అధ్యాయము 7

1 ఈ సంగతులు జరుగుదు అయిపోయినప్పుడు తర్రు నాలు దిక్కులుకోరు నాలాలు దేవదూతులు నిలుబూదిక్కుర్తు నాను పాతి. అయిలు తర్రి మేని నాలు దిక్కులుండు ఈసురు గాలిన ఈసారుగుండా బలంగా అడ్డుగుంచు. అదోటి తర్రి మేని గానీ, సముద్రము మేని గానీ, ఏ సెల్లి మేని గానీ గాలి ఈసురు తిల్లా. 2 ఇంకొండు దూత తూర్పు దిక్కుండు మేనుకు వారుదు నాను పాతి. అత్తుకు సజీవ దేవురుట ముద్ర కీదు. తర్రుకు సముద్రమునకు హాని సేయిత్తుకు అనుమతి ఇక్కిరు మిన్ని నాలాలు దూతులోటి అదు గట్టిగా. 3 "నంగ్లు నంగుట దేవురుట దాసుల నుదుటి మేని ముద్ర ఓడురు దాకా తర్రుకు, సముద్రమునకు, సెల్లికి ఎంతారు హాని సేయిమానా" ఇంగుసు. 4 ముద్ర పొందుగుండిక్కిరాయిలుట సంఖ్య సొన్నందిగా నాను కేటి. ఇశ్రాయేలు అయిలుట గోత్రములు అడ్డికోరు ముద్ర పొందుగుండిక్కిరాయిలుట సంఖ్య 1,44, ౦౦౦. 5 గోత్రములు వారిగా ముద్ర పొందుగుండిక్కిరాయిలుట సంఖ్య. యూదా గోత్రముకోరు 12,౦౦౦, రూబేను గోత్రముకోరు 12,౦౦౦, గాదు గోత్రముకోరు 12,౦౦౦, 6 ఆషేరు గోత్రముకోరు 12,౦౦౦, నప్తాలి గోత్రముకోరు 12, ౦౦౦, మనస్సే గోత్రముకోరు 12,౦౦౦, 7 షిమ్మోను గోత్రముకోరు 12,౦౦౦, లేవి గోత్రముకోరు 12, ౦౦౦, ఇస్సాఖారు గోత్రముకోరు 12, ౦౦౦, 8 జెబూలును గోత్రముకోరు 12, ౦౦౦, యోసేపు గోత్రముకోరు 12, ౦౦౦, బెన్యామీను గోత్రముకోరు 12, ౦౦౦. 9 ఆ తర్వాత సింహాసనం మినిగల్లి, గొర్రెకుట్టి మినిగల్లి ఒండు మహా జనాంగుల సమూహము నిలుబూదిక్కుర్త నాను పాతి. ఇయిలున లెక్కిచ్చురుదు ఏత్తుకు సాధ్యము ఆగుమాదు. అయిలుకోరు ప్రతీ జాతికోరుండు, ప్రతీ వంశముకోరుండు, ప్రతీ గోత్రముకోరుండు, తర్రిమేనిక్కిరు అడ్డి భాషలుకోరు వాచ్చరాయకోరుండు జనాంగులు కీదు. 10 ఇయిలు అడ్డేరు కలసి " రక్షణ సింహాసనం మేని కొందుగుండిక్కిరు నంగుట దేవురుకు, గొర్రెకుట్టికీ సెందిక్కిదు", ఇండు ఎలిగెత్తి సొన్నుసు. 11 దేవదూతలు అడ్డి సింహాసనం చుట్టూ, బెరుమొనుసులు చుట్టూ, ఆ నాలు ప్రాణులు చుట్టూ నిలుబూదు కీదు. అయిలు అడ్డేరు సింహాసనం మినిగల్లి సాష్టాంగబూదు అస ముఖాలును తర్రుకు ఆనించు 12 "ఆమేన్! నంగుట దేవురుకు కీర్తి, యశస్సూ, జ్ఞానమూ, కృతజ్ఞతలు, ఘనతా, అధికారమూ, మహా బలమూ కలకాలం కలుగబేకు గాకా" ఇండు సొన్ని దేవురున పూజించుసు. 13 అప్పుడు ఆ బెరుమొనుసులుకోరు ఒండాలు " వలేండు ఇక్కిరు బట్లు ఓటుగుండిక్కిరు ఇయిలు ఏదు?" ఇండు నన్ను కేకుసు. 14 అత్హుకు నాను "అయ్యా, నీకే గొర్తు" ఇండు సమాదానం కుర్తి. అప్పుడు అదు నన్నోటి ఇన్నగ సొన్నుసు, "ఇయిలు అడ్డేరు మహా భాదలుకోరుండు వందిక్కిరాయో. ఇయిలు గొర్రెకుట్టి రగుతుకోరు అస బట్లును ఉతుక్కుండు కీదు. బట్లును వలేండుగా సేందుగుండుసు. 15 అత్తుకు అయిలు దేవురుట సింహాసనం మినిగల్లి ఇందు పగమారి నామారి తేడా ఇల్లారుగుండా ఆయనట ఆలయముకోరు ఆయనకు సేవలు సేందుగుండుకీదు. సింహాసనం మేని కొందుగుండిక్కిరు ఆయన అయిలు మేని అస గుడారమును కప్పాదు. 16 అయిలికి ఇయ్యాలు నుంచి కలి తన్ని పెసేరు మాదు. ఒగు గానీ వడగాలి గానీ అయిలికి తగలుమాదు. 17 ఎందాతుకు ఇండిగా సింహాసనం మద్యకోరు కొందుగుండిక్కిరు గొర్రెకుట్టి అయిలికి కాపరిగా ఇక్యాదు. జీవము తార్రు తన్ని ఊటలచ్చుకు అయిలున నడిపించాదు. అయిలుట కండ్లుకోరుండు కార్రు ప్రతీ కన్నీటి చుక్కను ఆయనే తుడుసోడాదు.