అధ్యాయము 13
1
తర్వాత క్రూర మృగం ఒండు సముద్రముకోరుండు గడ్లికి వారుదు పాతి. అత్తుకు పొత్తు కొమ్ములు, ఏగు తలలు కీదు.అస కొమ్ములు మేని పొత్తు కిరీటాలు కీదు. అస తలలు మేని దేవురును అవమానపరచురు పేర్లు కీదు.
2
నాను పాతిక్కిరు ఆ మృగం చిరుత పులి తీరి కీదు. అస కాళ్ళు ఎలుగుబంటి కాల్లుతీరి అస వాయి సింహం వాయి తీరి కీదు. ఆ మహాసర్పం ఈ మృగమునకు అస శక్తినీ, అస సింహాసనమును, పాలించురు అధికారమును కుడుకుసు.
3
అస తలలకోరు ఒండాతుకు సొత్తోగురు తగిలిక్కిరి తీరి కండుబూచ్చు. అయితే ఆ గాయం మానోసు. తర్రి మేని మొనుసులు అడ్డేరు ఆశ్చర్యమోటి ఆ మృగం పెరుగోటి ఓసు.
4
ఆ మృగానికి అధికారము కుర్తికీదిండు అయిలు అడ్డేరు మహాసర్పానికి కూడా పూజలు సేయాదు. "ఈ మృగం తీరి ఇక్కిరాలు ఏదన్నా కీదా? ఇదోటి యుద్దము సేయిరాలు ఏదు?" ఇండు సొన్నుగుండు అయిలు అడ్డేరు మృగానికి కూడా పూజలు సేందుసు.
5
బడాయి వాతులు దైవ దూషనలు సేయిరు వాయి అత్తుకు కీదు. నాపత్తు రెండు మాద్దు అధికారం చలాయించిత్తుకుఅత్తుకు అనుమతి కీదు.
6
కాబట్టి దేవురును దూషించిత్తుకు, అయన పేరును, ఆయన నివసించక్కురు స్థలమును, పరలోకముకోరు నివసించురు అడ్డేరును దూషించిత్తుకు అదు వాయి తెరుజుసు.
7
ఇంకా పరిశుద్దులోటి యుద్ధం సేయిరాయిలున జయించిత్తుకు అత్తుకు అధికారం కుడుకురుదు జరుగుసు. ప్రతీ వంశం మేని, జనాంగ్లు మేని, ఆయా భాషలు వాచ్చిరాయిమేని, ప్రతీ జాతిమేని అధికారం అత్తుకు కుడురుదు జరుగుసు.
8
తర్రిమేని నివసించురు అడ్డేరు, సృష్టి ప్రారభముండు వధింప బూదిక్కిరు గొర్రెకుట్టికు సెందిక్కిరు జీవ గ్రంధముకోరు పేర్లు ఇల్లారాయ అడ్డేరు ఆ మృగాన్ని పూజించాదు.
9
చెవులు ఇక్కిరాలు కేకుబేకు గాకా!
10
బానిసత్వముకోకు ఎత్తుగుండు ఓగుబేకు ఇండుగురాలు బానిసగా ఓక్కుదు, సాకోటి కొండ్రోడురాలున సాకోటే కొండ్రోడుబేకు. పరిశుద్దులుగా ఇక్కిరాయ ఈ విసయముకో సహనమూ, విశ్వాసము ఇందు ఇక్కిబేకు.
11
అప్పుడు తర్రుకోరుండు ఇంకొండు క్రూరమైన మృగం మేనుకు వార్తు పాతి. అత్తుకు గొర్రెకుట్టికి ఇక్కిరి తీరి కొమ్ములు రెండు కీదు. ఆ మృగం మహాసర్పము తీరి వాచ్చక్కుదు.
12
అదు మిన్ని క్రూర మృగానికి ఇక్కురు అధికారమును అది మినిగల్లే ప్రదర్శించుగుండు కీదు. సొత్తోగురు దెబ్బ తగిలి పూర్తిగా నయమాయిక్కిరు మిన్ని మృగాన్ని తర్రు, అత్తుకోరు నివసించురు అడ్దేరున పూజించురు తీరి సేందుసు.
13
అదు అనేక చిత్ర విచిత్రాలు సేయక్కుదు. మొనుసులు అడ్డేరు పాకందగానే ఆకాశముకోరుండు తర్రుకు నెరుపు వార్రి తీరి సేందు అద్బుతాలు సేయక్కుదు.
14
అత్తుకు అనుమతి ఇక్కిరత్తన వరకు అదు సేయక్కురు అద్భుతాలోటి తర్రిమేనిక్కిరు అడ్దేరున మోసం సేందుగుండు కీదు. సాకు దెబ్బ తిండ్రు పెగిసే ఇక్కిరు మిన్ని క్రూరమృగానికి ఒండు విగ్రహాన్ని ఎక్కిబేకిండు అదు అడ్దేరుకు సొన్నక్కుడు.
15
మరియు ఆ మృగం విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట సేందు అది వాచ్చురు తీరి సేయిత్తుకు, ఆ మృగం విగ్రహాన్ని పూజించారాయిన కొండ్రోడిత్తుకు అత్తుకు అధికారం కుడుకురుదు జరుగుసు.
16
అదు ఇంకా అస కల్గీ మేని గానీ నుదిటి మేని గానీ ముద్ర ఓడించుగుబేకిండు ప్రముఖులను, అనామకులను, ధనవంతులను, భీదాయిలును, స్వతంత్రులను, బానిసలను అడ్డేరును బలవంతం సేందుసు.
17
ఆ ముద్ర, ఇండిగా ఆ మృగం పేరు గానీ అస సంఖ్య గానీ ఇల్లాదోసు ఇండుగో ఏత్తుకన్నా అమ్మురుదు గానీ కొంగురుదు గానీ ఇల్లా.
18
ఇత్తుకోరు జ్ఞానము కీదు. బుద్ది ఇక్కిరాలు ఆ మృగం సంఖ్యను లెక్కించబేకు. అది మొనుసుట సంఖ్య. అస సంఖ్య 666.