Matthew 5

మత్తయి 05 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

మత్తయి 5-7 లో ఉన్న ఈ భాగాన్ని అనేకమంది కొండమీద ప్రసంగం అని పిలుస్తారు. ఇది యేసు బోధించిన సుదీర్ఘమైన పాఠం. బైబిల్లో ఈ పాఠం మూడు అధ్యాయాలుగా ఉంది, కానీ ఇది చదివే వారికి కొంత అయోమయం కలిగించవచ్చు. మీ అనువాదం ఈ వాక్య భాగాన్ని రెండు భాగాలుగా విభజిస్తే గనక చదివే వారు ఇది మొత్తం ఒకే ప్రసంగ విభాగం అని అర్థం అయ్యేలా చూడాలి.

మత్తయి 5:3-10, విభాగాన్ని నవ ధన్యతలు లేక దీవెనలు అంటారు. కొందరు కొన్ని అనువాదాలు ఇలాటి కొన్ని వచనాలను రాసేటప్పుడు పేజీలో కొద్దిగా కుడి వైపున వచ్చేలా రాస్తారు. ఈ వాక్యాల్లో ధన్యుడు అనే పదం ప్రతి సారీ వస్తుంది. ఈ పదాలను ఇలా పద్య రూపంలో రాయడం ద్వారా ఈ ఉపదేశం పద్య శైలిని చూపించ వచ్చు.

యేసు ఈ ప్రసంగంలో చాలా విషయాలు ప్రస్తావించాడు. కాబట్టి యేసు అంశం మార్చినప్పుడల్లా ఒక లైను వదలడం ద్వారా చదివే వారికి సౌకర్యంగా ఉంటుంది.

ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు

ఆయన శిష్యులు

యేసును అనుసరించిన ప్రతి వ్యక్తినీ శిష్యుడు అనవచ్చు. యేసు పన్నెండుమందిని తనను అనుసరించిన వారిలో నుండి తన సన్నిహిత శిష్యులుగా ఎన్నుకున్నాడు. పన్నెండుమంది శిష్యులు. తరువాతి కాలంలో వారిని అపోస్తలులు అన్నారు.

Matthew 5:1

General Information:

వ. 3లోయేసు ధన్యులైన వారి లక్షణాలు చెబుతున్నాడు.

Connecting Statement:

ఇది కథనంలో కొత్త భాగం ఆరంభం. యేసు ఆయన శిష్యులకు బోధించడం మొదలు పెడుతున్నాడు. ఈ భాగం 7వ అధ్యాయం చివరిదాకా కొనసాగుతుంది. దీన్ని కొండమీద ప్రసంగం అంటారు.

Matthew 5:2

He opened his mouth

ఇది జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: యేసు మాట్లాడసాగాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

taught them

వారితో"" అంటే ఆయన శిష్యులతో.

Matthew 5:3

the poor in spirit

దీని అర్థం వినయ మనస్కులు. ప్రత్యామ్నాయ అనువాదం: తమకు దేవుని అవసరత ఉన్నదని గ్రహించిన వారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

for theirs is the kingdom of heaven

ఇక్కడ దేవుని రాజ్యం అంటే దేవుడు రాజుగా పాలించే సమయం. ఈ పదబంధం ఒక్క మత్తయి సువార్తలోనే ఉంది. సాధ్యమైతే, మీ అనువాదంలో పరలోకం అనే పదం ఉంచండి. ప్రత్యామ్నాయ అనువాదం: ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవుడు వారి రాజు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 5:4

those who mourn

బహుశా వారు విచారంగా ఉండడానికి కారణాలు- 1) లోకంలో ఉన్న పాపం లేక 2) తమ స్వంత పాపాలు లేక 3) వేరొకరి మరణం. మీ భాషలో సంతాప కారణం తప్పక అవసరం అయితే తప్ప కారణం స్పష్టంగా చెప్పవద్దు.

they will be comforted

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు వారిని ఓదారుస్తాడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 5:5

the meek

నమ్రత గల వారు, లేక ""తమ స్వశక్తి పై ఆధారపడని వారు.

they will inherit the earth

దేవుడు వారికి భూమి అంతా ఇస్తాడు.

Matthew 5:6

those who hunger and thirst for righteousness

ఈ రూపకాలంకారం యథార్థమైన దాన్ని చేసే ప్రగాఢ వాంఛ గల వారిని వర్ణిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: అదే ఆహారం, అదే పానీయం అన్నట్టు నీతిగా జీవించగోరే వారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

they will be filled

క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు వారిని నింపుతాడు” లేక “దేవుడు వారిని సంతృప్తి పరుస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 5:8

the pure in heart

హృదయాలు నిర్మలంగా ఉన్నవారు. ఇక్కడ హృదయం అనే మాట ఒక వ్యక్తి అంతరంగాన్ని లేక ఉద్దేశాలను తెలిపే అన్యాపదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుణ్ణి మాత్రమే సేవించాలనుకునే వారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

they will see God

ఇక్కడ చూడడం అంటే వారు దేవుని సన్నిధిలో ఉంటారు అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు వారిని తనతో ఉండనిస్తాడు.

Matthew 5:9

the peacemakers

ఇతరులు ఒకరితో ఒకరు శాంతి సమాధానాలతో జీవించేలా తోడ్పడే వారు.

for they will be called sons of God

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు వారిని తన పిల్లలు అని పిలుస్తాడు” లేక “వారు దేవుని పిల్లలు అవుతారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

sons of God

కుమారులు"" అని తర్జుమా చెయ్యడానికి మీ భాషలో సహజంగా మానవ కుమారుడు లేక బిడ్డను సూచించడానికి వాడే పదం వాడడం మంచిది.

Matthew 5:10

those who have been persecuted

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఇతరులు ఎవరికి అన్యాయం చేస్తారో వారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

for righteousness' sake

దేవుడు కోరినట్టు చెయ్యడానికి ఇష్టపడతారు అన్న కారణంగా.

theirs is the kingdom of heaven

ఇక్కడ దేవుని రాజ్యం అంటే రాజుగా దేవుని పరిపాలన. ఈ పదబంధం మత్తయి సువార్తలో మాత్రమే కనిపిస్తుంది. సాధ్యమైతే, మీ అనువాదంలో పరలోకం అనే పదం ఉంచండి. దీన్ని ఎలా అనువదించారో చూడండిమత్తయి 5:3. ప్రత్యామ్నాయ అనువాదం: పరలోకంలోని దేవుడు వారి రాజుగా ఉంటాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 5:11

Connecting Statement:

ధన్యులు అనిపించుకునే వారి లక్షణాలను వర్ణించడం యేసు ముగించాడు.

Blessed are you

ఇక్కడ మీరు అనేది బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

say all kinds of evil things against you falsely

మీ గురించి అన్నిరకాల దుర్మార్గపు మాటలు పలికే వారు. లేక ""అబద్ధంగా చెడు మాటలు పలికే వారు

for my sake

మీరు నన్ను అనుసరిస్తున్నారు గనక లేదా నాలో నమ్మకం ఉంచారు గనక.

Matthew 5:12

Rejoice and be very glad

ఉప్పొంగి పొండి ఆనందించండి ఈ రెండు మాటలకూ ఒకటే అర్థం. యేసు తన శ్రోతలకు ఆనందపడమని, కేవలం అంతే కాక సాధ్యమైతే అంతకన్నా ఎక్కువగానే సంతోషించమని చెబుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-doublet)

Matthew 5:13

Connecting Statement:

యేసు తన శిష్యులు ఏవిధంగా ఉప్పు, వెలుగు వంటి వారో చెబుతున్నాడు.

You are the salt of the earth

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు. 1) ఉప్పు ఏ విధంగా ఆహారాన్ని రుచిగా చేస్తుందో అలానే యేసు శిష్యులు ఈ లోక ప్రజలు ఉత్తములుగా ఉండేలా చేస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ఈ లోక ప్రజల విషయంలో మీరు ఉప్పు. లేక 2) ఉప్పు ఆహారాన్ని చెడకుండా ఉంచినట్టే యేసు శిష్యులు మనుషులను పూర్తిగా చెడిపోకుండా చేస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ఉప్పు ఆహారానికి ఎలానో మీరు లోకానికి అలా. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

if the salt has lost its taste

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) ఉప్పు చేసే పనులు చేయలేకుండా అది తన శక్తిని కోల్పోతే లేక 2) ఉప్పు దాని రుచి పోగొట్టుకుంటే. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

how can it be made salty again?

మళ్ళీ దాన్ని ఉపయోగకరం చేయడం ఎలా? యేసు ప్రశ్నను తన శిష్యులకు ఉపదేశించడం కోసం ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: అది మళ్ళీ ఉపయోగకరం ఎలా అవుతుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

except to be thrown out and trampled under people's feet

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: మనుషులు దాన్ని బయట పారేసి దానిపై నడవడానికి తప్ప. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 5:14

You are the light of the world

దీని అర్థం యేసు అనుచరులు దేవుని దేవుని సత్యసందేశాన్ని దేవుణ్ణి ఎరుగని వారికి చెప్పాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు లోక ప్రజలకు ఒక వెలుగు లాగ "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

A city set on a hill cannot be hidden

రాత్రి వేళ చీకటిగా ఉన్నప్పుడు మనుషులు పట్టణం వెలుగులు ప్రకాశిస్తూ ఉండడం చూస్తారు. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: రాత్రి వేళ కొండపై ఉన్న పట్టణంలో కనిపించే వెలుగులను చూడకుండా ఎవరూ దాచలేరు.” లేక “ప్రతి ఒక్కరూ కొండపై ఉన్న పట్టణం వెలుతురు చూస్తారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 5:15

Neither do people light a lamp

మనుషులు దీపం వెలిగించి

put it under a basket

దీపం బుట్ట కింద పెట్టడం. అంటే వెలుగును మనుషులు చూడడానికి వీలు లేకుండా దాచి పెట్టడం బుద్ధి హీనత.

Matthew 5:16

Let your light shine before people

దీని అర్థం యేసు శిష్యుడు ఎలా జీవించాలంటే అతని నుండి అందరూ దేవుని సత్యం నేర్చుకోవాలి. ప్రత్యామ్నాయ అనువాదం: మీ జీవితాలు ఇతరుల ఎదుట ప్రకాశించే వెలుగు లాగా ఉండాలి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

your Father who is in heaven

తండ్రి""ని తర్జుమా చెయ్యడానికి మీ భాషలో సహజంగా మానవ తండ్రిని సూచిస్తూ ఏ పదం వాడతారో అది వాడండి.

Matthew 5:17

Connecting Statement:

యేసు తాను పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చినట్టు చెబుతున్నాడు.

the prophets

ఇది అంటే ప్రవక్తలు లేఖనాల్లో రాసినవి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 5:18

truly I say to you

నేను మీకు సత్యం చెబుతున్నాను. ఈ పదబంధం యేసు చెబుతున్నాడనడానికి బలం చేకూరుస్తున్నది.

until heaven and earth pass away

ఇక్కడ పరలోకం” “భూమి అంటే విశ్వమంతా. ప్రత్యామ్నాయ అనువాదం: ఈ విశ్వం ఉన్నంత కాలం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-merism)

not one jot or one tittle

చుక్క హీబ్రూ భాషలో అన్నిటికన్నా చిన్న అక్షరం. పొల్లు అనేది రెండు హీబ్రూ అక్షరాల మధ్య తేడాను తెలిపేది. ప్రత్యామ్నాయ అనువాదం: అతి చిన్న అక్షరం అయినా అక్షరంలో అతి చిన్న భాగమైనా (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

all things have been accomplished

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: జరిగినవన్నీ” లేక “దేవుడు జరిగించినవన్నీ (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

all things

పదబంధం సమస్తం అంటే ధర్మశాస్త్రంలోనిదంతా. ప్రత్యామ్నాయ అనువాదం: "" ధర్మశాస్త్రంలోనిదంతా” లేక “ధర్మశాస్త్రంలో రాసి ఉన్నదంతా"" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 5:19

whoever breaks

లోబడని వారు లేక ""పట్టించుకోని వారు

the least one of these commandments

ఈ ఆజ్ఞల్లో దేనినైనా అత్యల్ప ప్రాముఖ్యత గలవి అయినా

whoever ... teaches others to do so will be called

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఎవరైనా అలా చెయ్యమని ఇతరులకు నేర్పిస్తే దేవుడు ఆ వ్యక్తిని పిలుస్తాడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

least in the kingdom of heaven

పదబంధం దేవుని రాజ్యం అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. ఈ పదబంధం మత్తయిలో మాత్రమే కనిపిస్తుంది. సాధ్యమైతే మీ అనువాదంలో “పరలోకం” అనే మాట వాడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ఆయన పరలోక రాజ్యంలో అత్యల్పుడు” లేక “పరలోకం లోని మన దేవుని పాలనలో తక్కువ ప్రాముఖ్యత గల వాడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

keeps them and teaches them

ఈ ఆజ్ఞలన్నీ పాటించి అలానే చెయ్యమని ఇతరులకు నేర్పే వాడు.

great

అత్యంత ప్రాముఖ్యం

Matthew 5:20

For I say to you

ఇది యేసు తరువాత చెప్ప బోయేదానికి బలం చేకురుస్తున్నది.

you ... your ... you

ఇది బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

that unless your righteousness exceeds ... Pharisees, you will in no way enter

దీన్ని అనుకూల వాక్యంగా అనువదించ వచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: మీరు ప్రవేశించాలంటే మీ నీతి పరిసయ్యుల నీతిని మించిపోవాలి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-doublenegatives)

Matthew 5:21

General Information:

వ్యక్తులుగా వారు ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో కొందరు మనుషులతో యేసు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు బహు వచనం మీరు విన్నారు” “మీకు చెబుతున్నాను. నీవు అనేది ఏక వచనం- హత్య చేయకూడదు, మొదలైన చోట్ల. కాని కొన్ని భాషల్లో అది బహు వచనంగా ఉండాలి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Connecting Statement:

యేసు తాను పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చిన విషయం చెబుతున్నాడు. ఇక్కడ హత్య, కోపం గురించి మాట్లాడుతున్నాడు.

it was said to them in ancient times

దీన్ని క్రియాశీల రూపం తో వ్యక్త పరచ వచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు గతకాలం మనుషులకు చెప్పాడు.” లేక “మోషే మీ జాతివారికి చాలాకాలం క్రితం చెప్పాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Whoever kills will be in danger of the judgment

ఇక్కడ తీర్పు అంటే న్యాయాధికారి ఒక వ్యక్తికీ మరణ శిక్ష విధించడం. ప్రత్యామ్నాయ అనువాదం: వేరొక మనిషిని చంపినా వాడికి న్యాయాధికారి మరణశిక్ష విధిస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

kill ... kills

ఈ పదానికి హత్య అని అర్థం. అన్నీ రకాల మరణాలు కాదు.

will be in danger of the judgment

ఇక్కడ యేసు మానవ న్యాయాధికారి గురించి మాట్లాడడం లేదు. దేవుడు ఒక వ్యక్తి తన సోదరునిపై కోప్పడితే అతనికి శిక్ష విధిస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 5:22

But I say

యేసు దేవునితో ఆయన వాక్కుతో ఏకీభవిస్తున్నాడు, కానీ మత నాయకులు దేవుని వాక్కును అన్వయించిన విధానంతో విభేదిస్తున్నాడు. ఇక్కడ నేను అనే మాటకు ప్రాముఖ్యత ఉంది. ఇది యేసు చెప్పేదానికి దేవుని ఆజ్ఞలకు ఉన్న ప్రాముఖ్యత ఉన్నదని సూచిస్తున్నది. ఈ పదబంధాన్ని ఈ ఊనిక అర్థమయ్యేలా తర్జుమా చెయ్యడానికి ప్రయత్నించండి.

brother

అంటే సాటి విశ్వాసి, అక్షరాలా సోదరుడు లేక పొరుగు వాడు కాదు.

worthless person ... fool

ఇవి సరిగ్గా ఆలోచించలేని వారికి గద్దింపులు. పనికిమాలిన వ్యక్తి అంటే తెలివితక్కువ వాడు, బుద్ధిహీనుడు అని ఉన్న చోట దేవుని పట్ల అవిధేయత చూపేవాడు.

council

ఇది బహుశా స్థానిక సమాలోచన సభ. యెరూషలేము లోని సన్ హెడ్రిన్ కాదు.

Matthew 5:23

you

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. నీవు” “నీ అని ఉన్నవన్నీ ఏక వచనం, కానీ కొన్ని భాషల్లో ఈ మాటలు బహు వచనం కావచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

offering your gift

కానుక ఇవ్వడం లేక ""నీ కానుక తేవడం

at the altar

ఇది యెరూషలేము ఆలయంలో దేవుని బలిపీఠం అని అర్థం చేసుకోవాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ఆలయంలో బలిపీఠం వద్ద (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

there remember

బలిపీఠం దగ్గర నిలిచి ఉన్నప్పుడు గుర్తుకు తెచ్చుకో.

your brother has anything against you

నీవు చేసిన పనిని బట్టి వేరొక వ్యక్తి నీపై కోపంగా ఉన్నాడేమో.

Matthew 5:24

First be reconciled with your brother

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఆ వ్యక్తితో సఖ్యపడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 5:25

Agree with your

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. నీవు” “నీ అని ఉన్నవన్నీ ఏక వచనం, కానీ కొన్ని భాషల్లో ఈ మాటలు బహు వచనం కావచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

your accuser

ఇది ఒక వ్యక్తి వేరొకడు ఏదో తప్పు చేసాడని అతనిపై నింద మోపడం. అతడు తప్పు చేసిన వాణ్ణి న్యాయ స్థానానికి తీసుకుపోయి న్యాయమూర్తి ఎదుట అభియోగం మోపుతాడు.

may hand you over to the judge

ఇక్కడ నిన్ను అప్పగిస్తాడు అంటే వేరొకరి వశం చెయ్యడం. ప్రత్యామ్నాయ అనువాదం: న్యాయాధికారి నీపై చర్య తీసుకుంటాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

the judge may hand you over to the officer

ఇక్కడ నిన్ను అప్పగిస్తాడు అంటే వేరొకరి వశం చెయ్యడం. ప్రత్యామ్నాయ అనువాదం: న్యాయాధికారి నిన్ను భటులకు అప్పగిస్తాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

officer

అంటే న్యాయాధిపతి తీర్పును అమలు చేసే అధికారం గల వాడు.

you may be thrown into prison

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: భటుడు నిన్ను చెరసాలలో వెయ్యవచ్చు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 5:26

Truly I say to you

నేను సత్యం చెబుతున్నాను. ఈ పదబంధం యేసు చెప్పబోతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది.

from there

చెరసాల నుండి.

Matthew 5:27

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు విన్నారు” “మీకు చెబుతున్నాను అని ఉన్న చోట మీరు బహు వచనం. నీవు వ్యభిచారం చేయకూడదు, నీవు ఏక వచనం. కానీ కొన్ని భాషల్లో దీన్ని బహు వచనంగా తర్జుమా చెయ్యవలసి రావచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Connecting Statement:

యేసు తాను పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానని బోధించడం కొనసాగిస్తున్నాడు. ఇక్కడ అయన వ్యభిచారం, కామం గురించి మాట్లాడుతున్నాడు.

that it was said

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు చెప్పిన” లేక “మోషే చెప్పిన (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

commit

ఈ మాటకు అర్థం చేసి చూపించడం.

Matthew 5:28

But I say

యేసు దేవునితో ఆయన వాక్కుతో ఏకీభవిస్తున్నాడు, కానీ మత నాయకులు దేవుని వాక్కును అన్వయించిన విధానంతో విభేదిస్తున్నాడు. ఇక్కడ నేను అనే మాటకు ప్రాముఖ్యత ఉంది. ఇది యేసు చెప్పేదానికి దేవుని ఆజ్ఞలకు ఉన్న ప్రాముఖ్యత ఉన్నదని సూచిస్తున్నది. ఈ పదబంధాన్ని నొక్కి చూపే రీతిలో అనువదించడానికి ప్రయత్నించండి. దీన్ని ఎలా అనువదించారో చూడండిమత్తయి 5:22.

everyone who looks on a woman to lust after her has already committed adultery with her in his heart

ఈ రూపకాలంకారం ఒక స్త్రీని కామించిన వాడు ఆమెతో వ్యభిచారం చేసిన వాడితో సమానం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

to lust after her

ఆమెను కామించడం, లేక ""ఆమెను అనుభవించాలని కోరుకోవడం

in his heart

ఇక్కడ హృదయం అనే మాట ఒక మనిషి ఆలోచనలు అనే డానికి అన్యాపదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: అతని మనసులో” లేక “తన ఆలోచనల్లో (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 5:29

If your

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీవు విన్నావు” “నీకు చెబుతున్నాను అని ఉన్న చోట నీవు ఏక వచనం, కానీ కొన్ని భాషల్లో బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

If your right eye causes you to stumble

ఇక్కడ కన్ను అంటే ఒక వ్యక్తి చూసేది. తొట్రుపాటు అనేది పాపం అని అర్థం ఇచ్చే రూపకఅలంకారం. ప్రత్యామ్నాయ అనువాదం: నీవు చూసేది నిన్ను తొట్రుపడేలా చేస్తే” లేక “నువ్వు చూసిన దాన్ని బట్టి నీకు పాపం చెయ్యాలనిపిస్తే (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

right eye

దీని అర్థం ముఖ్యంగా కన్ను, కేవలం ఎడమ కన్ను అని కాదు. తర్జుమా చెయ్యడానికి కుడి అనే దాన్ని మంచి” లేక “బాగా పనిచేసే అనే మాటలు వాడవచ్చు(చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

pluck it out

ఇది ఒక మనిషిని పాపం చెయ్యకుండా ఉంచడానికి ఒక అతిశయోక్తి గా చెప్పిన ఆజ్ఞ. అంటే బలవంతంగా పెరికి పారవేయడం” లేక “నాశనం చెయ్యడం. ప్రత్యేకించి కుడి కన్ను అని చెప్పకపోతే ఇలా తర్జుమా చెయ్యవచ్చు. నీ కళ్ళు పొడిచేసుకో. కళ్ళు అనే మాట ఉంటే ఇలా తర్జుమా చెయ్యవచ్చు. వాటిని నాశనం చేసుకో. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-hyperbole)

throw it away from you

వదిలించుకో

one of your body parts should perish

నీ శరీరభాగం పోగొట్టుకో

than that your whole body should be thrown into hell

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు నీ శరీరం అంతటినీ నరకంలో వెయ్యడం కంటే (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 5:30

If your right hand causes

ఇది అన్యాపదేశం, చేతులు అంటే మొత్తం వ్యక్తి చేసే క్రియలు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

right hand

దీని అర్థం ముఖ్యంగా చెయ్యి. కేవలం ఎడమ చెయ్యి అని కాదు. తర్జుమా చెయ్యడానికి కుడి అనే దాన్ని మంచి” లేక “బాగా పనిచేసే అనే మాటలు వాడవచ్చు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

cut it off

ఇది ఒక మనిషిని పాపం చెయ్యకుండా ఉంచడానికి ఒక అతిశయోక్తి గా చెప్పిన ఆజ్ఞ. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-hyperbole)

Matthew 5:31

Connecting Statement:

యేసు తాను పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానని చెప్పడం కొనసాగిస్తున్నాడు. ఇక్కడ అయన విడాకుల గురించి మాట్లాడుతున్నాడు.

It was also said

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు కూడా చెప్పాడు” లేక “మోషే కూడా చెప్పాడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

sends his wife away

ఇది విడాకులకు సభ్యోక్తి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-euphemism)

let him give

అతడు ఇవ్వాలి.

Matthew 5:32

But I say

యేసు దేవునితో ఆయన వాక్కుతో ఏకీభవిస్తున్నాడు, కానీ మత నాయకులు దేవుని వాక్కును అన్వయించిన విధానంతో విభేదిస్తున్నాడు. ఇక్కడ నేను అనే మాటకు ప్రాముఖ్యత ఉంది. ఇది యేసు చెప్పేదానికి దేవుని ఆజ్ఞలకు ఉన్న ప్రాముఖ్యత ఉన్నదని సూచిస్తున్నది. ఈ పదబంధాన్ని నొక్కి చూపే రీతిలో అనువదించడానికి ప్రయత్నించండి. దీన్ని ఎలా అనువదించారో చూడండి మత్తయి 5:22.

makes her an adulteress

సరైన రీతిలో పురుషుడు విడాకులు ఇవ్వకపోతే ఆ స్త్రీ వ్యభిచారం చేసేలా అతడే కారకుడౌతాడు. అనేక సంస్కృతుల్లో స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకోవడం సహజమే. కానీ విడాకులు సరైన రీతిలో లేకపోతే ఆ పునర్వివాహం వ్యభిచారం.

her after she has been divorced

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఆమె భర్త ఆమెకు విడాకులు ఇచ్చిన తరువాత” లేక “విడాకులు పొందిన స్త్రీ (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 5:33

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. మీరు విన్నారు” “మీకు చెబుతున్నాను అని రాసిన చోట మీరు బహు వచనం. ఒట్టు పెట్టుకోవద్దు” “ఒట్టు పెట్టుకున్నది తప్పక చెయ్యాలి అని రాసిన చోట నువ్వు” “నీ అనేవి ఏక వచనం. కానీ కొన్ని భాషల్లో బహు వచనం అవసరం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Connecting Statement:

యేసు తాను పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానని చెప్పడం కొనసాగిస్తున్నాడు. ఇక్కడ ఒట్టు పెట్టుకోవడం గురించి మాట్లాడుతున్నాడు.

Again, you

నీవు లేక ""ఇది మరొక ఉదాహరణ. నీవు

it was said to those in ancient times

దీన్ని క్రియాశీల రూపం తో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు పూర్వికులకు చెప్పాడు.” లేక “మోషే మీ పితరులకు గతకాలంలో చెప్పాడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Do not swear a false oath, but carry out your oaths to the Lord.

ఏమీ చెయ్యనని ఒట్టు పెట్టుకుని దాన్ని చెయ్యకండి. ఫలానాది చేస్తానని ప్రభువు ఎదుట ప్రమాణం చేస్తే అది తప్పక చెయ్యండి.

Matthew 5:34

But I say

యేసు దేవునితో ఆయన వాక్కుతో ఏకీభవిస్తున్నాడు, కానీ మత నాయకులు దేవుని వాక్కును అన్వయించిన విధానంతో విభేదిస్తున్నాడు. ఇక్కడ నేను అనే మాటకు ప్రాముఖ్యత ఉంది. ఇది యేసు చెప్పేదానికి దేవుని ఆజ్ఞలకు ఉన్న ప్రాముఖ్యత ఉన్నదని సూచిస్తున్నది. ఈ పదబంధాన్ని నొక్కి చూపే రీతిలో అనువదించడానికి ప్రయత్నించండి. దీన్ని ఎలా అనువదించారో చూడండి మత్తయి 5:22.

swear not at all

అసలు ఒట్టు పెట్టుకోవద్దు, లేదా ""దేనిమీదా ఒట్టు పెట్టుకోవద్దు

it is the throne of God

దేవుడు పరలోకం నుండి పరిపాలన చేస్తున్నాడు గనక ఇక్కడ యేసు పరలోకాన్ని ఒక సింహాసనంగా అభివర్ణిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ఇక్కడి నుండే దేవుడు పరిపాలిస్తున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 5:35

Connecting Statement:

యేసు ఒట్టు పెట్టుకోకూడదని వ. 34లో చెబుతున్న తన మాటలు ముగిస్తున్నాడు.

nor by the earth ... city of the great King

ఇక్కడ యేసు భావం ఏమిటంటే మనుషులు ఒక ప్రమాణం చేసినప్పుడు లేక ఒక సంగతి నిజమని చెప్పినప్పుడు దేనిమీదా ప్రమాణం చెయ్య కూడదు. ఒకడు దేవుని పేరు మీద ఏదైనా చేస్తానని ఒట్టు పెట్టుకుంటే అతడు అది తప్పక చెయ్యాలి అని కొందరు అంటున్నారు. అయితే పరలోకం మీదా భూమి మీదా ఒట్టుపెట్టుకుంటే అది చెయ్యకపోయినా అంత ప్రమాదం ఏమీ లేదు అంటున్నారు. పరలోకం లేక భూమి లేక యెరూషలేము మీద పెట్టుకునే ఒట్టు దేవుని పేరున పెట్టుకునే ఒట్టు లాంటిదే. ఎందుకంటే అవన్నీ దేవునివే, అని యేసు అంటున్నాడు.

it is the footstool for his feet

ఈ రూపకఅలంకారం అర్థం భూమి కూడా దేవునిదే. దేవుడు. ప్రత్యామ్నాయ అనువాదం: అది రాజు తన పాదాలు పెట్టుకునే పాదపీఠం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

for it is the city of the great King

ఎందుకంటే అది మహా రాజు దేవునికి చెందిన పట్టణం.

Matthew 5:36

General Information:

ఇంతకుముందు యేసు దేవుని సింహాసనం, పాదపీఠం, నివాసస్థలం అయిన భూమి మొదలైన వాటిపై ప్రమాణం చెయ్యకూడదని చెప్పాడు. అవి వారివి కాదు. వారు తమ సొంత శిరస్సుపై కూడా ప్రమాణం చెయ్యకూడదని చెబుతున్నాడు.

your ... you

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నవన్నీ ఏక వచనాలే. కానీ తర్జుమా చెయ్యడానికి బహు వచనం వాడాలేమో చూడండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

swear

అంటే ఒట్టు పెట్టుకోవడం. దీన్ని ఎలా అనువదించారో చూడండిమత్తయి 5:34.

Matthew 5:37

let your speech be 'Yes, yes,' or 'No, no.'

'అవును,' అని నీ ఉద్దేశం అయితే 'అవును,' అను. 'కాదు,' అయితే 'కాదు' అను.

Matthew 5:38

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. మీరు విన్నారు” “మీకు చెబుతున్నాను. లో “మీరు” అనేది బహువచనం. నిన్ను ఎవరైనా కొడితే అనే చోట నీవు అనేది ఏక వచనం. కానీ కొన్ని భాషల్లో బహు వచనం వాడతారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Connecting Statement:

యేసు తాను పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానని చెప్పడం కొనసాగిస్తున్నాడు. ఇక్కడ అయన శత్రువుపై ప్రతీకారం గురించి మాట్లాడుతున్నాడు.

that it was said

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. చూడండి దీన్ని ఎలా అనువదించారో చూడండిమత్తయి 5:27. ప్రత్యామ్నాయ అనువాదం: "" దేవుడు చెప్పాడు” లేక “మోషే చెప్పాడు"" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

eye for an eye, and a tooth for a tooth

మోషే ధర్మశాస్త్రం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి తనకు అతడు చేసిన హాని వంటిదే చెయ్యవచ్చు అని చెబుతున్నది. అంతకన్నా ఎక్కువ హాని చెయ్యకూడదు.

Matthew 5:39

But I say

యేసు దేవునితో ఆయన వాక్కుతో ఏకీభవిస్తున్నాడు, కానీ మత నాయకులు దేవుని వాక్కును అన్వయించిన విధానంతో విభేదిస్తున్నాడు. ఇక్కడ నేను అనే మాటకు ప్రాముఖ్యత ఉంది. ఇది యేసు చెప్పేదానికి దేవుని ఆజ్ఞలకు ఉన్న ప్రాముఖ్యత ఉన్నదని సూచిస్తున్నది. ఈ పదబంధాన్ని నొక్కి చూపే రీతిలో అనువదించడానికి ప్రయత్నించండి.

one who is evil

దుర్మార్గుడు లేక ""నీకు హాని చేసిన వాడు.

strikes ... your right cheek

యేసు జీవించిన సంస్కృతిలో చెంప పై కొట్టడం అవమానం. కన్ను, చెయ్యి కీ ఉన్న ప్రాధాన్యమే చెంపకు కూడా ఉంది. చెంపపై కొట్టడం చాలా అవమానం.

strikes

అరచెయ్యి వెనక భాగంతో కొట్టడం.

turn to him the other also

అతణ్ణి రెండవ చెంప మీద కూడా కొట్టనియ్యి.

Matthew 5:40

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. కొట్ట నియ్యి, వెళ్ళు, ఇవ్వు,” “తొలగిపోవద్దు మొదలైన ఆజ్ఞలు ఉన్న చోట్ల నీవు” “నీ ఏక వచనం. కొన్ని భాషల్లో వీటిని బహువచనాలుగా తర్జుమా చేయవలసి ఉంటుంది.(చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

coat ... cloak

అంగీ అంటే శరీరం పై ధరించే చొక్కా చలి కోటు వంటిది. పైవస్త్రం అంతకన్నా విలువైనది. దీన్ని వెచ్చదనం కోసం అంగీ మీద ధరిస్తారు. రాత్రి వేళ కప్పుకుంటారు.

let that person also have

ఆ వ్యక్తికీ ఇవ్వండి.

Matthew 5:41

Whoever

ఎవరైనా. ఈ సందర్భం బహుశా అయన రోమా సైనికుడి గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

one mile

ఇది వెయ్యి అడుగులు. ఒక రోమా సైనికుడు చట్టబద్ధంగా తన బరువును మోయమని యూదుడిని అడగ గల దూరం. మైలు అనేది గందరగోళంగా అనిపిస్తే దాన్ని కిలోమీటర్ గా తర్జుమా చెయ్యవచ్చు.

with him

అంటే నిన్ను బలవంత పెట్టిన వాడు.

go with him two

నిన్ను బలవంతంగా నడిపించిన ఒక మైలు వెళ్ళు. ఆ పైన మరొక మైలు కూడా వెళ్ళు. మైలు గందరగోళం అనిపిస్తే ""రెండు కిలో మీటర్లు” అని తర్జుమా చెయ్యవచ్చు. లేదా “రెట్టింపు దూరం.

Matthew 5:42

do not turn away from

ఇవ్వడం నిరాకరించ వద్దు. దీన్ని అనుకూల భాషలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇవ్వండి.

Matthew 5:43

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. మీరు విన్నారు” “మీకు చెబుతున్నాను అన్న చోట""నీవు” “నీ"" ఏక వచనాలు మీరు బహు వచనం. నీవు నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలి. నీ శత్రువును ద్వేషించాలి, అనే చోట నీవు” “నీ ఏక వచనాలు. కానీ కొన్ని భాషల్లో బహు వచనం ఉపయోగించవలసి రావచ్చు. నీవు” “నీ అని ఉన్న తక్కినవన్నీ బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Connecting Statement:

యేసు తాను పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానని చెప్పడం కొనసాగిస్తున్నాడు. ఇక్కడ అయన శత్రువులను ప్రేమించడం గురించి మాట్లాడుతున్నాడు

that it was said

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. చూడండి దీన్ని ఎలా అనువదించారో చూడండిమత్తయి 5:27. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు చెప్పాడు” లేక “మోషే చెప్పాడు” (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

your neighbor

ఇక్కడ పొరుగు వాడు అంటే ప్రత్యేకంగా పక్కింటి వాడు అని కాదు. ఒక మనిషి సామజిక వర్గం వాడు అనే అర్థం తీసుకోవాలి. ఇలాటి వారిని ప్రేమతో చూడాలి. లేదా కనీసం విశ్వాసులు వీరిని ప్రేమతో చూడాలి. ప్రత్యామ్నాయ అనువాదం: నీ జాతి వాడు” లేక “నీ జాతికి చెందిన వాడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-genericnoun)

Matthew 5:44

But I say

యేసు దేవునితో ఆయన వాక్కుతో ఏకీభవిస్తున్నాడు, కానీ మత నాయకులు దేవుని వాక్కును అన్వయించిన విధానంతో విభేదిస్తున్నాడు. ఇక్కడ నేను అనే మాటకు ప్రాముఖ్యత ఉంది. ఇది యేసు చెప్పేదానికి దేవుని ఆజ్ఞలకు ఉన్న ప్రాముఖ్యత ఉన్నదని సూచిస్తున్నది. ఈ పదబంధాన్ని ఈ ఊనిక అర్థమయ్యేలా తర్జుమా చెయ్యడానికి ప్రయత్నించండి. దీన్ని ఎలా అనువదించారో చూడండి మత్తయి 5:22.

Matthew 5:45

you may be sons of your Father

కుమారులు"" అనే మాటను తర్జుమా చెయ్యడానికి మీ భాషలో సహజంగా కొడుకులు లేక పిల్లలు అనే అర్థం వచ్చే మాట వాడవచ్చు.

Father

ఇది దేవునికి వాడే ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 5:46

General Information:

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీవు” “నీ అనేవన్నీ బహు వచనం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Connecting Statement:

యేసు తాను పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాననే బోధ ముగిస్తున్నాడు.ఈ భాగం [మత్తయి 5:17] దగ్గర మొదలు అయింది(../05/17.md).

what reward do you get?

యేసు ఈ ప్రశ్న ఉపయోగించి తమను ప్రేమించే వారిని ప్రేమించే వారు దేవుని దృష్టిలో గొప్పవారు కాదని నేర్పిస్తున్నాడు. దేవుడు అలాటి వారికి ప్రతిఫలం ఇవ్వడు. ఈ అలంకారిక ప్రశ్నను ఒక ప్రతిపాదనగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నీవు ఎలాటి ప్రతిఫలం పొందవు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Do not even the tax collectors do the same thing?

ఈ అలంకారిక ప్రశ్నను ఒక ప్రతిపాదనగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" పన్ను వసూలుదారులు సైతం అదే చేస్తారు గదా."" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Matthew 5:47

what do you do more than others?

ఈ ప్రశ్నను ప్రతిపాదనగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నీవు ఇతరుల కన్నా ఎక్కువ చేసింది ఏముంది? (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

greet

ఇది వినే వాళ్ళ క్షేమం కోరుతున్నట్టు తెలిపే ప్రకటన.

Do not even the Gentiles do the same thing?

ఈ ప్రశ్నను ప్రతిపాదనగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: యూదేతరులు కూడా అది చేస్తారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Matthew 5:48

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)