అధ్యాయం 24

1 ఆదివారం తెల్లవారిక్కురు తరువాత ఆ స్త్రీలు అయ్య సిద్ధం సేందిక్కురు సుగంద ద్రవ్యాలున వాంకుండు సమాధి అచ్చుకు వంచు. 2 సమాదిట మూసిక్కురు కెళ్ళు దొబ్బూటిక్కుదు పాతు ఉల్లికి ఓసు. 3 కానీ ప్రభువైన యేసుట దేహం అయ్యులుకు కనుభూగిల్లా. 4 అదోటి అయ్యులుకు ఎందాదు తోచిల్లా. కానీ ధగధగలాడురు బట్టలు ధరించిక్కురు రెండాలు వ్యక్తులు అయ్యచ్చి నిలుభూదు కీదు. 5 అయ్యులున పాతు ఈ స్త్రీలు భీతుగుండు ముఖాలు నెలకు వంచు గుండూ ఇందుగ్యా అయ్యా "సజీవుడు అయిక్కురు వ్యక్తిన నింగులు సోత్తోఇక్కురాయకోరు ఎందాతుకు దేవక్కురంగా? 6 ఆయన ఇటి ఇల్లా, ఆయన ఎద్దిందు కీదు. ఆయన ఇత్తుకు మిన్ని గలలియకో ఇందుపట్లి 7 మొనుషు మగున పాపులుట కీళ్లుకు కుడుకాదిండు, అయ్య ఆయనన సిలువ ఓటు కొల్లాదిండు, తిరిగి ఆయన మూడవ రోజున సజీవంగా ఎద్ధిక్యాదు ఇండు నింగులోటి సొన్నిక్కుదు జ్ఞాపకం సేందుగోంగో" ఇండు అయ్య ఇంగుసు. 8 అప్పుడు అయ్య ఆయనట వాతులు జ్ఞాపకం సేందుగుండుసు. 9 అయ్య సమాదచ్చి నుండి తిరిగి పోయి ఈ సంగతుల్న పదకొండు మంది శిష్యులుకు మిగిలిక్కురాయడ్డికీ సొన్నుసు. 10 ఇనుగ ఈ సంగతులునా అపోస్తలులకు సొన్నిక్కురు స్త్రీలు యాదు ఇండుగ్యా మగ్దలేనే మరియ, యోహాన్న, యాకోబు తాయి మరియ, అయ్యోటి కూడా ఇక్కురు ఇతర స్త్రీలు. 11 కానీ అయ్యులుకు ఈ వాతులు పిచ్చి వాతులుగా ఇంబిక్కుసూ. కాబట్టి అయ్యాదు ఇస వాతులు నమ్మిల్లా. 12 కానీ పేతురు ఎద్ధిందు, సమాధి అచ్చుకు వాటారద్దు గుండూ ఓసు. అటి సమాదీ కోకు తొంగి పాకుసు. అటి నారబట్టలు మాత్రం కనుభూదు కీదు. అదు జరిగికుత్త గురించి ఆశ్చర్యభూదు గుండూ వూటుకు వెళ్ళిపోసు. 13 అ మానే రెండాలు శిష్యులు యేరుషలేముకు సుమారు పదుకొండు కిలోమీటర్ల దూరం కో ఇక్కురు ఎమ్మావస్ గ్రామం కు ఓగక్కుదు. 14 జరిగిక్కురు ఈ విషయాలు అడ్డీ గురించి వాచ్చుగక్కుదు. 15 అనుగ అయ్య వాచ్చుగుండూ, చర్చించుగుండూ ఇందుగ్యా యేసు అయ్యచ్చుకు వందు అయ్యోటి కూడా నడుస్తూకీదు. 16 కానీ అయ్య ఆయన్న గుర్తు పూడిక్యాదోసు. ఎందాతుకు ఇండుగ్యా అస కండ్లు మూత భూదు తీరీ అకీదు. 17 ఆయన "నింగులు నడుదుగుండూ పరస్పరం చర్చించుగక్కురు విషయాలు ఎంద్దాదు?" ఇండు ఆయ్యులున కేకుసు. అదోటి అయ్య దుఃఖమోటి నిండిపోయి నిలుభూదోసు. 18 అయ్యులుకోరు క్లెయొపా ఇంగురాలు "యేరుషలేముకో కాపురం ఇందు గుండూ ఈ రోజులుకోరు అటి జరగక్కురు విషయాలు తెలిమాటారు వ్యక్తి నీను ఒండాలే ఇండుగాకీ" ఇండుసు. 19 ఆయన "ఎందు విషయాలు?"ఇండు కేకుసు. అప్పుడు అయ్య "నజరేతూ కు చెందిక్కురు యేసున గురించిక్కురు విషయాలే. ఆయన దేవురుట దృష్టికోరూ జనంగులు అడ్డేరు ట దృష్టికోరూ వాతుకుకోరూ పనులుకోరూ శక్తిఇక్కురు ప్రవక్తగా కీదు. 20 నమ్ముట ప్రధాన యాజకులు ఆధికారులు ఆయనన మరణశిక్షకు అప్పగించి, ఎనుగు సిలువ ఒడిక్కుసో నీకు తెలిమాదా? 21 ఇశ్రాయేలు జనంగులునా విడుదల సెయ్యురాలు ఈయనే ఇండు నంగులు ఆశించుకీరో. ఈ విషయాలడ్డీ మూనాళ్తుకు మిన్ని జరిక్కీదు. 22 కానీ నంగులు కోరు కొంతమంది పొంబిల్లాయ తల్లాపిట్లే సమాది అచ్చుకు పోయి అటి అస దేహం కనుభూగిల్లా ఇండు తిరిగి వంచు. 23 కొంతమంది దూతలు అయ్యులుకు కనుభూదు "ఆయన పెగిసే కీదిండు సోన్నుకీదు" ఇండు నంగులడ్డేరుకు సోన్నుపట్లీ నంగులుకూ ఎత్తునో ఆశ్చర్యం కలుగు కీదు. 24 నంగులాయ కొంతమంది సమాధి అచ్చుకు పోయి ఆ పొంబిల్లాయా సోన్నును తీరే ఉత్త సమాధిన పాకుసు గానీ ఆయనన పాకిల్లా " ఇండు ఆయనకు సొన్నుసు. 25 అత్తుకు ఆయన "అవివేకులారా, ప్రవక్తలు సొన్నిక్కురు వాతులడ్డీనా నమ్మారు మందమతులాయే, 26 క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి అస మహిమకోరు ప్రవేశించడం తప్పనిసరి అల్యా" ఇండు సొన్నుసు. 27 ఇంకా మోషే నుండి ప్రవక్తలడ్డేరు వరకూ లేఖనాలు అడ్డీకొరు అత్తు గురించి తెలిపిక్కురు వాతులుట అర్థంనా అయ్యులుకు తెలియజేన్చు. 28 అత్తును కోరే అస గ్రామం వంచు. ఆయన ఇంకా ఇంకా మిన్నుకు ప్రయాణం సెయ్యక్కురు తీరీ కనుభూచ్చు. 29 అదోటి అయ్య "పొగుదు మునగక్కుదు. చీకటి భుగక్కుదు. ఈ నామర్తికి ఇటే ఇరు" ఇండు ఆయనన అయ్య బలవంతం సేంచు. కాబట్టి ఆయన అయ్యోటి కూడా వూటుకోకు ఓసు. 30 ఆయన అయ్యోటి భోజనం కు కొంచుండు పట్లి, ఒండు రొట్టెన పుడుసు గుండు అత్తుకోసం కృతజ్ఞతలు సొన్ని, ఓడుసు తింగింగా అయ్యులుకు కుడుకుసు. 31 అప్పుడు అస కండ్లు తెరుదుగుండుసు. అయ్య ఆయనన గుర్తు పుడుకుసు. కానీ ఆయన అయ్యులుకు కనుభుగారుగుండా మాయమాసు. 32 అప్పుడు అయ్య "దావుకోరు ఆయన నమ్మురోటి వాచ్చుగుండూ లేఖనాలునా నంబురుకు అర్థం ఆగురు తీరీ సోన్నురుపట్లీ నమ్ముట హృదయాలు దహించుగుండు ఒంతీరీ అనిపించిల్యా" ఇండు సోన్నుగుండుసు. 33 అప్పుడే అయ్య ఎద్దిందు తిరిగి యేరుషలేముకు ఓసు. అటి పదకొండు మంది శిష్యులూ, అయ్యోటి ఇక్కురాయ కలుసుగుండు 34 "ప్రభువు నిజంగా ఎద్ధిన్ధు సీమోనుకు కనుభూచ్చు" ఇండు సోన్నుగక్కుదు. అయ్య ఇత్త కేటు 35 దావుకో జరిగిక్కురు సంగతులూ, ఆయన రొట్టె ఓడికడం వల్ల అయ్యులుకు ఇనుగ ప్రత్యక్షమాకీదో తెలియసేంచ్చు . 36 అయ్య ఇనుగ వాచ్చుగుండూ ఇందుగ్యా యేసే అయ్యులు మద్యకోరు నిలుభూదు "నింగులుకు శాంతి కలుగు గాక" ఇండుసు. 37 కానీ అయ్య నంగులుకు ఎందాదో ఆత్మ కనుభూదు కీదు ఇండుగుండూ బీతోటి హడలి పోసు. 38 అప్పుడు ఆయన "నింగులు ఎందాతుకు భీతుగక్కురంగా? నింగుట హృదయాలు కోరు సందేహం ఎందాతుకు పరుకక్కుదు? 39 నానే యేసు ఇండు ఇంగింగా రుజువుగా నట కీళ్లు, నట కాళ్లూ పారంగో. నన్న ముట్టుగుండూ పారంగో. నాకు ఇంతీరీ ఆత్మకు ఎముకలూ మాంసమూ ఇక్కుమాదు" ఇండు సొన్నుసు. 40 అనుగ సొన్ని అస కీళ్ళునా, కాళ్ళనా అయ్యులుకు కాటిక్కుసు. 41 కానీ అయ్య సంతోషమోటి తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మారుకుండా ఆశ్చర్యపోగుండూ కీదు. అప్పుడు ఆయన "నింగులచ్చి ఎందాదైనా ఆహారం కీదా?" ఇండు కేకుసు. 42 అయ్య సుట్టిక్కురు చాప ముక్కన ఆయనకు కుడుకుసు. 43 ఆయన అత్త వాంకుండు అస కండ్లు మిన్నే తింగుసు. 44 తర్వాత ఆయన "మోషే ధర్మశాస్త్రంకోరూ, ప్రవక్తల గ్రంధాలుకోరు, కీర్తనలుకోరు, నాన్న గురించి రాసిక్కురాయడ్డీ నెరవేరసికి ఇండు నాను నింగులోటి ఇందుపట్లి సోన్నికీరీ అల్యా" ఇండుసు. 45 అప్పుడు లేఖనాలను గ్రహించురు తీరీ ఆయన అస మనస్సులున తెరుచుసు. 46 "క్రీస్తు హింసలు పొంది సొత్తోయి మూడోరోజున సోత్తోఇక్కురాయకోనుండి ఎద్ధిక్యాదు ఇండు, 47 యెరూషలేముకో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేరుమేని పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగాదిండు రాసీ కీదు. 48 నింగులు ఈ విషయాలడ్డీకి సాక్షులు. 49 కేరంగో, నంగావు సేందిక్కురు వాగ్ధానం నా నింగులు మేనికి అంపూడక్కిరీ. నింగులు మేని నుండి శక్తి పోందురొరుకు పట్టనంకో రే ఇరంగో" ఇండు అయ్యులుకు సొన్నుసు. 50 ఆయన బేతనియ వరకూ ఆయ్యులున వాంకుండు పోయి కీళ్లుపెచ్చి ఆయ్యులున ఆశీర్వదించుసు. 51 అనుగ ఆయ్యులున ఆశీర్వదించుగుండూ ఇందుగ్యానే ఆయన అయ్యులు నుండి వేరై పరలోకంకు ఆరోహనం ఆసూ. 52 అయ్య ఆయనన ఆరాధించి గొప్ప ఆనందమోటి యేరుషలేముకు తిరిగి వెళ్లుసు. 53 దేవాలయంకో నిరంతరం ఇందుగుండూ దేవురున కీర్తించు గుండూ, ఆరాధించు గుండూ ఉన్నారు.