of you ... a stone?

యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: అక్కడ మీ మధ్య ఒక్క వ్యక్తి లేడు.. ఒక్క రాయి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

a loaf of bread

అంటే ఆహారం. ప్రత్యామ్నాయ అనువాదం: కొంచెం ఆహారం (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-synecdoche)

stone

ఈ నామవాచకాన్ని అక్షరార్థంగా తర్జుమా చెయ్యాలి.

Matthew 7:10

fish ... snake

ఈ నామవాచకాలను అక్షరార్థంగా తర్జుమా చెయ్యాలి.

Or if he asks for a fish, will give him a snake?

యేసు మనుషులకు బోధించడానికి మరొక ప్రశ్న అడుగుతున్నాడు. యేసు ఇక్కడ ఇంకా ఒక మనిషి అతని కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: మీలో ఎవరి కొడుకన్నా చేపకోసం అడిగితే పామునిస్తారా? (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Matthew 7:11

General Information:

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ “మీరు” “మీ” అనేవి బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

how much more will your Father in heaven give ... him?

యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: మీ పరలోకపు తండ్రి తప్పకుండా ఇస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 7:12

whatever things you want people to do to you

ఇతరులు నీ విషయంలో ఎలా చెయ్యాలని నీవు అనుకుంటావో.

for this is the law and the prophets

ఇక్కడ ధర్మశాస్త్రం” “ప్రవక్తలు అంటే మోషే ప్రవక్తలు రాసినవి. ప్రత్యామ్నాయ అనువాదం: ఎందుకంటే ఇవి మోషే, ప్రవక్తలు నేర్పించిన లేఖనాలు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 7:13

General Information:

ఇవి విశాల మార్గంలో నడిచే వాళ్ళు జీవానికి, ఇరుకు మార్గంలో నడిచే వాళ్ళు నాశనానికి, వెళ్ళే విషయం వారి జీవిత విధానాలను, వారు పొందే ఫలితాలను సూచిస్తున్నాయి. మీరు తర్జుమా చేసేటప్పుడు, విశాలం” “వెడల్పు అనే వాటికి సరైన పదాలు వాడండి. అంతేగాక ఇరుకు అనే మాట కూడా రెండు రకాల గేట్లు, దారులు, వాటి మధ్య తేడాలు చూపించేలా ఉపయోగించండి.

Enter through the narrow gate ... many people who go through it

ఇది ఒక రాజ్యం లోకి ప్రవేశించడానికి ప్రయాణం చేసే మనుషులను సూచిస్తున్నది. ఒక రాజ్యంలో ప్రవేశించడం తేలిక. వేరొక దానిలో ప్రవేశించడం కష్టం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Enter through the narrow gate

నీవు దీన్ని వ. 14 చివరికి తీసుకువెళ్ళవలసి రావచ్చు: ""కాబట్టి, ఇరుకు ద్వారం గుండా ప్రవేశించు.

the gate ... the way

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) దారి అంటే ఒక రాజ్యానికి తీసుకుపోయే రహదారి. లేక 2) ద్వారం” “మార్గం రెండూ ఆ రాజ్యంలో ప్రవేశాన్ని సూచిస్తున్నాయి.

to destruction

ఈ అవ్యక్త నామవాచకాన్ని క్రియాపదంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: మనుషులు చనిపోయే ప్రదేశం (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-abstractnouns)

Matthew 7:14

Connecting Statement:

ఏ విధంగా జీవించాలి అనే వారిని సూచిస్తూ అలాటి వారిని ఏ దారిలో వెళ్ళాలి అని ఆలోచించుకునే వారితో యేసు పోలుస్తున్నాడు.

to life

అవ్యక్త నామవాచకం జీవం ను క్రియాపదంగా తర్జుమా చెయ్యవచ్చు.జీవించు. ప్రత్యామ్నాయ అనువాదం: మనుషులు జీవంతో ఉండే చోటు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-abstractnouns)

Matthew 7:15

Beware of

వ్యతిరేక౦గా కాపలా కాయ౦డి

who come to you in sheep's clothing but are truly ravenous wolves

ఈ రూపకఅలంకారానికి అర్థం అబద్ద ప్రవక్తలు తాము మంచి వారమన్నట్టు, ఇతరులకు సహాయ పడతామన్నట్టు నటిస్తారు. వాళ్ళు నిజానికి దుష్టులు. మనుషులకు హాని చేస్తారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 7:16

By their fruits you will know them

ఈ రూపకఅలంకారం ఒక వ్యక్తి క్రియలు. ప్రత్యామ్నాయ అనువాదం: చెట్టుకు కాసే కాయలను బట్టి అది ఏ చెట్టు అనేది నీకు తెలుస్తుంది. అబద్ద ప్రవక్తలను వారి ప్రవర్తనను బట్టి నీవు గ్రహించగలవు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Do people gather ... thistles?

యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. దీనికి జవాబు “కాదు” అని వారికి తెలుసు. ప్రత్యామ్నాయ అనువాదం: మనుషులు ముళ్ళు ఏరుకోరు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Matthew 7:17

every good tree produces good fruit

యేసు మంచి ప్రవక్తల కోసం మంచి ఫలాల రూపకఅలంకారం వాడుతూ వారిలో మంచి పనులు లేక మంచి మాటలు ఉంటాయని చెబుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

the bad tree produces bad fruit

యేసు అబద్ద ప్రవక్తల కోసం రూపకఅలంకారం వాడుతూ వారిలో చెడు పనులు లేక చెడు మాటలు ఉంటాయని చెబుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 7:19

Every tree that does not produce good fruit is cut down and thrown into the fire

యేసు అబద్ద ప్రవక్తలకోసం చెడు ఫలాలనిచ్చే చెట్టు రూపకఅలంకారం వాడుతున్నాడు. ఇక్కడ, చెడు చెట్టుకు ఏమి జరుగుతుందో చెబుతున్నాడు. అబద్ద ప్రవక్తలకు కూడా అదే జరుగుతుంది అనేది అర్థం అవుతున్నది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

is cut down and thrown into the fire

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నరికి తగలబెడతారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 7:20

you will recognize them by their fruits

వారి"" అనేది ప్రవక్తలకు లేక చెట్లకు వర్తిస్తుంది. ఈ రూపకఅలంకారం అర్థం ఆ చెట్ల పళ్ళు, ఆ ప్రవక్తల చర్యలు వారు మంచి వారో చెడ్డవారో తేటతెల్లం చేస్తాయి. సాధ్యమైతే, ఇది ప్రవక్తలకు, చెట్లకు కూడా వర్తించేలా తర్జుమా చెయ్యండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 7:21

will enter into the kingdom of heaven

ఇక్కడ దేవుని రాజ్యం అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. దేవుని రాజ్యం అనే పదబంధం మత్తయి సువార్తలో మాత్రమే వాడారు. సాధ్యమైతే, మీ అనువాదంలో పరలోకం అని ఉంచండి. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు తనను రాజుగా కనపర్చుకునేటప్పుడు పరలోకంలో ఉంటాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

those who do the will of my Father who is in heaven

నా పరలోకంలో ఉన్న తండ్రి కోరిక మేరకు ఎవరైతే చేస్తారో.

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 7:22

in that day

యేసు ఆ దినం అనే మాటను తన శ్రోతలు తాను తీర్పు దినం గురించి అంటున్నాడని తెలిసి మాట్లాడుతున్నాడు. మీరు తీర్పు దినం అనే పదాన్ని మీ పాఠకులు దీన్ని అపార్థం చేసుకోరు అనుకుంటేనే ఉపయోగించాలి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

did we not prophesy ... drive out demons ... do many mighty deeds?

మనుషులు ఒక ప్రశ్నను ఉపయోగిస్తూ తాము ఈ పనులు చేస్తున్నామని స్పష్టంగా చెబుతున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: మేము ప్రవచించాము. దురాత్మలు వెళ్ళగొట్టాము. అనేక అద్భుతాలు చేశాము. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

we

ఇక్క మేము అనే దానిలో యేసు లేడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-exclusive)

in your name

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) నీ అధికారం చొప్పున” లేక “నీ శక్తితో లేక 2) నీవు చెయ్యమన్నది చేశాము లేక 3) వాటిని చెయ్యడానికి నీనుండి శక్తిని అడిగాము (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

mighty deeds

అద్భుతాలు

Matthew 7:23

I never knew you

దీని అర్థం ఆ వ్యక్తి యేసుకు చెందిన వాడు కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు నన్ను అనుసరించేవాడవు కాదు” లేక “నీతో నాకేమీ జోక్యం లేదు” (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

Matthew 7:24

Therefore

ఆ కారణం చేత

my words

ఇక్కడ మాటలు అంటే యేసుచెప్పేవి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

like a wise man who built his house upon a rock

యేసు ఆయన మాటలు పాటించే వారిని తన ఇల్లు ఎలాటి ప్రమాదం జరగని తావులో కట్టుకునే వారు అని చెబుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-simile)

rock

ఇది మన్ను కింద ఉండే రాతిమట్టం. నేల పైన ఉండే బండ రాళ్ళూ కాదు.

Matthew 7:25

it was built

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నిర్మించాడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 7:26

Connecting Statement:

ఇది యేసు కొండమీద ప్రసంగం అంతం. మత్తయి 5:3.

like a foolish man who built his house upon the sand

యేసు ముందు వచనాల్లో వాడిన ఉపమాలంకారం కొనసాగిస్తున్నాడు. మాటలు పాటించని వారిని బుద్ధిలేని నిర్మాణకులతో పోలుస్తున్నాడు. కేవలం బుద్ధి లేని వాడే వాన, గాలి ఇసుకను కొట్టుకుపోయేలా చేసే ఇసుక నేలపై కట్టుకుంటాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-simile)

Matthew 7:27

fell

మీ భాషలో ఇల్లు కూలినప్పుడు ఉపయోగించే మామూలు పదం వాడండి.

its destruction was complete

వర్షం, వరద, గాలి ఇంటిని పూర్తిగా నాశనం చేసాయి.

Matthew 7:28

General Information:

ఈ వచనాలు జనసమూహాలు కొండమీద ప్రసంగంలో యేసు ఉపదేశాలకు స్పందించిన తీరును అభివర్ణిస్తున్నాయి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-endofstory)

It came about that when

ఈ పదబంధం కథనం యేసు ఉపదేశాలనుండి తరువాత జరిగిన దానికి మన దృష్టి మళ్లిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎప్పుడైతే” లేక “తరువాత

were astonished by his teaching

7:29లో యేసు బోధించిన దానికి మాత్రమే గాక బోధించిన విధానానికి వారు ఆశ్చర్యపోయారు అనేది స్పష్టం. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయన బోధించిన విధానాన్ని బట్టి వారు ఆశ్చర్యపోయారు.