Chapter 9

1 ప్రభువు శిస్యులను చంపుతానని సౌలు మహా కోపముతో ప్రధాన యజకుని దగ్గరకు వెళ్లి యేసు మార్గాన్ని అనుసరించి నడుచుకునే పురుషులు గాని, ఆడవారు గాని 2 తనకు చిక్కితే,వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చేలా దమస్కు పట్టణం సమాజ మందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇమ్మని అడిగెను. 3 అతడు ప్రయాణం చేస్తూ దమస్కు పట్టణానికి సమీపించినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను,అప్పుడు 4 అతడు చచ్చినవానివలె నేల మీద పడినప్పుడు అతనికి "సౌలా సౌలా నీవేల నన్ను హింసించుచున్నావు"? అను ఒక స్వరము వినబడెను. 5 అంతట సౌలు తేరుకుని 'ప్రభూ నీవేవరివి? అని అడుగగా, ప్రభువు నీవు హింసిస్తున్న ఏసుని అని చెప్పి,నీవు లేచి పట్టణంలోనికి వెళ్లుము,అక్కడ నీవు 6 చేయవలసినది నీకు తెలియపరచబడును అనెను.అతనితో కూడా ప్రయాణించే వారు 7 ఆ స్వరము విన్నారు గాని ఎవర్ని చూడలేకను,మాట్లాడలేకను పడిపోయెను. 8 సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినప్పుడు అతనికి ఏమియు 9 కనబడకుండెను కాబట్టి అతని సహచరులు అతనిని దమస్కు లోనికి నడిపించిరి.అతడు మూడు దినములు చూపులేకుండా ఉండి, ఏమియు తినలేదు,ఏమియు తాగలేదు. 10 దమస్కులో అననీయా అను ఒక శిస్యుడుండెను.ప్రభువు దర్శనంలో "అననీయా" అని అతనిని పిలువగా, అతడు చిత్తం ప్రభువా అనెను.అప్పుడు 11 ప్రభువు నీవు లేచి "ఋజుమారం" అనే వీధికి వెళ్లుము, అక్కడ యూదా అనే వ్యక్తి ఇంటిలో, సౌలు అనే తార్సువాని కొరకు అడగుము.ఆ 12 సమయములో అతడు ప్రార్దనలో ఉండెను,దర్శనంలో అననీయా అనే ఒక వ్యక్తి ఇంటిలోనికి వచ్చి చూపుపొందులాగున,అతని తలమీద చేతులుంచుట చూచినని చెప్పెను. 13 అయితే అననీయ, ప్రభువా సౌలు అనే ఈ వ్యక్తి యెరూషలేములో అనేకమంది ప్రజలకు చాలా హాని చేసాడని నేను వింటిని. ఇక్కడ కూడా నీ 14 నామం పేరట ప్రార్ధన చేయు వారినందరిని బంధించి తీసుకు వెళ్ళడానికి అతడు ప్రధాన యాజకుల యొద్ద నుండి 15 అధికారం పొందియున్నాడని నేను దృఢముగా గ్రహించితిని అని చెప్పెను.అందుకు ప్రభువు నీవు వేళ్ళు,యూదేతరుల 16 ముందును,రాజుల ముందును, ఇశ్రాయేలీయుల ముందును,నా నామం పేరట ఇతను ఎన్ని బాధలు భరించవలెనో నేను అతనికి తెలియజేసేదను,ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం అని చెప్పెను. 17 అననీయ ఇంటి లోనికి వెళ్లిన పిమ్మట, సౌలు, సహోదరుడ నీవు వచ్చిన మార్గములో నిన్ను దర్శించిన ప్రభువైన యేసుక్రీస్తు, నీవు చూపు పొంది, 18 పరిశుధాత్మతో నిండు లాగున నన్ను నీయొద్దకు పంపియున్నాడు అని చెప్పెను. వెంటనే అతని కళ్ళ నుండి పోరల వంటివి రాలగ అతడు చూపు పొందెను,పిమ్మట అతడు లేచి బాప్తిస్మము 19 పొందెను.అటు తరువాత అతడు భోజనం చేసి బలము పొందుకొనెను. సౌలు సువార్త ప్రకటన: అతడు చాలా రోజులు దమస్కు లో ఉన్న శిస్యులతో గడిపిన పిమ్మట 20 సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ప్రకటించడం మొదలు పెట్టినప్పుడు, 21 అది విన్నవారంతా ఆశ్చర్యపోయి,యేసు నామం పేరట ప్రార్ధన చేయు వారినందరిని చంపిన వాడు ఇతడే కదా? 22 అని,ఇక్కడ ఉన్నవారిని కూడా బందీలుగా చేయుటకు వచ్చి యున్నాడని చెప్పుకొనిరి.అయితే సౌలు "యేసే దేవుని కుమారుడని" దృడముగా రుజువు పరుస్తూ దమస్కు లో ఉన్న ప్రజలందరినీ కలవరపరిచేను. 23 చాలారోజులు గడచిన పిమ్మట సౌలును చంపుటకు యూదులు ఆలోచన 24 చేయుచుండగా ఈ సంగతి సౌలునకు తెలిసెను. వారు అతనిని చంపాలని తీవ్రముగా 25 ద్వారము నొద్ద కాపలా కాయుచుండగా,శిస్యులు సౌలును గంప ద్వారా కిటికీ లో నుండి కిందకి దింపిరి 26 అతడు యెరూషలేమునకు వచ్చి శిస్యులతో చేరడానికి ప్రయత్నము చేసినప్పుడు వారు అతనిని శిస్యుదని నమ్మక అతనికి భయపడిరి.అయితే బర్నబా 27 అతనిని చేరదీసి అపొస్తలుల వద్దకు అతనిని తీసుకువచ్చి ,అతడు దారిలో వున్నప్పుడు దేవుడు అతనిని దర్శించ్చాడని, దేవుణ్ణి అతడు చూసేనని చెప్పి,దమస్కులో ధైర్యముగా సౌలు బోధించిన విధానమును కూడా వారికి వివరించి చెప్పెను. 28 అయితే అతడు యెరూషలేము వారితో వస్తు పోతూ ప్రభునామంలో దైర్యంగా బోధించి 29 గ్రీకు యూదులతో తర్కించెను . అయితే వారు అతన్ని చంపాలని ప్రయత్నము చేయుఛుండెను.అయితే శిస్యులు ఈ 30 సంగతి గ్రహించి అతనిని కైసరయకు,తీసుకువచ్చి తార్సు కు పంపి వేసెను. 31 కాబట్టి యూదయ, గలిలియ,సమరాయ ప్రాంతాలంతట సంఘం ప్రశాంతంగా వుంటూ అభివృద్ధి చెందుతూ ఉండేను.ప్రభువు పట్ల భయం పొంది,పరిశుధాత్మ 32 వలన ఆదరణ కలిగి ఉండి విస్తరించుచుఁ ఉండెను. ఆతరువాత పేతురు బుద్ధ అనే ఊరి ప్రజల యొద్దకు వచ్చెను. 33 అక్కడ పక్షవాతంతో ఎనిమిది ఏళ్ల నుండి మంచం పట్టిన ఐనెయ అనే ఒక వ్యక్తిని చూసి, ఐనెయ యేసుక్రీస్తు నిన్ను బాగుచేయుచున్నాడు,"నీవు లేచి 34 నీపరుపు ఎత్తకో మని చెప్పగా అతడు వెంటనే లేచెను.లుద్దలో, శారనులో ఉన్న 35 వారంతా ఇది చూసి ఆశర్యపోయి వారంతా ప్రభువునుందు విశ్వాసముంచిరి. 36 ఎప్పేలో తాబితా అనుఒక శిస్యురాలు ఉండెను ఈమె చాలా రోజుల నుంచి ఆచి పనులు చేస్తూ బీదలకు సహాయం చేస్తూ ఉండెను ఆరోజుల్లో ఆమె ఒక వ్యాధి వలన 37 చనిపోబడి నప్పుడు ఆ శవాన్ని స్నానం చేయించి మేడ పై గదిలో ఉంచ బడెను 38 లుద్ద అనే ఊరు యేప్పెకు దగ్గరగా ఉండటం వలన పేతురు అక్కడ వున్నాడని శిస్యులు విని,ఆలస్యం చేయకుండా తమ దగ్గరికి రమ్మని అతనిని 39 బతిమాలుకొనడానికి ఇద్దర్ని వారి దగ్గరికి పంపారు.పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు,వారు మేడ గది లోనికి అతనిని తీసువచ్చారు.వితంతువులందరు అక్కడ ఏడుస్తూ,దొర్కా తమతో ఉన్నపుడు కుట్టిన అంగీలు,వస్ర్తములు చూపిస్తూ అతని పక్కనే నిలబడ్డారు. 40 పేతురు అందరిని బయటికి పంపివేసి,మోకరించి ప్రార్దించిన తరువాత ఆ శవం వైపు తిరిగి తబితా లెమ్ము అని చెప్పగా ఆమె కళ్ళు తెరిచి పేతురును 41 చూడగానే లేచి కూర్చుండెను.అతడు ఆమె చెయ్యి పట్టుకుని పైకి 42 లేవదీసేను. అక్కడున్న విశ్వాసులనందరిని పిలిచి వారికి ఆమెను సజీవు రాలిగా అప్పగించెను. ఈ విషయం 43 యేప్పె ప్రాంతమంతా తెలిసిన తరువాత ప్రభువునందు విశ్వాసముంచిరి.పేతురు సీమోను అనే చర్మ కారుని ఇంట చాలా రోజులు బస చేసెను.