Chapter 19

1 ఈ విషయాకు జరగ్తే తరవాత ఇంకా దిట్టం మంది తిరియో మత్తాటే ఒరో పెద్ద లేంగు పరలోకంతే నుంచి నాకు కేంజకత్తే."హల్లెలూయ! రచన,యశస్సు,బలం ప్రభావం మన దేవుటావే. 2 ఓని తీర్పుకు నిజమత్తావుగా నాయమత్తావుగా మిందాకు.దాని లైంగిక చెడ్డ నీతితే తోటే ఈ భూలోకతీను భ్రష్టత్వంత్కు తురిసిత్తే గొప్ప వేశ్యతీను ఓండు సిచ్చ వాట్తోండు.అద్దు వడియిస్తే ఓని సేవకుర్కీను నెత్తుర్ బదులు ఓండు గిరుడ్డి కోపం తీర్సితోండు. 3 రెండో సుట్టు ఓరంతా " హల్లెలూయ! ఆ నాటేను నుంచి కుంపోడు బెస్కేటికి పొరోట్కు తేదోరే మంతే"ఇత్తోరు. 4 అస్కె ఆ ఇరవై నాలువురు పెద్దాకు ఆ జీవ్కు బోర్ల అరిసి సింహాసనంతె పొర్రో కుద్ది మందాని దేవునికి "ఆమెన్,హల్లెలూయ!''ఇంజో కెచ్చోర్ ఓనీను మొడకతోర్. 5 అస్కె గిరుడ్డి "దేవుటె దాసుర్కు, ఓనికి వెరదనోరు , గొప్ప పేరు మందనోరు అత్కన్న పేరు ఇల్లవోరు అత్కన్న అందోరు ఓనిన్ స్తుతిసాటు'' ఇంజోరు ఒర్రొ లేంగు కేంజకత్తే. 6 ఆ పెరికె దిట్టం మంది తిరియోమత్తాటుగా,దిట్టం జలపాతకీను లేంగీను లెక్కాను,పెద్ద పిడుగుకీను లేంగీను లెక్కాను ఒరో లేంగు ఈల కేంజకత్తే."హల్లెలూయ!అంతవాంటే పొర్రో పెద్ద అత్తే మన పెభువత్తే దేవుండు పరిపాలిస్సో మిందోండు. గొర్రె పిల్ల పెళ్లి 7 గొర్రె పిల్ల పెళ్లి సందోడు సమయం వత్తే.పెళ్లి కోకాడు తయార్ ఆసి మిందే. అందకాడే మనాడు కుషేల్ పరదకా. ఓనికే మహిమ ఈదకాడు." 8 దానికి వెనేల్తావ్,సుబ్రమత్తే సోకత్తె గుడ్డాకు కెరదనాంకి ఇత్తోరు.సోకత్తే గుడ్డ ఇత్కు పరిసుద్దుర్కీను నీతి పనుంగు. 9 అస్కె ఆ దూత నాతోటే ఈల కెత్తోండు." గొర్రె పిల్ల పెళ్లి కబుర్ కేంజ్తోరు దీవిస్సబర్తోరు ఇంజో రాసా."ఓండే ఇంకా "ఇవ్వు నిజం .గా దేవుటే మాటాకు"ఇత్తోండు. 10 దానికి నన్న ఓనీన్ మొడకనాంకి ఓను మున్నె సాగిల పరదనాంకు మత్తాను. గోని ఓండు " ఆల తుంగవద్దు! యేసీంకు సాక్షుర్కు గా మందాని నీకు నీతో మందనోరికి నన్న తోటి జతగానీను మాత్రమే."ఇత్తోండు. మహిమాతే క్రీస్తీను రాకాడు. 11 తరవాత పరలోకం వీడిదాయటం ఊడ్తాను.అస్కె ఊడాటు!తెల్లాటి గుర్రం నాకు ఒరోటు తోపకత్తే.దాని పొర్రో కుద్ది మత్తోని పేరు 'నమ్మకమత్తోండు,నిజమత్తోండు.'ఓండు నాయంగా తీర్పు కెచ్చోరు యుద్ధం తున్గితోండు. 12 ఓని కండ్కు కిస్సు రవ్వాను లెక్కాన్ మత్తాకు.ఓని తలాతే పొర్రో దిట్టం టోపీ మిందాకు.ఓని పొర్రో ఒరో పేరు రాసి మిందే.అదు ఓనికి తప్ప వేరే బేనీంకు గూడ తెలియో. 13 ఓండు కెర్తె గుడ్డాకు నెత్తూటే ముచ్చి తీస్తావు.'దేవుటే మాట' ఇందాను పేరు ఓనికి మిందే. 14 ఓని పెరికె పరలోకాతే గుంపు తెల్లాటే నార గుడ్డాకు కెరిసి తెల్లాటే గుర్రాను పొర్రో తర్రి అంజొనోరు. 15 చేల రకా జాతి మనుసుర్కీను తన్ననాంకు ఓని పౌటే నుంచి వాయ్ మందాని కసేర్ బయద్కు వాసో మిందే.ఓండు ఇనుపు దుడ్డీతే తోటే ఓరీను పాలిస్సితోండు. అంతట్కుఅధికారి ఆసి మందాను దేవుటే కోపంతే ద్రాచగానుగ తొట్టి తీను ఓండే ఒగ్గితోండు. 16 ఓని గుడ్డాను పొర్రో,తోడాతే పొర్రో 'రాజుర్కీంకు రాజు,పెభువుకీంకు పెభువు,ఇందాను పేరు రాసి మిందే. హర్మేగిద్దోను యుద్ధం 17 అస్కె ఒరో దూత పొడుదినాగా నిల్లి మందటం నన్న ఊడ్తాను. 18 ఓండు పెద్ద కూక వాటి పొర్రో ఉడ్డాను పిట్టేను కరంగతోండు."వర్రాటు,దేవుడు తయారు తున్గ్తే పెద్ద విందుతీను తిన్నాటు. రాజుర్కీను అవ్వి,సైనాధిపతుర్కీనుఅవ్వి,బలంగా మందనోరు అవ్వి,గుర్రకీను అవ్వి,వాంటె పొర్రో తర్రి తోలనోరు అవ్వి,విడిపిస్సబర్తోరూ,బానిసవారూ,పలుకుబడి మందనోరూ,గొప్పవారూ,అత్తే మనుషుర్కీను అందరీను అవ్వి,వాసి తిన్నాటు"ఇత్తోండు. 19 క్రూరమృగమూ,భూమితే పొర్రో మందాను రాజుర్కందోరు ఓరి సైనికుర్కీను తోటే గుంపు కూడి మందటం ఊడ్తాను.ఓరు ఆ గుర్రంతే పొర్రో కుద్ది మత్తోను తోటే ఓని సైనం తోటే యుద్ధం తుంగనాంకి సిద్దం ఆసోనోరు. 20 అస్కె ఆమ్రుగమూ,ఓని మున్నె అద్బుతా తుంగ్తే అబద్ద ప్రవక్త దొరికి అత్తోరు ఈ అద్బుతాను తోటే ఈoడు మృగం ముద్ర వాటిస్తే అందరీను ఆ బొమ్మెతీను పూజిస్తోరీను మోసం తుంగతోండు.ఈ ఇరువురీను మండోమందాను కిస్సు గుండాతే పాండాతే తోటే ఎస్సి ఇత్తోరు. 21 మిగల్తోరుగుర్రంతే పొర్రో కుద్ది మందనోను పౌటే నుంచి వాసో మత్తే కసేర్ దెబ్బ అరిసి డొల్లి అత్తోరు.ఓరి సియ్యాను పిట్టే తిత్తాకు.