అధ్యాయము 18
1
ఆ తర్వాత పరలోకముకోరుండు ఇంకొండు దూత దిగి వార్తా పాతి. అత్తుకు గొప్ప అధికారము కీదు. ఆయనకు ఇక్కిరు మహిమోటి తర్రు అడ్డి ప్రకాశించుసు.
2
అదు గొప్ప స్వరమోటి గట్టిగా ఇన్నగ ఇంగుసు. "బబులోను నాశనమాసు! బబులోను నాశనమాసు! అది దేవ్వంగులుకు నివాసమాసు. ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టు ఆసు. అపవిత్రము అసహ్యము అయిన ప్రతి కుంజుకు గూడు ఆసు.
3
ఎందాతుకు ఇండిగా దైవాగ్రహాన్ని ఎత్తేర్రు అస లైంగిక మద్యమును జనాంగ్లు అడ్డేరు కుడుసు మత్తోటి బుదోసు. తర్రు మేనిక్కిరు రాజులు ఆయమ్మోటి వ్యభిచారము సేందుసు. లోకముకోరిక్కిరు వ్యాపారులు ఆ యమ్మట అధిక సుఖభోగాల వలన సంపన్నలు ఆసు."
4
తర్వాత ఇంకొండు స్వరం పరలోకముకోరుండు వినుబూచ్చు. ఆ స్వరం ఇన్నగ సొన్నుసు, "నట జనాంగులారా, నింగ్లు ఆ యమ్మట పాపాలుకోరు బాగం పంచుగారుగుండా, ఆ యమ్మకు సంభవించురు కీడులుకోరు ఏది నింగ్లుకు సంభావించారుగుండా ఇక్కిబేకిండిగా ఆ యమ్మను ఉట్టూటు వందూడంగో.
5
ఆ యమ్మట పాపాలు ఆకాశమును అంటుగక్కుదు. దేవురు ఆ యమ్మట నేరాలును అడ్డి జ్ఞాపకము సేందుగుండుసు.
6
ఆ యమ్మ చెల్లించిక్కిరు ప్రకారం ఆ యమ్మకు చెల్లించంగో. ఆ యమ్మ సేందిక్కిరాతుకు ఆ యమ్మకు రెట్టింపు సేయంగో. ఆ యమ్మ కలిపిక్కిరు పాత్రకోరే ఆ యమ్మ కొరకు రెండంతులు కలపంగో.
7
ఆ యమ్మ తనకు తానే హెచ్చించుగుండుసు విలాస భోగాలుకోరు జీవించుసు. అత్తినే మొత్తంకోరు ఆ యమ్మకు హింసనూ, వేదనను కలుగజేయంగో. ఎందాతుకు ఇండిగా ఆ యమ్మ అస మనసుకోరు " నాను రాణిగా కొందుగురాలును, ముండు మోపిని అల్లా. సంతాపము పాకనే పాకుమాటి" ఇండుగుంచు.
8
కాబట్టి ఆ యమ్మకు కీడులు అడ్డి ఒండే దినముకోరే కలుగాదు. మరణము, దుంఖము, కరువు వారాదు. దేవురగు ప్రభువు మహా శక్తిమంతుడు. ఆ యమ్మకు తీర్పు సొన్నురుదు ఆయనే. ఆ యమ్మ సంపూర్ణంగా నెరుపుకు ఆహుతిఅయిపోసు.
9
ఆ యమ్మోటి అక్రమ లైంగిక సంబందాలు ఎచ్చుగుండు సుఖభోగాలు అనుభవించిక్కిరు తర్రి మేనిక్కిరు రాజులు అడ్డేరు భీతోటి తూరు నిలుబూచ్చు. ఆ యమ్మ దహనము అగందిగా వార్రు పొగను పాతు గుండెలు బాదుగాదు.
10
అయ్యో, అయ్యో, బబులోను మహానగరమా, శక్తిఇక్కిరు నగరమా, ఒండు గంటకోరే నిమ్మేనుకు శిక్ష వందు బూచ్చా" ఇండు అగాదు.
11
లోకముకోరిక్కిరు వ్యాపారస్తులు కూడా ఆ నగరమును పాతు అగుదుగుండు విలపించాదు. ' నంగుట సరుకులును ఏదు కొండుగాదు.' ఇండు అగాదు. అయిలుట సరుకులు ఎందాదు ఇండిగా బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నగా ఇక్కిరు నేతబట్లు, ఊదారంగు బట్లు, పట్టు బట్లు, ఎర్రగా ఇక్కిరు బట్లు, ఇంకా
12
పరిమళమును తార్రు ప్రతి రకమగు కలపా,దంతము, ఎత్తనో విలువగా ఇక్కిరు చెక్కా, ఇత్తడి, ఇనుము, చలువ కెల్లు మొదలగునవి ఎత్తనో రకాల వస్తువులు
13
దాల్చిన చెక్క, వాము, దూపం కోసం వాడురు వస్తువులు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, నూనె, మెత్తగా ఇక్కిరు పిండి, గోధములు, మాడులు, గొర్రెలు మొదలగునవి, ఇంకా గుర్రాలు, రథాలు, బానిసలు, మొనుసులుట ప్రాణాలు.
14
"నిట ప్రాణమునకు ఇష్టముగా ఇక్కిరు ఫలములు నిన్ను ఉట్టూటు ఎల్లిపోసు. నిట విలాసమూ, వైభోగము మాయమయిపోసు. అయి ఇక కండుబుగుమాదు" ఇండు సొన్నుగుండు అగాదు.
16
ఆ నగరముకోరు ఈ వస్తువులోటి వ్యాపారముసేందు సంపన్నులు అయిక్కిరు వ్యాపారులు ఆ యమ్మట వేదన వలన భీతోటి తూరు నిలుబూదు అగుదుగుండు గట్టిగా రోదించాదు.
15
"సన్నగా ఇక్కిరు నేతబట్లు, ఊదారంగు, ఎర్రగా ఇక్కిరు బట్లు కట్టుగుండు బంగారం, రత్నాలు, ముత్యాలోటి అలంకరించుగుండిక్కిరు మహా నగరమా అయ్యో, అయ్యో ఇంత ఐశ్వర్యము ఒండు గంటకోరే మాయమయిపోసే! ఇంగాదు.
17
ప్రతీ నౌకాధిపతి, సముద్ర యాత్రికుడు, ఓడ నావికుడు, ఇన్నగ సముద్రము మేని ఆధారుబూదు పెకురు అడ్డేరు తూరు నిలుబూదు
18
ఈ మహాపట్టణమోటి సమానమగురుదు ఏదు ఇండు సొన్నుగుండు కూతోడుసు.
19
అస తలల మేని దుమ్ము సల్లుగుండు అగుదుగుండు రోదన సేందుగుండు "అయ్యో, అయ్యో, ఆ మహానగరం. సొంత నౌకలు ఇక్కురు అడ్డేరు ఈ నగరముకోరిక్కిరు సంపద వలన ధనవంతులు ఆసు. అంతారుదు ఒండు గంటకోరే ఇన్నగ నాశనమాసే" ఇంగాదు. బబులోను పతనం గురించి భక్తుల హర్షం
20
"పరలోకమా, పరిశుద్దులారా, అపోస్తులులారా, ప్రవక్తలారా, ఆ యమ్మను గురించి సంతోషించండి. ఎందాతుకు ఇండిగా నింగ్లు తరుపున దేవురు ఆ యమ్మను శిక్షించాదు."
21
ఆ తర్వాత బలవంతుడగు ఒండు దూత బెరూ తిరిగలి కెల్లు తీరి ఇక్కిరు కేల్లును పెచ్చి సముద్రముకోకు ఓటు ఇన్నగ ఇంగుసు. ఇన్నగే మహా నగరమగు బబులోను కూడా హింసాత్మకంగా బుదోసు. ఇక అది ఎన్నటికి కండుబుగుమాదు.
22
కాబట్టి తంతి వాయిద్యాల శబ్దాలు, గాయకుల పాటలు, పిల్లనగ్రోవి, బూరలు ఊదురాసా శబ్దాలు ఇక ఎన్నటికి నిన్నచ్చి వినుబూగుమాదు. ఎంతారు శిల్పమైనా చెక్కే శిల్పి ఏదు నిన్నచ్చి ఇక కండుబుగుమాదు. తిరగలి శబ్దం ఇక ఎన్నటికి నిన్నచ్చి వినుబుగుమాదు.
23
దీపం ఎలుతురు నిన్నుకోరు ఇక ఎలుగుమాదు. పెళ్లి కొడుకుట స్వరం, పెళ్లి కూతురుట స్వరం ఇక ఎన్నటికి నిన్నుకోరు వినుబుగుమాదు. ఎందాతుకు ఇండిగా నిట వర్తకులు తర్రుకు ప్రభువుల్లా ఇక్కిరాయ. దేశములు అడ్డి నిట మాయకోకు బూదు మోసుపోసు.
24
"ప్రవక్తల రగుతు, హతసాక్షుల రగుతు, ఇంకా తర్రు మేని వధ అయిక్కిరాయులుట రగుతు ఆ యమ్ముకోరు కండుబుగక్కుదు.