అధ్యాయం 15

1 తర్వాత ఒండు సారి పన్నులు సెయ్యురాయ, పాపులూ అనేకమంది ఆయన ఉపదేశం కేకింగా ఆయన అచ్చుకు వంచు. 2 పరిసయ్యులూ, ధర్మశాస్త్ర పండితులూ అత్తు పాతు "ఈ మోనుసు పాపులున దగ్గరకు వారించుగుండు అయ్యోటి కలిసి భోజనం సేయ్యక్కుదు" ఇండు సనుగుండుసు. 3 అత్తు ఆయన అయ్యులుకు ఈ ఉపమానం సొన్నుసు. 4 "నింగులు కోరు ఏ మొనుషుకు ఆగోటు నూరు గొర్రెలు ఇందు అవుల్లి ఒండు తప్పోనుగ్యా అదు మిగిలిక్కురు తొంభైతొమ్మిది గొర్రెలు న అడవికో వుట్టూటు, పోయి ఆ తప్పోఇక్కురు గొర్రె దొరుకురత్తున వరకూ దేవుమాదా" 5 అదు దొరుకునుపట్లీ సంతోషమోటి అత్త భుజాలమేని ఓటుగుండూ వూటు వందు జాతగాళ్లనా, వూటు పక్కులాయన కూటు 6 'నింగులు నన్నోటి కలిసి సంతోషించంగో. ఎందాతుకు ఇండుగ్యా తప్పోఇక్కురు నట గొర్రె దొరుక్కీదు' ఇండు అయ్యోటి సోన్నుకీదు అల్యా. 7 అనిగే పశ్చాత్తాపం అవసరమిల్లారు తొంభైతొమ్మిది మంది నీతీ మంతుల విషయంకో కలుగురు సంతోషం కన్నా పశ్చాత్తాపం పొందురు ఒండు పాపి విషయమై పారలోకంకో ఎక్కువ సంతోషం కలుగాదు. 8 ఒండాయమ్మ కు పది వెండి నాణేలు ఇందు అయ్యులుకోరు ఒండు ఓనిగ్యా ఆమె అత్తుకోసం దీపం అంటిచ్చు వూడడ్డీ తుగుతూ, ఓఇక్కురు నాణెం దొరుకురువరకూ జాగ్రత్తగా దేవుమాదా? 9 ఆ నాణెం దొరుకునుపట్లీ ఆమె జతగాడిసిమార్లున పక్కువుటాయన కూటూ "నాను ఓగడుసుగుండిక్కురు నాణెం దొరుక్కీదు కాబట్టి నన్నోటి కలిసి సంతోషించంగో" ఇంగ్యాదు అల్యా. 10 అనిగే పశ్చాత్తాపం పొందురు పాపి న గురించి పరలోకంకో దేవురుటా దూతల సముఖంకో సంతోషం కలుగాదిండు నింగులుకు సోన్నక్కిరీ" ఇండు ఇండుసు. 11 ఆయన ఇంకా ఇనుగ ఇండుసు, "ఒండు మొనుషుకు రెండాలు మక్కులు కీదు. 12 అయ్యులుకోరు చిన్నాలు 'ఆవుటా, ఆస్తికోరు నట వాటా నాకు పంచి తా' ఇండుసు. తేపు అస ఆస్తిన అయ్యులుకు పంచి కుడుకుసు. 13 కొన్ని రోజుల తరువాత చిన్న మగు అత్తుకు ఇక్కుదడ్డీ కూడగట్టుగుండూ ఒండు దూర దేశంకు ప్రయాణమై ఓసు. అటి అస లెక్కడీ చెడు వ్యసనాలకు విచ్చల విడిగా ఖర్చు సేంచు. 14 అడ్డీ కర్చుఐపోయాక ఆ దేశంకో తీవ్రమైన కరువు వందుకీదు. అత్తుకు ఇబ్బందులు మొదులాసు. 15 అదోటి అదు పోయి ఆ దేశంకో ఒండు వ్యక్తచ్చి పనికి సేరుసు. ఆ వ్యక్తి ఇత్త అస పందులు మేపింగా అస కోళ్లుకోకు అంపుడుసు. 16 అదు ఆ పందులు తింగురు పొట్టోటి అస వరుగు నింపుగస్సికిండు ఆశ భూచ్చు. కానీ అత్తుకు యాదు ఎందాదు కుడుకిల్లా. 17 ఇండుగ్యా బుద్ధి వందుపట్లీ అదు ఇనుగ ఇండుగుండుసు, 'నంగావచ్చి ఎత్తునో మంది కూలీలకు కలి పుష్కలంగా కీదు. నాణేన్ధో ఇటి కలి పేస్సేందు సోత్తోగక్కిరీ. 18 నాను ఎద్ధిందు నంగావచ్చుకు ఎల్లిపోక్కిరీ. ఓ వా , నాను పరలోకం కు విరోధంగానూ నిట దృష్టికోరూ పాపం సేందుకీరీ. 19 ఇంక నుండి నింమగు ఇండు ఇంబిచ్చుగింగా నాకు ఏ అర్హత ఇల్లా. నన్న నిట కూలాయ కోరు ఒండాలుగా ఎచ్చుగో ఇండు సొన్నాకీ'. ఇనుగ ఇండుగుండు అదు ఎధిందు అదుగు తేపచ్చుకు వంచు. 20 అదు ఇంకా దూరంగా ఇందుపట్లే తేపు అత్తుపాతు కనికరం భూదు, వటారుదుగుండు పోయి కౌగిలించుగుండు ముద్దు ఎచ్చుగుండుసు. 21 అప్పుడా మగు తేపోటీ "ఓ వా , నాను పరలోకముకు విరోధంగానూ నిట దృష్టికోరు పాపం సేందుకీరీ. ఇక నుండి నింమగు ఇండు సోనిగింగా నాకు ఏ యోగ్యతా ఇల్లా" ఇండు ఇండుసు. 22 ఇండుగ్యా తేపు అస దాసులోటి "శ్రేష్టమైన బట్టలు ఎతేందు ఇత్తుకు ఓడంగో. ఇస కీకి ఉంగరం ఎచ్చు, కాళ్లకు చెప్పులు తొడగంగో . 23 క్రొవ్విక్కురు దూడన ఎత్తేందు వదించంగో. నంబురు తిండ్రు సంబరాలు సేందుగంబంగా. 24 నట ఈ మగు సొత్తోయి మల్లీ పెగిసికీదు. తప్పి పోయి మళ్ళీ దొరుసు." ఇండు సొన్నుసు. అప్పుడు అయ్యడ్డేరు సంబరాలు సేందుగుదు మొదలెక్కుసు. 25 ఆ సమయంకో అదుగు బేరు మగు కొల్లుకోరు కీదు. అదు వూటుకు దగ్గరగా వందుపట్లీ సంగీతం, నాట్యధ్వని అత్తుకు వినుభూచ్చు. 26 ఒండు దాసున్న కూటూ "ఎందాదు జరగక్కుదు?" ఇండు కేకుసు. 27 ఆ పనాలు అదోటి "నింగుతెమ్మి వందుకీదు. అదు నింగావచ్చుకు క్షేమంగా తిరిగి వందు ఇక్కుతుకు నింగావు కోవ్విక్కురు దూడన వధించికీదు" ఇండు సొన్నుసు. 28 అదోటి బేరుమగుకు కోపం వందు ఉల్లికి ఓగింగా ఇష్టుభుగిల్లా. అదుగు తేపు బెల్లికి వందు అత్త ఉల్లికి వా ఇండు బతిమాలుసు. 29 కానీ అదు "ఇద్ధో కేరు, ఇత్తును సంవత్సరాల నుండి నీకు సేవలు సేయ్యక్కిరీ. ఏనాడూ నిట వాత జవాదాటిల్లా. అయినా నట జతగాల్లోటి కలిసి సంబరాలు సేందుగింగా నీను నాకు ఒండు మేకపిల్లను కూడా తారిల్లా. 30 కానీ నిట ఆస్తిన వేశ్యలకు ఖర్చు సేందిక్కురు నింమగు వారార్తుకోరే అత్తుకోసం క్రొవ్విన దూడన వధించుకీరా" ఇండూ నిష్టూరంగా వాచ్చుసు. 31 అత్తుకు అదుగు తేపు "నాయనా, నీను ఇప్పుడు నన్నచ్చే కీరా. నటాయడ్డీ నిటాయే. 32 నంబురు సంతోషంగా పండుగ సేందుగసికిక్కుదే. ఎందాతుకు ఇండుగ్యా నింగు తెమ్మి సొత్తోయి పెగుసు కీదు, తప్పిపోయి దొరుకుసు" ఇండు సొన్నుసు.