Matthew 6

మత్తయి 06 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

మత్తయి 6లో యేసు చేసిన విస్తృతమైన ఉపదేశం కొండమీద ప్రసంగం కొనసాగుతున్నది.

నీవు 6:9-11లోని ప్రార్థనను మిగిలిన వాటికంటే పేజీపై కుడివైపుకు ఎక్కువ దూరంలో ఉంచడం ద్వారా మిగిలిన వాటికంటే పేజీపై కుడివైపుకు జరపవచ్చు.

యేసు ఈ ప్రసంగంలో వివిధ అంశాలు చర్చించాడు. కాబట్టి యేసు అంశం మార్చినప్పుడల్లా, చదివే వారికి సౌకర్యంగా ఉండేలా ఒక లైను వదిలిపెట్ట వచ్చు.

Matthew 6:1

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. మీరు” “మీ అని ఉన్నవన్నీ బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Connecting Statement:

యేసు తన శిష్యులకు కొండమీద ప్రసంగంలో కొన్ని విషయాలు బోధిస్తున్నాడు. ఇది [మత్తయి 5:3]లో ఆరంభం అయింది(../05/03.md). ఈ భాగంలో యేసు దానధర్మాలు, ప్రార్థన, ఉపవాసం మొదలైన ""నీతి క్రియల గురించి మాట్లాడుతున్నాడు.

before people to be seen by them

ఆ వ్యక్తి ని చూసిన వారు అతణ్ణి గౌరవిస్తారు అని భావం. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: మనుషులు నిన్ను చూసి నీవు చేసిన దాన్ని బట్టి నిన్ను పొగడేలా వారి ఎదుట పనులు చేస్తావు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 6:2

do not sound a trumpet before yourself

ఈ రూపకఅలంకారం అర్థం మనుషుల దృష్టిని ఆకర్షించడానికి చేసే ప్రయత్నం. ప్రత్యామ్నాయ అనువాదం: జనంలో ఉన్నప్పుడు పెద్ద బూర ఊదినట్టు అందరి దృష్టి నీపై పడేలా చేసుకోవద్దు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Truly I say to you

నేను సత్యం చెబుతున్నాను. ఈ పదబంధం యేసు చెప్పబోతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది.

Matthew 6:3

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. “మీరు” “మీ” అని ఉన్న చోటల్లా బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Connecting Statement:

యేసు తన శిష్యులతో దన ధర్మాల గురించి మాట్లాడుతున్నాడు.

do not let your left hand know what your right hand is doing

ఇది పూర్తి రహస్యం అనే అర్థమిచ్చే రూపకఅలంకారం. చేతులు ఏ విధంగా కలిసి పని చేస్తాయో, ఒకటి చేస్తున్నది రెండవ దానికి ఎలా తెలుస్తుందో నీకు బాగా సన్నిహితం అయిన వారికి కూడా నీవు పేదలకు ధర్మం చేస్తున్నట్టు తెలియనివ్వకూడదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 6:4

your gift may be given in secret

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఇతరులకు తెలియకుండా నీవు పేదలకు ఇయ్యవచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 6:5

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. వ. 5, 7 లో “మీరు” “మీ” బహు వచనం; వ. 6 లో ఏక వచనం, కానీ కొన్ని భాషల్లోవాటిని బహు వచనంగా తర్జుమా చెయ్యవలసి రావచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Connecting Statement:

యేసు ప్రార్థన గురించి బోధిస్తున్నాడు.

so that they may be seen by people

ఆ వ్యక్తి ని చూసిన వారు అతణ్ణి గౌరవిస్తారు అని భావం. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: వారిని చూసిన వారు వారిని గౌరవిస్తారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Truly I say to you

నేను సత్యం చెబుతున్నాను. ఈ పదబంధం యేసు చెప్పబోతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది.

Matthew 6:6

enter your inner chamber. Shut the door

నీవు ఎక్కడ ఏకాంతంగా ఉండగలవో"" అలాటి చోటికి వెళ్ళు.

Father who is in secret

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) దేవుణ్ణి ఎవరూ చూడలేరు. ప్రత్యామ్నాయ అనువాదం: అదృశ్యుడు అయిన తండ్రి లేక 2) దేవుడు కూడా ప్రార్ధిస్తున్న ఆ వ్యక్తితో ఆ రహస్య ప్రదేశంలో ఉన్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీతో రహస్య స్థానంలో ఉన్న తండ్రి.

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

your Father who sees in secret

నీ తండ్రి నీవు రహస్యంలో చేస్తున్నది చూస్తాడు.

Matthew 6:7

do not make useless repetitions

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు. 1) పదే పదే పలకడం వ్యర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: అనవసరంగా ఒకే మాట పలుకుతూ ఉండవద్దు. లేక 2) ఈ పదాలు లేక వాక్యాలు అర్థ రహితం. ప్రత్యామ్నాయ అనువాదం: ""అర్థం లేని మాటలు పదే పదే పలకవద్దు.

they will be heard

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: వారి అబద్ద దేవుళ్ళు. వింటున్నారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 6:8

General Information:

మనుషులు ఎలా ప్రార్థన చెయ్యాలో ఒక సమూహానికి వివరిస్తూ యేసు మాట్లాడుతున్నాడు. మొదటి వాక్యంలో ఈ పదాలు ”మీరు” “మీ” అనేవి బహు వచనాలు. ప్రార్థనలో, ఈ పదాలు “నీవు” “నీ” ఏక వచనం దేవుణ్ణి ఉద్దేశించేవి. పరలోకంలో ఉన్న మాతండ్రి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 6:9

Our Father in heaven

దేవుణ్ణి ప్రార్థనలో ఎలా సంబోధించాలి అని యేసు అక్కడివారికి నేర్పిస్తున్నాడు.

may your name be honored as holy

ఇక్కడ నీ నామము అంటే దేవుడే. ప్రత్యామ్నాయ అనువాదం: అందరూ నిన్ను గౌరవించేలా చెయ్యి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 6:10

May your kingdom come

ఇక్కడ రాజ్యం అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. ప్రత్యామ్నాయ అనువాదం: ప్రతి ఒక్కరి పైనా నీ పరిపాలన సంపూర్ణంగా నెలకొనేలా చెయ్యి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

May your will be done on earth as it is in heaven

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: భూమిపై ప్రతిదీ పరలోకంలో లాగే నీ సంకల్పానుసారం జరిగేలా చెయ్యి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 6:11

General Information:

ఇది యేసు నేర్పిస్తున్న ప్రార్థనలో భాగం. మేము, మాకు,” “మా అనేవన్నీ ఈ ప్రార్థన చేసే వాళ్ళకు వర్తిస్తాయి. ఇవి దేవునికి వర్తించవు. వారు ప్రార్థించేది దేవునికే. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-exclusive)

daily bread

ఇక్కడ రొట్టె అంటే ఆహారం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-synecdoche)

Matthew 6:12

debts

రుణం అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బాకీ ఉన్నది. ఇది పాపాలు అని అర్థం ఇచ్చే రూపకఅలంకారం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

our debtors

రుణస్తుడు అంటే మరొక వ్యక్తికి బాకీ పడ్డవాడు. ఇది రూపకఅలంకారం. దీని అర్థం మనకు వ్యతిరేకంగా పాపం చేసినవాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 6:13

Do not bring us into temptation

శోధన,"" అనే పదం అవ్యక్త నామవాచకం దీన్ని క్రియాపదంగా కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఏదీ మమ్మల్ని శోధించనియ్య వద్దు.” లేక “మేము పాపం చెయ్యడానికి ఇష్టపడేలా దేన్నీ చెయ్యనివ్వకు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-abstractnouns)

Matthew 6:14

General Information:

“మీరు” “మీ” అనేవి బహు వచనం. ఎవరన్నా ఇతరులను క్షమించకపోతే ఆ వ్యక్తికి ఏమౌతుందో యేసు చెబుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

their trespasses

అవ్యక్త నామవాచకం""అపరాధాలు"" అనేదాన్ని క్రియాపదంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: వారు నీకు వ్యతిరేకంగా అపరాధం చేస్తే (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-abstractnouns)

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 6:15

their trespasses ... your trespasses

అవ్యక్త నామవాచకం""అపరాధాలు"" క్రియాపదంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: వారు నీకు వ్యతిరేకంగా అపరాధం చేస్తే. నీవు దేవునికి వ్యతిరేకంగా అపరాధం చేస్తే” లేక “నీకు హాని చేసే పనులు చేస్తే లేక నీవు చేసే పనులు నీ తండ్రికి కోపం తెప్పిస్తే (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-abstractnouns)

Matthew 6:16

General Information:

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. వ. 16 లో మీరు అనేవన్నీ బహు వచనం. వ.17, 18 వచనాల్లో మనుషులు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో యేసు నేర్పిస్తున్నాడు. “నీవు” “నీ” అనేవన్నీ ఏక వచనం. కొన్ని భాషల్లో నీవు అనే వాటిని బహు వచనంగా తర్జుమా చెయ్యవలసి రావచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Connecting Statement:

యేసు ఉపవాసం గురించి బోధించడం మొదలు పెడుతున్నాడు.

they disfigure their faces

కపటులు తమ ముఖాలు కడుక్కోరు, తల దువ్వుకోరు. వేరు కావాలని అందరి దృష్టి తమ వైపు మళ్ళించుకునేందుకు అంటే తాము ఉపవాసం ఉన్నామని మనుషులు గుర్తించి తమను గొప్పగా భావిస్తారని ఇలా చేస్తారు.

Truly I say to you

నేను సత్యం చెబుతున్నాను. ఈ పదబంధం యేసు చెప్పబోతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది

Matthew 6:17

anoint your head

నీ జుట్టుకు నూనె రాసుకో లేక నీ తల దువ్వుకో తలకు నూనె పెట్టుకో అంటే మామూలుగా జుట్టు సరిగా ఉంచుకోవడం. క్రీస్తు అనే పేరుకు అర్థం అభిషేకం పొందిన వాడు అనే దానికీ దీనికి సంబంధం లేదు. అంటే మనుషులు ఉపవాసం ఉన్నప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఒకే విధంగా ఉండాలని యేసు ఉద్దేశం.

Matthew 6:18

Father who is in secret

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) ఎవరూ దేవుణ్ణి చూడలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అదృశ్యుడు అయిన తండ్రి, "" లేక 2) దేవుడు రహస్యంగా ఉపవాసం ఉన్న వ్యక్తితో ఉంటాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఏకాంతంలో నిన్ను చూసే తండ్రి "" దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండిమత్తయి 6:6.

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

who sees in secret

నీవు ఏకాంతంలో ఉన్నప్పుడు ఏమి చేస్తున్నావో చూస్తాడు. దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండిమత్తయి 6:6.

Matthew 6:19

General Information:

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. “మీరు” “మీ” అని ఉన్నవన్నీ బహు వచనాలు, వ. 21లో తప్ప, అక్కడ వారు అనేది ఏక వచనం. కొన్ని భాషల్లో “మీరు” “మీ” అనే వాటిని బహు వచనంలో రాయవలసి ఉంటుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Connecting Statement:

యేసు డబ్బు, వస్తువాహనాల గురించి బోధించడం మొదలు పెడుతున్నాడు.

treasures

సంపదలు, అంటే ఒక వ్యక్తి ఎక్కువగా విలువనిచ్చేవి.

where moth and rust destroy

ఎక్కడ చిమ్మెట, తుప్పు సంపదను పాడు చేస్తాయో.

moth

ఒక చిన్న, ఎగిరే పురుగు బట్టను పాడుచేస్తుంది.

rust

లోహాలపై పెరిగే గోధుమ రంగు పదార్థం.

Matthew 6:20

store up for yourselves treasures in heaven

ఇది రూపకఅలంకారం. భూమిపై చేసిన వాటికి దేవుడు నీకు పరలోకంలో ప్రతిఫలం ఇస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 6:21

there will your heart be also

ఇక్కడ హృదయం అంటే ఒక వ్యక్తి తలంపులు, ఆసక్తులు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 6:22

General Information:

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ “నీవు” “నీ” అని రాసినవన్నీ ఏక వచనం, కానీ కొన్ని భాషల్లోవాటిని బహు వచనంగా తర్జుమా చెయ్యవలసి రావచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

The eye is the lamp of the body ... with light

చూడగలిగిన ఆరోగ్యకరమైన కళ్ళనూ ఒక మనిషిని వ్యాధి మూలంగా గుడ్డి వాడుగా చేసే కళ్ళను ఇక్కడ పోలుస్తున్నాడు. ఇది రూపకఅలంకారం. ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సూచిస్తున్నది. తరచుగా యూదులు పాడైన కన్ను అనే పదబంధాన్ని అత్యాశ అనే అర్థంలో వాడతారు. దీని అర్థం ఒక వ్యక్తి సంపూర్ణంగా దేవునికి కట్టుబడి లోక విషయాలను అయన చూసిన రీతిలో చూస్తే అతడు సరిగా ప్రవర్తిస్తున్నాడు అన్నమాట. ఒక వ్యక్తి మరిన్ని కావాలని అత్యాశకు పోతే అతడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

The eye is the lamp of the body

ఈ రూపకఅలంకారం అర్థం దీపం ఒక వ్యక్తి చీకటిలో చూసేలా చేసినట్టే కన్ను ఒక వ్యక్తి చూసేలా చేస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: దీపం లాగా కన్ను కూడా నీవు అన్నిటినీ స్పష్టంగా చూసేలా చేస్తుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

eye

దీన్ని బహు వచనంగా తర్జుమా చేయవలసి రావచ్చు, ""కళ్ళు.

Matthew 6:23

But if your eye ... how great is that darkness

తరచుగా యూదులు పాడైన కన్ను అనే పదబంధాన్ని అత్యాశ అనే అర్థంలో వాడతారు. దీని అర్థం ఒక వ్యక్తి సంపూర్ణంగా దేవునికి కట్టుబడి లోక విషయాలను అయన చూసిన రీతిలో చూస్తే అతడు సరిగా ప్రవర్తిస్తున్నాడు అన్నమాట. ఒక వ్యక్తి మరిన్ని కావాలని అత్యాశకు పొతే అతడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

if your eye is bad

ఇది మాయ మంత్రాల గురించి కాదు. యూదులు తరచుగా దీన్ని అత్యాశను సూచించడానికి రూపకఅలంకారంగా వాడతారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

if the light that is in you is actually darkness, how great is that darkness!

నీ శరీరానికి వెలుగునిచ్చేది చీకటి కలిగిస్తే నీ శరీరం మొత్తం చీకటి అయిపోతుంది.

Matthew 6:24

for either he will hate the one and love the other, or else he will be devoted to one and despise the other

ఈ పదబంధాలు రెంటికీ అర్థం ఒకటే. ఒక వ్యక్తి దేవుణ్ణి, డబ్బును కూడా ఒకే సారి ప్రేమించలేడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parallelism)

You cannot serve God and wealth

నీవు ఒకే సమయంలో దేవుణ్ణి, డబ్బును ప్రేమించలేవు.

Matthew 6:25

General Information:

ఇక్కడ “మీరు” “మీ” అనేవన్నీ బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

I say to you

ఇది తరువాత యేసు చెబుతున్న దానికి ప్రాధాన్యతనిస్తుంది.

to you

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు

is not life more than food, and the body more than clothes?

యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: నీవు తినే వాటికన్నా ప్రాణం ఎక్కువ, నీవు ధరించే దానికన్నా నీ శరీరం ఎక్కువ.” లేక “స్పష్టంగా ఆహారం కన్నా ప్రాముఖ్యమైనవి, శరీరం విషయంలో బట్టల కన్నా ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Matthew 6:26

barns

ధాన్యం నిలవచేసే కొట్లు.

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Are you not more valuable than they are?

యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "" నీవు పక్షులకన్నా విలువైన వాడివే కదా."" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Matthew 6:27

General Information:

వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు “మీరు” “మీ” అనేవన్నీ బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Which one of you by being anxious can add one cubit to his lifespan?

యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ఇక్కడ జీవితకాలానికి ఒక మూరెడు కలపడం అనేది రూపకఅలంకారం, అంటే మనిషి జీవితకాలాన్ని పొడిగించడం. ప్రత్యామ్నాయ అనువాదం: మీలో ఎవరూ కూడా ఆందోళన చెందడం ద్వారా నీ జీవిత కాలానికి కొన్ని సంవత్సరాలు కలుపుకోలేవు. ఒక్క నిమిషం కూడా కలవదు. కాబట్టి నీవు నీ అవసరతల గురించి ఆందోళన చెందకూడదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

one cubit

మూర అంటే మీటరులో సగం కన్నా తక్కువ. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-bdistance)

Matthew 6:28

Why are you anxious about clothing?

యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: నీవు ఏమి ధరించాలి అన్న దాని గురించి ఆందోళన చెందకూడదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Think about

చూడండి

lilies ... They do not work, and they do not spin cloth

యేసు గడ్డి పూలను బట్టలు ధరించిన మనుషులతో పోల్చి మాట్లాడుతున్నాడు. గడ్డి పూలు వస్త్రాలు ధరించడం అనేది రూపకఅలంకారం, ఎందుకంటే మొక్కలకు అందమైన రంగురంగుల పూలు ఉంటాయి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-personification మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

lilies

గడ్డి పువ్వు ఒక జాతి అడివి పువ్వు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-unknown)

Matthew 6:29

even Solomon ... was not clothed like one of these

యేసు గడ్డి పూలను బట్టలు ధరించిన మనుషులతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మొక్కలకు అందమైన రంగురంగుల పూలు ఉంటాయి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-personification మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

I say to you

ఇది తరువాత యేసు చెబుతున్న దానికి ప్రాధాన్యతనిస్తుంది.

was not clothed like one of these

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""గడ్డి పూలు అంత అందంగా ఉన్న దుస్తులను ధరించలేదు. "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 6:30

so clothes the grass in the fields

యేసు గడ్డి పూలను బట్టలు ధరించిన మనుషులతో పోల్చి మాట్లాడుతున్నాడు. గడ్డి పూలు వస్త్రాలు ధరించడం అనేది రూపకఅలంకారం. ఎందుకంటే మొక్కలకు అందమైన రంగురంగుల పూలు ఉంటాయి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-personification మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

grass

మీ భాషలో గడ్డి అనే పదం, ముందటి వచనంలో గడ్డి పూలు కోసం వాడిన పదం ఒకటే అయితే దాన్ని వాడండి.

is thrown into the oven

యూదులు ఆ కాలంలో వంటకు గడ్డిని వాడేవారు. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఎవరన్నా దాన్ని మంటల్లో వేస్తారు.” లేక “తగలబెడతారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

how much more will he clothe you ... faith?

యేసు ప్రజలకు వారి అవసరాలు దేవుడు తీరుస్తాడని చెప్పడానికి బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: నీకు నమ్మకం ఉంటే నీకు తప్పక బట్టలు ధరింపజేస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

you of little faith

అల్ప విశ్వాసం ఉన్నవాడా. బట్టల విషయం ఆందోళన చెందడం ద్వారా దేవుని పట్ల వారికి అల్ప విశ్వాసం ఉందని యేసు అంటున్నాడు.

Matthew 6:31

Therefore

దీనంతటి వల్ల

What clothes will we wear

ఈ వాక్యంలో, బట్టలు అనేది వస్తువాహనాలను సూచించే పాక్షిక ప్రాతినిధ్య అలంకారం. ప్రత్యామ్నాయ అనువాదం: ఎలాటి వస్తువాహనాలు ఉంటాయో. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-synecdoche)

Matthew 6:32

For the Gentiles search for these things

యూదేతరులు కూడా తాము ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి వేసుకోవాలో నని దిగులు పెట్టుకుంటారు.

your heavenly Father knows that you need them

యేసు ఇక్కడ దేవుడు వారి మౌలిక అవసరాలు తీరుస్తాడని చెబుతున్నాడు.

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 6:33

seek first his kingdom and his righteousness

ఇక్కడ రాజ్యం అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. ప్రత్యామ్నాయ అనువాదం: మీ రాజైన దేవుని సేవ విషయం చూసుకోండి. మేలు చేయండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

all these things will be given to you

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు నీకు అన్నీ సమకూరుస్తాడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 6:34

Therefore

దీనంతటి వల్ల

tomorrow will be anxious for itself

యేసు రేపు ను గురించి అది ఆందోళన చెందే ఒక మనిషి అన్నట్టు మాట్లాడుతున్నాడు. యేసు ఒక వ్యక్తి రేపటి కోసం ఆందోళన చెందడం అనవసరం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-personification)