Chapter 26

1 అగ్రిప్ప పౌలుతో " నీవు నీ వాదన వినిపించడానికి నీకు అనుమతి 2 నిస్తున్నాను"అనెను.అంతట పౌలు తన చెయ్యి చూపి ఈలాగున చెప్పెను. అగ్రిప్ప రాజా,మీరు యూదుల ఆచారాలను, వివాదాలను బాగా ఎరిగిన 3 వారు.యూదులు నామీద ఆరోపించిన నేరాలను గూర్చి నేను ఈరోజు సమాధానం ఇవ్వడం నా అదృష్టం గా భావిస్తున్నాను.దయచేసి సహనంతో నా మనవి ఆలకించండి. 4 యెరూషలేములో నేను గడిపిన బాల్య జీవితం ఎటువంటిదో యూదులందరికి తెలుసు. వారు మొదటినుండి నన్ను ఎరిగిన వారు కాబట్టి వారు ఆ గురించి చెప్పాలంటే, 5 నేను మన మతం లోని బహు నిష్ట గల తెగను అనుసరించి, పరిసయ్యునిగా జీవితం గడిపినట్టు చెప్పగలరు. 6 అయితే ఇప్పుడు దేవుడు మన పూర్వికులకు చేసిన వాగ్దాన సంబంధమైన నిరీక్షన విషయమై విమర్శించుటకు నన్ను నియమించెను. మన పన్నెండు 7 గోత్రాల ప్రజలు రాత్రింబగళ్ళు దేవునిని సేవిస్తూ ఆ వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురుచూస్తున్నారు. రాజా,ఈ నిరీక్షణ గురించే 8 యూదులు నాపై నేరం మోపి వున్నారు.దేవుడు మృతులను లేపుతాడన్న సంగతిని మీరెందుకు నమ్మలేక పోవుచున్నారు. 9 నజారేయుడైన యేసు అనే నామానికి వ్యతిరేకంగా నేను అనేక కార్యాలు చేయాలని అనుకొంటింటి,యెరూషలేములో నేను అలాగే చేసితిని. ప్రదాన 10 యజకులనుండి నేను అధికారం పొంది అనేక పవిత్ర ప్రజలను చెరసాలలో బందించాను.వారిని చంపునప్పుడు నేను సమ్మతించితిని.అనేక 11 సార్లు నేను వారిని సమాజ మందిరంలో శిక్షించి, దేవ దూషణ చేయుటకు నేను వారిని బలవంత పెట్టితిని.అంతేకాక వారి మీద మహా కోపంతో నేను ఇతర పట్టణాలకు కూడవెళ్లి వారిని హింసించాను. 12 అందుకోసం నేను ప్రధాన యాజకుల యొద్ద నుండి అధికారాన్ని పొంది, దమస్కు పట్టణానికి వెళుతున్న సమయంలో,రాజా 13 మధ్యాహ్నం వేళ సూర్యునికంటే ఎక్కువ గా వున్న ప్రకాశవంతమైన వెలుగు ఒకటి నా చుట్టూ, నా చుట్టూ కమ్ముకొనెను.అప్పుడు 14 మేమందరం నేల మీద పడితిమి అంతట "సౌలా సౌలా నన్నెందుకు నీవు హింసించుచున్నావు? "మునికోలలకు ఎదురుతన్నడం నీకు" కష్టం అని ఒక స్వరం నాతో హెబ్రీ భాషలో పలకడం వింటిని. 15 అప్పుడు నేను "ప్రభువా నీవు ఎవరివి? అని అడిగినప్పుడు, ప్రభువు 'నీవు హింసిస్తున్న యేసుని,నీవు నన్ను చూసిన సంగతిని గూర్చి, 16 ఇకముందు జరగబోవు సంగతులను గూర్చి నిన్న నా సాక్షి గా, పరిచారకునిగా నియమించడానికి నీకు ప్రత్యక్షమయ్యాను. నేను ఈ ప్రజల వలన,యుదేతరుల 17 నుండి నీకు కలుగబోవు అపాయం నుండి కాపాడతాను.వారు చీకటినుండి వెలుగులోకి,సాతాను అధికారం నుండి దేవుని వైపుకు 18 తిరిగి,నాయందు విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ,పరిశుద్ధులలో వారసత్వాన్ని పొందడం కోసం వారి కన్నులు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను అని చెప్పాడు. 19 కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను లోబడి మొదట దమస్కులో, 20 యెరూషలేములో,యూదయదేశమంతట,ఆ తరువాత యుదేతరులకు, వారు మారు 21 మనస్సు పొంది దేవుని వైపు తిరిగి మారుమనస్సుకు తగిన క్రియలు చేయాలని ప్రకటిస్తున్నాను.ఈ కారణం చేతనే యూదులు నన్ను దేవాలయములో పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేశారు. 22 అయినప్పటికీ నేను దేవుని సహాయం వలన ఈ రోజు వరకు నిలిచి యున్నాను. క్రీస్తు శ్రమలు పొంది మృతుల పునరుద్దానం పొందే వారిలో మొదటివాడు 23 అగుట చేత యూదులకు యుదేతరులకు వెలుగు ప్రసరిస్తుందని ప్రవక్తలు,మోషే, ముందుగా చెప్పిన దానికి మరేమియు కలపకుండా ,అల్పులకూ, ఘనులకూ సాక్ష్యమిస్తున్నాను. 24 అతడు ఈ విధముగా సమాధానం చెబుతుండగా పేస్తూ,"పౌలూ నీవు పిచ్చివాడవు,మితిమీరిన విద్య వలన నీకు పిచ్చి పట్టింది"అని గట్టిగా 25 అరచెను.అందుకు పౌలు ఈ విదంగా చెప్పెను మహా ఘనులైన పేస్తు, నేను పిచ్చి వాణ్ణి కాదు. నిజమైన జ్ఞానముగల మాటలే చెవుతున్నాను, 26 రాజుకు ఈ సంగతులు తెలుసు కాబట్టి వారి ముందు నేను దైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ప్రతి విషయము వారికి తెలుసు అని నిజముగా నమ్ముచున్నాను. ఎందుకంటే ఇది ఎదో ఒక మూలన జరిగిన విషయం కాదు. 27 అగ్రిప్ప రాజా,మీరు ప్రవక్తలను నమ్ముచున్నారని నాకు తెలుసు,అనెను అందుకు అగ్రిప్ప 28 ఇంత సులువుగా నన్ను క్రైస్తవునిగా మార్చాలని చూస్తున్నావే ఆని పౌలు తో అన్నాడు.అందుకు పౌలు 29 తేలికగానో కష్టంగానో మీరు మాత్రమే కాదు ఈ మాటలు వింటున్నవారంతా ఈ సంకెళ్లు తప్ప నాలాగే ఉండులాగున దేవుడు అనుగ్రహించునుగాక అనెను. 30 అప్పుడు రాజు,పేస్తూ,బేర్న్కే,వారితో కూడా కూర్చున్నవారు లేచి అవతలికి పోయి "ఈ వ్యక్తి మరణానికి గాని , 31 బంధకాలకు గాని తగిన నేరమేమియు చేయలేదు అని వారిలో వారు మాట్లాడుకున్నారు. అప్పుడు అగ్రిప్ప" ఈ 32 మనిషి కైసరు ముందు చెప్పుకుంటాను అనకపోయి ఉంటే అతని విడుదల చేసే వాళ్లమే"అని పేస్తు తో చెప్పెను.