అధ్యాయం 6

1 ఒండు విశ్రాంతి దినమున ఆయన కొల్లంగులు కోరుండు ఓగక్కుదు. ఆయన శిష్యులు కంకులు తుంచి కియ్యిలోటి నలుపుగుండు తింగక్కుదు. 2 అప్పుడు పరిసయ్యులుకోరిక్కురు కొంతమంది "విశ్రాంతి దినముకోరుసేయిమాటారు పని నింగ్లెందుకు సేయక్కరంగా యిండు అయిలున కేకుసు. 3 యేసు అయిలోటి ఇన్నగ ఇంగుసు, "దావీదుకు, అదోటి ఇక్కిరాయికి కలిపెసేందప్పుడు దావీదు ఎంచేందుసో అది కూడా నింగ్లుకు తెలిమాదా? 4 అదు దేవురుట గుడికోకు ఓయి, యాజకులు తప్ప ఏదు తింగుమాటారు సన్నిధి రొట్టెలు వంక్కుండు తిండ్రు, అదోటి ఇక్కిరాయికి కుడుకుసు" ఇంగుసు. 5 ఇంకా ప్రభువు "అయితే మనుష్యకుమారుడు విశ్రాంతి దినముకు కూడా యజమాని" యిండు అయిలోటి సొన్నుసు. 6 ఇంకొండు విశ్రాంతి దినమున ఆయన సమాజమందిరముకోకు ఓయి ఉపదేశించక్కుదు. అతి కలింగీయి చచ్చుబూదు బాదు బుగురు ఒండాలు కీదు. 7 ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు విశ్రాంతి దినముకోరు ఒండుగేల ఆయన ఆ చచ్చుబూదిక్కురు కియ్యోటి బాధ బుగక్కురాలున నల్లక సేందిగా తప్పు పుడికంబు యిండు పాతుగుండు కీదు. 8 అయిలుట ఆలోచనలను ఆయన తెలుజుగుండు , చచ్చుబూదిక్కురు కియ్యి ఇక్కిరాలోటి "నీను ఎద్దిందు అడ్డేరు ఇక్కురు మధ్యకోరు నిలుబూగు" ఇంగుసు. అదు ఎద్దిందు నిలుబూచ్చు. 9 అప్పుడు యేసు "విశ్రాంతి దినమున మేలు సేయిరుదు న్యాయమా? లేక కీడు సేయిరుదు న్యాయమా? ప్రాణమును రక్షించురుదు న్యాయమా? లేక హత్య సేయిరుదు న్యాయమా?యిండు నింగ్లున కేకక్కిరి" యిండు అయిలోటి సొన్ని 10 చుట్టూ ఇక్కిరాయ అడ్డేరున ఒండు సారి పాతు "నిట కియ్యి చాపు" యిండు అదోటి సొన్నుసు. అదు అన్నగ చాపగానే అస కియ్యి నల్లక బూచ్చు. 11 అప్పుడు అయిలు వెర్రి రాసోటి నిండి గుండు యేసును ఎంచేయంబు యిండు అయిలుకోరు అయిలు చర్చించుగుంచు. 12 ఆ దినాంగులుకోరు ఆయన ప్రార్థన సేయిత్తుకు గుట్టుకు ఓయి దేవురుకు ప్రార్థన సేయిత్తుకో నామారడ్డి గడుపుసు. 13 తల్లాపిట్లి ఆయన అస శిష్యులను కూడుసు. అయిలుకోరు పొదునెండు మందిన ఏర్పాటు సేందు అయిలికి అపోస్తులులు యిండు పేరు ఎక్కుసు. 14 అయిలు ఏదిండిగా ఆయన పేతురు ఇంగురు మారుపేరిక్కురు సీమోను, అదుగు తెమ్మి అంద్రేయ,యాకోబు,యోహాను,ఫిలిప్పు,బర్తోలొమయి, 15 మత్తయి,తోమా,అల్పయి మగు యాకోబు,దేశభక్తుడు యిండు కూడిచ్చుగురు సీమోను, 16 యాకోబు తెమ్మి యూదా, ద్రోహి అగు ఇస్కరియోతు యూదా ఇంగిరాయ. 17 ఆయన అయిలోటి గుట్టు దిగి వందు మైదానముకోరు నిలుబూదప్పుడు ఆయన శిష్యుల సమూహము అటి కీదు. ఆయనట సందేశం కేకిత్తుకు, అస రోగాలును నల్లక సేందిగిత్తుకు యూదయ దేశం అడ్డి కోరుండు, యెరూషలేము నుండి తూరు సీదోను ఇంగురు పట్టణాలుకోరుండు, సముద్ర తీరమచ్చుండు బెరు జనసమూహం వంచు. అయిలు అడ్డేరు నల్లక బూచ్చు. 18 అన్నగే అపవిత్రాత్మలు పుడిసిక్కిరాయ కూడా నల్లక బూచ్చు. 19 రోగులను నల్లక సేయిరు ప్రభావం ఆయన కోరుండు బయలు ఓయి అడ్డేరున నల్లక సేందుసు. కాబట్టి జనాంగులు అడ్డేరు ఆయనను అట్టుకు బేకిండు ప్రయత్నము సేందుసు. 20 అప్పుడు ఆయన అదుగు శిష్యులు జాయ తిరుజు అయిలున పాతు ఇన్నగ ఇంగుసు, "బీదాయిలారా, నింగ్లు ధన్యులు, దేవురుట రాజ్యం నింగులుటాదే . 21 ఇప్పుడు ఆకిలోటి ఇక్కిరాయలారా, నింగులు ధన్యులు, నింగ్లుకు తృప్తి కలుగాదు. ఇప్పుడు అగక్కురు నింగ్లు ధన్యులు, నింగులు సిరికాకంగా. 22 మనుష్యకుమారుని కారణంగా మొనుసులు నింగులున ద్వేషించి, గెదూటు, నిందించి నింగులు చెడ్డాయ యిండు నింగుట పేరున మొతోటప్పుడు నింగులు ధన్యులు. 23 ఆదినమున నింగులు సంతోష మోటి గంతులు ఓడంగో. పారంగో, పరలోకముకోరు నింగులుకు గొప్ప ప్రతిఫలం కలుగాదు. అయిలు పూర్వీకులు ప్రవక్తలకు అన్నగే సేందుసు. 24 అయ్యో, ధనికులారా, నింగ్లుకు యాతన. నింగులు కోరుగుండిక్కురు ఆదరణ నింగులు ఇప్పటికే పొందుగుండు కీరంగా. 25 అయ్యో, ఇప్పుడు వరుగు నిండి ఇక్కురు నింగులుకు యాతన. నింగులుకు ఆకలి ఆక్కుదు.అయ్యో, ఇప్పుడు సిరికక్కురు నింగులుకు యాతన. నింగ్లు అగాకంగా. 26 మొనుసులు అడ్డేరు నింగులున పొగుడిగా నింగ్లుకు యాతన. అయిలు పూర్వీకులు అపద్ద ప్రవక్తలకు అన్నగే సేందుసు. 27 కేకక్కురు నింగ్లోటి నాను సొన్నురుదు ఎందాదిండిగా నింగుట శత్రువులను ప్రేమించంగో. నింగులున ద్వేషించురు అయిలికి మేలు సేయంగో. 28 నింగులున శపించురు అయిలున దీవించంగో. నింగులున భాద ఎక్కిరాయ కోసం ప్రార్థన సేయంగో. 29 నిన్ను ఒండు చెంప మినీ మొతురాలకు రెండో చెంప కూడా కాటిక్కీ. నిమ్మేని ఇక్కురు బట్టను ఎత్తుగుండు ఓగురాలు నిట అంగీని కూడా వంకుబేకు ఇండుగుండప్పుడు అడ్డుగు మానా. 30 కేకురు ప్రతిఆయిలుకు కుడు. నిట ధనమును వంకుండు ఇక్కిరాలున మల్లా కేకు మానా. 31 మొనుసులు నింగులుకు ఎందాదు సెయ్యిభేకిండు నింగ్లు కోరుగక్కురంగో అన్నిగే నింగ్లు అయిలికి సేయంగో. 32 నింగ్లున ప్రేమించు రాయులనే నింగ్లు ప్రేమించిగా నింగులున ఏదు మెచ్చుగాదు? పాపాత్ములు కూడా అయిలున ప్రేమించు రాయులనే ప్రేమించాదు. 33 నింగ్లుకు మేలు సేయిరాయికే నింగ్లు మేలు సేందిగా నింగ్లుకు మెప్పు ఎన్నగ వారాదు? పాపాత్ములు కూడా అన్నగే సేయాదు! 34 అప్పు తీరుసాదు ఇండుగుండిక్కిరాలుకే నింగ్లు అప్పు కుర్తిగా అత్తుకోరు నింగ్లుకు మెప్పు ఎన్నగ వారాదు? పాపాత్ములు కూడా మల్లా వసులు సేందుగచ్చు ఇండుగుండు పాపాత్ములకే కుర్తిగుండు ఇక్యాదు. 35 నింగ్లు నింగుట శత్రువులను ప్రేమించంగో. అయిలికి మేలు సేయంగో. తిరిగి తారాదిండు ఆశ ఎచ్చుగారుగుండా అప్పు కుడుకంగో. అప్పుడు నింగుట బహుమతి గొప్పగా ఇక్యాదు. నింగ్లు సర్వోన్నతుడైన దేవురుట సంతానమై ఇక్యాకంగా. ఆయన కృతజ్ఞత ఇల్లారాయి పట్లా, దుర్మార్గుల పట్లా దాయాపరుడుగా కీదు. 36 కాబట్టి నింగుట పరమ తండ్రి కనికరం కాటిక్యాదు కనుక నింగ్లు కూడా కనికరం ఇక్కిరాయిగా ఇరంగో. 37 ఇతరులకు తీర్పు తీర్చుమానా. అప్పుడు నింగ్లుకు తీర్పు తీర్చుమాదు. ఏదు మేని నేరారోపణ సేయిమానా. అప్పుడు ఏదు నిమ్మేని నేరం ఓడుమాదు. 38 క్షమించంగో. అప్పుడు నింగ్లున క్షమించాదు. కుడుకంగో. అప్పుడు నింగ్లుకు తారాదు. అప్పుడు మొనుసులు నింగ్లుకు అదిమి, కుదించి పొంగి పొర్లి ఓగురుతీరి కొలిచి నింగుట ఒడికోకు వాకాదు. నింగ్లు ఏ కొలతోటి కొలసాకంగో అదే కొలతోటి నింగ్లుకు కొలుసాదు." 39 తర్వాత ఆయన అయిలికి ఒండు ఉపమానం సొన్నుసు, "ఒండు గుడ్డాలు ఇంకొండు గుడ్డాలుకు ఎగి ఎన్నగ కాటిక్కాదు? అయిరెండాలు గుంతుకోకు బుగుమాదా? 40 శిష్యుడు అస గురువు కంటే అధికుడు అల్లా. అయితే సంపూర్ణంగా సిద్దబూదిక్కురాలు అస గురువు తీరి ఇక్యాదు. 41 నీను నిట కన్నుకోరిక్కురు దూలమును పుడిపిచ్చుగారుగుండా నిట సహోదరుని కన్నుకోరిక్కురు నలుసును పాకుదుఎందాతుకు? 42 నిట కన్నుకోరిక్కురు దూలమును పాతుకారుగుండా నీ సహోదరునోటి "సోదరా, నిట కన్నుకోరిక్కురు నలుసును వంగోటుకో" యిండు నీను ఎన్నగ సొన్నాక? మోసగాడా, మిన్ని నిట కన్నుకోరిక్కురు దూలమును వంగోటుకో. అప్పుడు నిట సోదరుడుట కన్నుకోరిక్కురు నలుసును వంగోడిత్తుకు నీకు స్పష్టంగా కండుబూక్కుదు. 43 నల్ల సెల్లికి పనికిమాలిన కాయలు కాయమాదు. అన్నగే పనికిమాలిన సెల్లికి నల్ల కాయలు కాయమాదు. 44 ఏ సెల్లైన అస కాయలు పుడుసు తెలుజొక్కుదు. ముండ్లు పొదలుకోరు అంజూరపు కాయలను పెర్కిమాదు. కొరింద పొదలుకోరు ద్రాక్షకాయలను అరకమాదు. 45 నల్ల మొనుసు అస హృదయము ఇంగురు ధననిధికోరుండు నల్లవిషయాలను గడ్లికి ఎత్తేరాదు. చెడ్డ మొనుసు అస చెడ్డ ధననిధికోరుండు చెడ్డ విషయాలను గడ్లికి ఎత్తేరాదు. హృదయము ఎందాదోటి నిండి ఇక్యాదో అత్తును పుడుసు వాయి వాచ్చాదు. 46 నట సందేశం ప్రకారం సేయారుగుండా సుమ్మాతికే "ప్రభూ ,ప్రభూ" యిండు నన్ను కూడురుదు ఎందాతుకు ? 47 నన్నచ్చుకు వందు, నట వాతలు కేటు నట వాత ప్రకారం సేయిరు ప్రతాలు ఏత్తుపోలి ఇక్యాదో కేరంగో. 48 అదు ఊటు కట్టబేకిండు లోతుగా తవ్వి కెళ్ళి మీని పునాది ఓటిక్కిరాలు తీరి ఇక్యాదు. వరదలు వందు తన్ని ప్రవాహం ఆ ఊటు మేని వేగంగా మొతుస అత్తును బలంగా కట్టికీదు కనుక అత్తును కదిలించింగ ఆగిల్లా. 49 అయితే నట వాతలు కేటు నట వాత ప్రకారం సెయిమాటారాలు పునాది ఓడారుగుండా తర్రి మేని ఊటు కట్టక్కిరాలు తీరి కీదు. ప్రవాహం అదిమేని వడిగా మొతుగానే అదు కూలిపోసు. ఆ ఊటుట నాశనం ఎత్తునో దయనియం."