అధ్యాయము 9

1 అంజవ దూత బాకా ఊదుసు. అప్పుడు ఆకాశము కోరుండు తర్రు మేనుకు బూదిక్కిరు ఒండు నక్షత్రమును పాతి. అగాదము యొక్క తాళపు చెవి అత్తుకు కుడుకుసు. 2 అదు అగాదమును తెరుసుసు బెరూ కొలిమికోరుండు ఎద్దిక్కిరు పొగతీరిక్కిరు పొగ ఆ ఆగాదముకోరుండు ఎద్దిక్కుసు: ఆ ఆగాదముకోరు పొగోటి సూర్యునిని వాయుమండలమును మొబ్బు కమ్ముసు. 3 ఆ పొగకోరుండు మిడతలు దండు తర్రు మేనుకు వందు బూచ్చు. తర్రి మేనిక్కిరు తేళ్ళుకు ఇక్కిరు శక్తి తీరిక్కిరు శక్తి అయిలుకు కుడుకురుదు జరుగుసు. 4 నుదిటి మేని దేవురుట ముద్ర ఇల్లారు మొనుసులకే తప్ప తర్రి మేని ఇక్కిరు గడ్డికి గానీ, మొక్కలకు గానీ, సెల్లుకు గానీ ఎంతారు హనీ సేయింగుదిండు అయులుకు ఆజ్ఞ కీదు. 5 ఆ మిడతలకు అంజు మాద్దు వరకూ వేధించిత్తుకు అధికారము కుడుకుసు. కానీ కొండ్రోడిత్తుకు అయిలుకు అధికారం ఇల్లా. అయిలు వలన కలుగురు వేదన తేలు కుట్టురప్పుడు కలుగురు వేదన తీరి ఇక్కదు. 6 ఆ దినాంగులుకోరు మోనుసులు సావును దేవాదు కానీ అదు అయులుకు దొరకుమాదు. సోత్తోగు భేకు ఇండుగాదు గానీ సావు అయిలచ్చుండు ఉరికేత్తదు. 7 ఆ మిడతలు పాకిత్తుకు యుద్ధానికి సిద్ధం సేందిక్కురు గుర్రాలుతిరి కీదు. అయిలుట తలకాయుల మేని బంగారు కిరీటాలు తీరి మెరుసక్కుదు. అస మొగుతు మొనుసులుట మొగుతు తీరి కీదు. 8 అయిలుకు మెగురు కీదు. అయి పొమ్మీల్లాయికి ఇక్కిరి తీరి మెగురు కీదు. అస పెళ్ళు సింహం కోరలు తీరి కీదు. 9 ఇనుము కవచం తీరి దొమ్ము మినీ కవచాలు కీదు. విస్తారమగు గుర్రాలూ, రథాలూ, యుద్దానికి ఉరికెత్తంధిగా వినుబూగురు ధ్వనితీరి అస రెక్కల శబ్దము వినుబూగక్కుదు. 10 ప్రతీదానికీ తేళ్ళుతీరి తోకా, కొండి కీదు. అస తోకలోటి అంజు మాద్దు వరకు మొనుసులకు హాని సేయిత్తుకు అయిలుకు అధికారము కీదు. 11 అయిలు మేని ఒండు రాజు కీదు. అదు పాతాలపు దూత. అది పేరు హిబ్రూ భాషకోరు అబద్దోను. గ్రీకు భాషకోరు అపొల్యోను {"విద్వంసకుడు" ఇండు ఈ పేరుకు అర్థము}. 12 మొదటి యాతన ముగిసికీదు. ఈ విషయాలు జరిగిక్కిరు తర్వాత మరో రెండో యాతనలు కలుగాదు. 13 ఆరవ దూత బాకా ఊదుసు. అప్పుడు దేవురు మినిగల్లి ఇక్కిరి బంగారు బలిపీటం కొమ్ముకోరుండు ఒండు స్వరము వినుబూచ్చు. 14 ఆ స్వరం " మహానది యూప్రటిసచ్చి బందించిక్కిరు నాలు దూతలను ఉట్టుడు" ఇండు బాకా పుడుసుగుండిక్కిరు ఆరో దూతోటి సొన్నుర్త కేటి. 15 మొనుసులు కోరు మూడో భాగమును కొండ్రోడిత్తుకు ఆ గంట కోసం, ఆ దినము కోసం, ఆ మాద్దు కోసం, ఆ సంవత్సరం కోసం సిద్దపరిసిక్కిరు ఆ నాలు దూతలను ఉట్టుడుసు. 16 సైన్యముకోరు అశ్విక దళం సంఖ్య ఇర్ది కోట్లు. అయిలుట సంఖ్య ఇదిఇండు నాను కేటి. 17 నట దర్శనము కోరు ఈ గుర్రాలను గురించి, అయిలు మేనిక్కిరు సైనిక దళం గురించి నాను ఎం చేంది ఇండిగా, గుర్రాలూ, సైనికులూ ధరించిక్కిరు కవచాలు నెరుపు తీరిక్కిరు ఎరుపు, చిక్కటి నీ లం, గంధకం తీరిక్కిరు పసుపు రంగుకోరు కీదు. గుర్రాలుట తలలు సింహాలకు ఇక్కిరు తలలు తీరి కీదు. అయి వాయి కోరుండు నెరుపు, పొగా, గంధకము కక్కక్కుదు. 18 అయిలుట వాయికోరుండు వారక్కురు నెరుపు, పొగా, గంధకము ఇంగురు మూడు దెబ్బలోటి మొనుసులుకోరు మూడో వంతు జనాంగులు సొత్తోసు. 19 ఆ గుర్రాల బలము అయిలుట వాయికోరు తోకలకోరు కీదు. ఎందాతుకు ఇండిగా ఆ తోకలు పాములు తీరి కీదు. అయి అస తలలోటి మొనుసులును గాయపరుసాదు. 20 ఈ కీడులోటి సొత్తోగారుగుండా మిగిలిక్కురు జనాంగులు పశ్చాతాప బుగిల్లా. అస కియ్యిలోటి సేందిక్కిరు, పాకిత్తుకు, కేకిత్తుకు, నడికిత్తుకు శక్తి ఇల్లారు బంగారుమోటి, వెండోటి, కంచోటి, కెల్లోటి, కోలోటి సేందిక్కిరు విగ్రహాలును, దెవ్వంగులును పూజించురుదు అయిలు మానిల్లా. 21 అన్నగే అయిలు సాగించక్కురు నరహత్యలు, మాయమత్రాలు, వ్యభిచారాలును, దొంగతనాలును ఉట్టూటు పశ్చాత్తాప బుగిల్లా.