అధ్యాయ్ 11

1 యుదే తరులు కూడా దేవుని వాక్యం అంగీకారించారని అపోస్తు లులు, యూదయాలోని సోదరులు విన్నారు. 2 పేతురు ఎరుషాలేంకు వచ్చినపుడు సున్నతి పొందినవారు, 3 నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావని అతనిని వివర్శించారు. 4 అందుకు పేతురు మొదటినుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరించి చెప్పాడు, 5 "నేను యొప్పె ఉరిలోపార్థన చేసుకుంటే, పరవశ్యంలో ఒక దర్శనంచుసాను. దాంట్లో నాలుగు చెంగులుపట్టి దింపిన పెద్ద దుప్పటివంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా దగ్గరికివచ్చింది. 6 దానిని నేను నిదానించిచూస్తే భూమిమీదుండే వివిధ రకాల నాలుగు కాళ్ళ జంతువులు అడవి జంతువులు పాకే పురుగులు ఆకాశపక్షులు నాకుకనబడ్డాయి. 7 'పేతురు,నీవు లేచి చంపుకొని తిను'అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను. 8 అందుకు నేను .'వద్దు ప్రభు నిషిద్ధమైనది ఏదీ నెన్నాడు తినలేదు అని జవాబిచాను. 9 రెండవసారి ఆ శబ్దం ఆకాశం నుండి, 'దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనయిగా ఎంచవద్దులని వినిపించింది. 10 ఈ విధంగా మూడుసార్లు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది. 11 వెంటనే కైసరయ నుండి నా దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి దగ్గర నిలబడ్డారు. 12 అప్పుడు ఆత్మ, 'నీవు ఏ బేధం చూపకుండా వారితో కూడా వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఈ ఆరుగురు సోదరులు నాతో వచ్చారు. మేము కొర్నేలి ఇంటికి వెళ్ళాం. 13 అతడు తన ఇంట్లో నిలబడి దూతను తనేలా చూసాడో చెప్తూ, 'నీవు యొప్పేకు మానుషులును పంపి పేతురు అనే పేరున్న సీమోను పిలిపిచు. 14 నివు, ని ఇంటివారంత రక్షణ పొందే మాటలు అతడు నీతో చెప్తాడు'అని అన్నాడని తెలియచేసాడు. 15 నేను మాట్లాడ్డం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ మొదట్లో మన మిడికిదిగినట్టుగా వారి మీదికి దిగాడు. 16 అప్పుడు ,' జాను నీళ్లతో బాప్తిస్మము ఇసిచ్చాడు కానీ మీరు పరిశుద్ధాత్మ లో బాప్తిస్మము పొందుతారని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకున్నాను. 17 సో ప్రభువైన యేసు క్రీస్తులో బిలివ్ ఉంచిన మనకు అనుగ్రహించుటకు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, Dఎవుణ్ణి అడ్డగించడానికి నేనెవరిని? అని చెప్పాడు. 18 వారి మాటలు విని ఇంకేమి అడ్డు హెప్పకుండా ఎలాగైతే యూదులు కానివారికి కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనస్సును దాయచేయునని చెప్పుకుంటూ దేవుణ్ణి మహిమాపర్చిరి. 19 స్టీఫెన్ విషయము లో కలిగిన హింస వలన చేదిరిపోయిన వారు యూదులుకు తప్ప మరి ఎవరికి వాక్యం బోదినుంచకుండా ఫేనికే, సైప్రస్, అంతియొకయా వరకు సంచరించారు. 20 వారిలో కొంతమంది సైప్రస్ వారు , కూరేని వారు అంతియొక వచ్చి గ్రీక్ వారితో మాట్లాడుతూ యేసయ్య ను ప్రకటించిరి. 21 ప్రభువు హస్తం వారికి తోడు గా ఉంది. అనేకమంది నమ్మి ప్రభువు తట్టు తిరిగారు. 22 వారిని గూర్చిన సమాచారం యెరూషలేము లో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపారు. 23 అతడు వచ్చి దేవుని వరాన్ని చూసి సంతోషించి, ప్రభులో పూర్ణ హుదాయంతో నిలిచి ఉండాలని అందరిని ప్రోత్సహపరిచాడు. 24 అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసం తో నిండిన మంచి వ్యక్తి. చాలా మంది ప్రభువు ను నమ్మరు. 25 బర్నబా సౌలు ను వేదకదానికి తర్సు ఊరికి వెళ్లి, అతని వేదికి పట్టుకొని అంతియొకయకు తోడుకొని వచ్చాడు. 26 వారు సంవత్సరం కలిసి బోధించారు. అప్పడు శిస్యులు మొదటిసారిగా క్రైస్తవులు అన్నారు. 27 దినలో కొంతమంది ప్రవక్తలు యెరూషలెం నుండి అంతియూకాయ వచ్చాడు. 28 వారిలో ఆగబు అనే ఒకడు నిలబడి, లోకమంతటా తీవ్రమైన కరువు రాబోతున్నదాని ఆత్మ ద్వారా సూచించాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది. 29 అప్పుడు శిస్యులో ప్రతివాడు తన శక్తికొద్ది యుధాయలోని సోదరులకు సహాయం పంపడానికి నిర్చయించుకున్నాడు. 30 వారు అలా చేసి, బర్నబా, సౌలు అనే వారితో పెద్దలకు డబ్బు పంపించారు.